Guppedantha Manasu 2 Sep Today Episode : వసు చివరి పరీక్ష రాస్తుందా? తన లక్ష్యం నెరవేరుతుందా? దేవయాని, సాక్షి ప్లాన్ సక్సెస్ అవుతుందా? రిషి ఏం చేస్తాడు?

Authored By Varun G | The Telugu News | Published on: September 2, 2022, 9:30 am

Guppedantha Manasu 2 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 545 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి, గౌతమ్ కాలేజీకి వస్తారు. ఆ తర్వాత మహీంద్రా, జగతి కూడా కాలేజీకి వస్తాడు. అంతటా వెతుకుతారు కానీ.. ఎక్కడా వసుధర కనిపించదు. నేను రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. మీరు వెళ్లండి అంటాడు రిషి. దీంతో మహీంద్రా, జగతి, గౌతమ్ ఇంటికి వెళ్లిపోతారు. గెస్ట్ హౌస్ కు వెళ్లిన తర్వాత రిషి.. వసు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైందో తెలియక పిచ్చెక్కుతుంది. మళ్లీ ఫోన్ చేస్తాడు. అయినా స్విచ్ ఆఫ్ వస్తుంది. వసుధరకు ఏమైంది. రేపు ఎగ్జామ్ ఉంది కదా.. ఎక్కడికి వెళ్లావు వసుధర అని అనుకుంటాడు. అక్కడే సోఫా మీద పడుకుంటాడు రిషి. లేచి చూసేసరికి ఉదయం అవుతుంది. 8.30 అవుతుంది. ఎగ్జామ్ టైమ్ అవుతోంది. వసుధర ఎక్కడ ఉంది అని టెన్షన్ పడుతుంటాడు రిషి. ఫోన్ చేస్తాడు కానీ.. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈరోజు వసుధర ఎగ్జామ్ రాయకపోతే తను అనుకున్న గోల్ ఏం కావాలి. వసుధర ఎక్కడికి వెళ్లావు అని అనుకుంటాడు రిషి.

guppedantha manasu 2 september 2022 full episode

guppedantha manasu 2 september 2022 full episode

ఇంతలో మహీంద్రా, జగతి వస్తారు. వసుధర గురించి ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు. దీంతో తెలియలేదు అంటారు. వసుధర ఎక్కడికి వెళ్లిందో మీకైనా తెలిసిందా మేడమ్ అని అడుగుతాడు. మేమందరం వసు ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి అడిగాం. ఎవ్వరూ తెలియదు అని చెబుతున్నారు అంటుంది జగతి. ఇంతలో పుష్ప వస్తుంది. తనకు కూడా తెలియదు అంటుంది. రిషి టెన్షన్ పడుతుంటే ఎగ్జామ్ కు టైమ్ అవుతోంది. ఆ ఏర్పాట్లు చూడాలి అని అంటాడు మహీంద్రా. దీంతో మీరు వెళ్లండి అంటాడు రిషి. తర్వాత కాలేజీ లోపలికి వెళ్తాడు రిషి. నాకోసం అయినా కనిపించు వసుధర అని అనుకుంటాడు. ఏం చేయాలో తనకు తెలియదు. గుడ్ మార్నింగ్ సార్.. మీరు జెంటిల్ మెన్ సార్ అంటూ వసుధర తనను అంటున్నట్టుగా కలగంటాడు రిషి.

ఇంతలో తనకు వసుధర బ్యాగు నుంచి కింద పడ్డ గోలీలు కనిపిస్తాయి. వాటిని చూస్తూ వెళ్తాడు రిషి. వసుధర దాచుకున్న గోలీలే కదా ఇవి అనుకొని వాటిని చూస్తాడు. అక్కడ ఉన్న రూమ్స్ లో చెక్ చేస్తాడు. కానీ.. వసుధర కనిపించదు. మరో రూమ్ కు వెళ్తాడు. అక్కడ తన కాళ్లు కనిపిస్తాయి. అక్కడికి వెళ్లి చూసి షాక్ అవుతాడు. వసుధర కింద పడిపోయి ఉండటం చూసి వసుధర నీకు ఏమైంది అని అడుగుతాడు.

Guppedantha Manasu 2 Sep Today Episode : వసుధరను లేపేందుకు ప్రయత్నించిన రిషి

వసుధర లే అని ఎంత చెప్పినా వసుధర లేవదు. ఇంతలో గౌతమ్ వస్తాడు. తను ఇక్కడ పడిపోయింది. వెంటనే డాక్టర్ ను తీసుకురా అంటాడు రిషి. వసుధరను లేపి అక్కడి నుంచి తీసుకెళ్తాడు రిషి. తన రూమ్ లో సోఫా మీద కూర్చోబెడతాడు. నీళ్లు కొట్టినా కూడా వసుధర లేవదు.

దీంతో రిషికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నీకు ఎగ్జామ్ ఉంది. ఇది నువ్వు రాసి తీరాలి వసుధర అంటాడు రిషి. నీళ్లు తాగు వసుధర అంటాడు. కానీ.. వసుధర లేవదు. నువ్వు ఎగ్జామ్ రాయాలి. నీకు లక్ష్యం ఉంది. నువ్వు యూనివర్సిటీ టాపర్ అవ్వాలి అంటాడు.

మరోవైపు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. జగతి ప్రశ్నాపత్రాలు తీసుకెళ్తుంది. తనకు ఏమైంది అని అనుకుంటుంది. ప్రశ్నాపత్రాలు ఇచ్చేశాక.. పరీక్ష స్టార్ట్ కాగానే మేడమ్ ప్రశ్నాపత్రం అంటూ వచ్చి అడుగుతుంది వసుధర. దీంతో జగతి సంతోషిస్తుంది. సరే సరే ముందు ఎగ్జామ్ రాయి. తర్వాత మాట్లాడుదాం అంటుంది జగతి.

పరీక్ష రాయడానికి వసు ప్రయత్నిస్తుంది కానీ.. పరీక్ష రాయలేకపోతుంది. తన కళ్లు బైర్లు కమ్ముతాయి. నేను పరీక్ష రాయాలి.. నేను రాస్తాను అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp