Hansika : ఆ స్టార్ హీరోతో మళ్లీ ప్రేమలో పడిన హన్సిక..త్వరలోనే పెళ్లి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hansika : ఆ స్టార్ హీరోతో మళ్లీ ప్రేమలో పడిన హన్సిక..త్వరలోనే పెళ్లి?

 Authored By mallesh | The Telugu News | Updated on :23 August 2022,6:20 pm

Hansika : కేవలం పదిహేనేళ్ల వయస్సులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల జాబితాలో మిల్కీబ్యూటీ హన్సిక పేరు మొదట వినిపిస్తుంది. బాల నటిగా చిన్నతనం నుంచే పలు సినిమాల్లో నటించిన హన్సిక.. ఉన్నట్టుండి కొంతకాలం కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా మళ్లీ అదిరిపోయే అందం, గ్లామర్, బాడీ స్ట్రక్చర్‌తో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతో అటు ఫిలిం ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Hansika : ఒకే వ్యక్తితో రెండోసారి కనెక్ట్

హన్సిక తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో వెండితెరపై కనిపించింది.అప్పుడు హన్సిక అందం, గ్లామర్ షో చూసి ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరుసటి రోజు నుంచి ఆమెకు ఫాలోవర్స్ గా మారిపోయారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి ఈ అమ్మడుకు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసిన హన్సిక అలనాటి సీనియర్ నటి కుష్బును పోలి ఉందని చాలా మంది మాట్లాడారు. అంతేకాకుండా హన్సిక కోసం ఫ్యాన్స్ గుడి కట్టారని కూడా అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా హన్సిక పెళ్లిచేసుకోబోతోందని టాక్ వినిపిస్తోంది.

Hansika Love Again That Star Hero Will Marriage Soon

Hansika Love Again That Star Hero Will Marriage Soon?

కోలీవుడ్ ల‌వ‌ర్ బాయ్ శింబు, హన్సిక గతంలో లవ్‌లో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరు డేటింగ్‌లో కూడా ఉన్నార‌ని.. త్వరలోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్కే అవ‌కాశం ఉంద‌ని జోరుగా ప్రచారం సాగింది. కానీ అనుకోకుండా వీరిద్దరూ విడిపోయారు. శింబు,హ‌న్సిక ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు తన ప్రియురాలి కోసం శింబు ఏదైనా చేసేవాడు.ఆమె ఫారిన్‌ షూటింగ్‌కు వెళ్లిందని తెలిసి అక్కడికి కూడా వెళ్లేవారని తెలిసింది. అనుకోకుండా అయిన బ్రేక‌ప్ త‌ర‌వాత చాలా కాలం పాటూ వీరిద్ద‌రూ క‌లిసి సినిమాలు చేయ‌లేదు. ఇటీవల హన్సిక ఒక యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేయగా.. ఓ అభిమాని శింబు గురించి అడుగగా ప్రేమలో విడిపోయిన వాళ్లు స్నేహితులుగా ఉండలేరా? అని ప్రశ్నించింది అంట.. అంటే వీరు మళ్లి కలిసిపోయారని అంతా భావించారు. ఈ క్రమంలోనే హన్సిక శింబుతో పెళ్లికి సై అన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది