Guava Banana : జామ అరటి వీటిల్లో ఏది బెస్ట్.. ఆరోగ్యానికి ఈ రెండిట్లో ఏది మంచిది…!
ప్రధానాంశాలు:
Guava Banana : జామ అరటి వీటిల్లో ఏది బెస్ట్.. ఆరోగ్యానికి ఈ రెండిట్లో ఏది మంచిది...!
Guava Banana : నేటి జీవనశైలిలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే వారి ఆరోగ్యం పై శ్రద్ధ చూపించడం లేదు. ఈ క్రమంలోనే మంచి ఆరోగ్యం Health కోసం మీ రోజు వారి ఆహారం తో పాటుగా కొన్ని పండ్లను తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే పండ్లలో అరటి ,జామ పండ్లు అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగించినప్పటికీ ఈ రెండిట్లో ఏది ఆరోగ్యకరమైనది అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జామ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, బి, మరియు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ పండు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఈ పండు ఆమ్లత ను ఎదుర్కోవడంతో పాటు శరీరాన్ని వైరస్ నుండి కాపాడుతుంది. జీర్ణక్రియ మెరుగ పని చేయడంలో సహాయపడుతుంది. అయితే బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ పండ్లు గొప్ప ఎంపిక. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. అతిగా తినడానికి ఇవి నివారిస్తాయి.

Guava Banana : జామ అరటి వీటిల్లో ఏది బెస్ట్.. ఆరోగ్యానికి ఈ రెండిట్లో ఏది మంచిది…!
సూర్యుడి నుండి వచ్చే అతిలోహిత కిరణాల వలన కలిగే సమస్యల నుండి చర్మాన్ని కాపాడడంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఈ పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు పిరియడ్స్ నొప్పితో బాధపడినప్పుడు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే చెడు కొలెస్ట్రాలను తగ్గించి రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.సాధారణంగా కొంతమంది రోజుకి కనీసం ఒక అరటిపండు అయినా తింటారు. ఎందుకంటే ఇందులో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ బి 6, నియాసిన్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇలా వీటిని తరచూ తినడం వలన అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో అరటిపండు ముఖ్య పాత్రను పోషిస్తుంది. అంతేకాకుండా క్యాల్షియం అధికంగా ఉండే అరటిపండును తినడం వలన దంతాల ఆరోగ్యం మరియు ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
ముఖ్యంగా ఈ రెండు పండ్లను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లలో ఉండేటువంటి విటమిన్ సి ఫైబర్ ఆంటీ యాక్సిడెంట్లు లక్షణాలు సమృద్ధిగా లభించడం వలన ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి జామ పండు మంచి ఎంపిక ఎందుకంటే ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దానితో పాటుగా శరీర శక్తిని పెంచడంలో అరటి పండు గొప్ప ఎంపిక. ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామనికి ముందు లేదా తర్వాత ఈ పంటను తీసుకోవడం వలన శరీరానికి శక్తి లభిస్తుంది.