Guppedantha Manasu 18 Oct Today Episode : ఇంటర్వ్యూకు అటెండ్ కాకుండా వెళ్లిపోయిన జగతి.. మేడమ్ లేకుండా తాను కూడా ఉండనని వెళ్లిపోయిన వసుధర.. దీంతో రిషీ, మహీంద్రా ఏం చేస్తారు?
Guppedantha Manasu 18 Oct Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 అక్టోబర్ 2021 ఎపిసోడ్ 271 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జగతి మేడమ్ కారు వేసుకొని వెళ్లి ఒంటరిగా ఒక చోట ఆగి తెగ బాధపడిపోతుంది. దమయంతి ఉచ్చులో చిక్కుకున్నా అని రిషి పసిగట్టలేకపోతాడు. తనను ఇంటర్వ్యూకు కూడా రావద్దని.. తన ఫ్యామిలీలో ఇన్వాల్వ్ కావద్దని చెబుతాడు రిషి. దీంతో ఏం చేయాలో జగతికి అర్థం కాదు. నాన్నా రిషి.. అమ్మను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకున్నావని కొత్తగా అపార్థం చేసుకోవడానికి అని అనుకొని బాధపడుతుంది జగతి.

guppendantha manasu 18 october 2021 full episode
నువ్వు నన్ను కాదన్నా.. నువ్వు ఎప్పుడు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. అమ్మగా ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ మై సన్.. అంటూ అనుకుంటుంది జగతి. మరోవైపు మహీంద్ర, వసుధర.. ఇద్దరూ కారు దగ్గరికి వెళ్లడం చూసిన రిషీ.. చానెల్ వాళ్లు వస్తున్నారు.. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు రిషి. జగతి కాలేజీ నుంచి వెళ్లిపోయిందట. ఈ కాన్సెప్ట్ తనదే. ఇంటర్వ్యూ టైమ్ కు తను లేకపోతే ఎలా? అని అంటాడు మహీంద్రా. మీరిద్దరు అందుకని బయలుదేరారా? అని ప్రశ్నిస్తాడు రిషి. డాడీ.. వెళ్లిన వాళ్ల గురించే ఆలోచిస్తారా? వచ్చే వాళ్ల గురించి ఆలోచించరా.. అని అంటాడు రిషీ. అదుగో చానెల్ వాళ్లు వచ్చారు. ఇప్పుడు మీరు వెళ్తే ఎలా డాడీ అంటాడు రిషీ. ఏదున్నా తర్వాత మాట్లాడుకుందాం. చానెల్ వాళ్లు వచ్చారు.. ముందు వెళ్దాం పదండి.. అంటాడు రిషీ. సారీ సార్.. మేడమ్ లేకుండా నేను ఆ ఇంటర్వ్యూకు రాను సార్ అంటుంది వసుధర. నువ్వు నా అసిస్టెంట్ వి అన్నా కూడా వసుధర వినదు. చానెల్ వాళ్లు వచ్చారు అన్నా కూడా వినదు. నీకు నేనెక్కువా? మీ మేడమ్ ఎక్కువా? అని అడుగుతాడు రిషీ. సందర్భాన్ని బట్టి ఎక్కువ తక్కువలు మారుతుంటాయి అని అంటుంది వసుధర.
Guppedantha Manasu 18 Oct Today Episode : జగతి మేడమ్ లేకుండా ఈ ఇంటర్వ్యూకు అటెండ్ కానని చెప్పిన వసుధర
నేను మేడమ్ లేకుండా ఈ ఇంటర్వ్యూలో ఉండలేను సర్ అంటుంది వసుధర. నేను మేడమ్ ను తీసుకొస్తా అని మహీంద్రకు చెబుతుంది వసుధర. దీంతో మహీంద్రను రిషీ లాక్కెళ్తాడు. మీరు కూడా వెళ్తారా? ఎవరు ఉన్నా లేకున్నా ఇంటర్వ్యూ ఆగదు డాడీ. మీరు నా పక్కన ఉండండి అది చాలు నాకు అంటాడు రిషీ.

guppendantha manasu 18 october 2021 full episode
కట్ చేస్తే దమయంతి తెగ టెన్షన్ పడుతుంటుంది. ధరణిని పిలిచి.. వసుధరకు ఫోన్ చేయి అంటుంది. ఇంతలో ఆటోలో వెళ్తున్న వసుధర.. మేడమ్ ఎక్కడికి వెళ్లినట్టు. ఫోన్ చేస్తే తీయడం లేదేంటి అని అనుకుంటుంది. ఇంతలో ధరణి… వసుధరకు ఫోన్ చేస్తుంది. అక్కడ ప్రోగ్రామ్ బాగా జరుగుతుందా? అని అడుగుతుంది. దీంతో నేను కాలేజీలో లేను అంటుంది వసు. మేడమ్ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయారు. తనకోసమే వెతుకుతున్నాను అంటుంది వసుధర. ఇంతలో దమయంతి ఫోన్ కట్ చేస్తుంది.
మరోవైపు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. జగతి ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లింది అని అందరూ మహీంద్రను అడుగుతారు. మహీంద్రా ఫోన్ చేసినా కట్ చేస్తుంది జగతి. మరోవైపు వసుధర నువ్వు చేసింది తప్పు.. నా ఇంటర్వ్యూ చూడు… లింక్ పంపిస్తున్నా అని చెప్పి మెసేజ్ పంపిస్తాడు రిషీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.