Hema: మూడు కోట్లు మాయం అంటూ మా అధ్యక్షుడు నరేష్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hema: మూడు కోట్లు మాయం అంటూ మా అధ్యక్షుడు నరేష్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు

 Authored By govind | The Telugu News | Updated on :8 August 2021,11:30 am

Hema: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు గతంలో కంటే ఈ సారి వాడి వేడిగా సాగేలా ఉందని గత కొన్ని రోజులుగా నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే
అర్థమవుతోంది. గతంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సామరస్యంగా జరుపుకే వారు. ఎవరు గెలిచినా మా కోసమే అని చెప్పుకునేవారు. కానీ ఈసారి మాత్రం అలాంటి వాతారవరణం కనిపించడం లేదు. మొదట ప్రకాశ్ రాజ్ బరిలో దిగుతున్నట్టు ప్రకటించగా, ఆ తర్వాత మంచు విష్ణు దిగుతున్నట్టు ప్రకటించాడు. ఆ వెంటనే జీవిత, హేమ, సివిఎల్ నరసింహా రావు ప్రకటించారు.

hema passed comments on naresh

hema passed comments on naresh

దాంతో రచ్చ మొదలైంది. పెద్దలు ఎంత ప్రశాంతంగా సెప్టెంబర్ లో మా ఎన్నికలు జరపడానికి ప్రయత్నిస్తున్నప్పటికి సాధ్యపడేలా కనిపించడం లేదు. ఎవరో ఒకరు
డ్రాపవుతారనుకుంటే అందరు మా కుర్చీ మాకు కావాలి అంటూ భీష్మించుకు కూర్చుకున్నారు. ఇక ఎవరి ఎజెండా ఏంటో త్వరలో వెళ్ళడిస్తామని అంటున్నారు. కాగా దీనికి సంబంధించి నటి హేమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం హేమతో పాటు ఉన్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్, సివిఎల్ నరసింహారావు, జీవితలలో ఎక్కువ పోటీ మాత్రం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య ఉండేలా అనిపిస్తోంది.

Hema: వీకే నరేష్‌పై కూడా సంచలన ఆరోపణలు చేసిన హేమ

అయితే మా ఎన్నికలు ఏకగ్రీవం ఉండకుండా చూడాలంటూ హేమ తన బృందంలోని సభ్యులందరికీ వాయిస్ మేసేజ్‏లు పంపడం ఇప్పుడు వైరల్ గా మారింది. అందరినీ
కలవలేని పరిస్థితి. అందుకే ఇలా వాయిస్ మెసేజ్ పంపుతున్నాను అని క్లారిటీ కూడ ఇచ్చారు హేమ. ఇదే సమయంలో మా అధ్యక్షుడు వీకే నరేష్‌పై కూడా సంచలన ఆరోపణలు చేసింది. ఈయన సంపాదించింది లేదు కానీ ఉన్నదంతా కూర్చుని ఖర్చు పెడుతున్నాడంటూ ఆరోపణలు చేయడం సంచలనం అయింది. తాజాగా తన బృందానికి పంపిన వాయిస్ మెసేజ్‌లో ఉందేంటో చూద్దాం..

“హాయ్ అండి.. ఈ మెసేజ్ అందరికీ ఒకేసారి కామన్‌గా పంపిస్తున్నాను.. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నాను.. మా అసోషియేషన్ ఎలక్షన్స్ పెట్టకూడదు.. నరేష్‌ గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆయన అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సంపాదించింది లేదు. పైగా ఉన్న డబ్బులనే కూర్చుని మరీ ఖర్చు చేస్తున్నారు. మొత్తం ఉన్న రూ. 5 కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు.. పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం 2.5 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క.

Hema: అలా మనం సంతకాలు చేయాలి. నేను మనిషిని పంపిస్తాను.

ఆఫీస్ ఖర్చులు అన్నీ కలిపి దాదాపు అదే మొత్తం అవుతుంది. అప్పట్లో ఆఫీస్ ఖర్చులు ఏమైనా ఉంటే బయటి నుంచి తీసుకొచ్చేవాళ్లం. కానీ అకౌంట్‌లో ఉన్న డబ్బులను వాడుకునేవాళ్లం కాదు. కానీ ఇప్పుడాయన అలా కాదు. మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. పైగా ఆ కుర్చీ దిగకూడదు.. ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు. అందుకే ఖచ్చితంగా మా ఎన్నికలు రావాలి. అలా మనం సంతకాలు చేయాలి. నేను మనిషిని పంపిస్తాను. సంతకాలు చేసి ఇవ్వండి. నేను మా అసోసియేషన్‏కు ఇచ్చేస్తా. ఈ సంవత్సరం మెడికల్ క్లైమ్.. అన్నీ కట్టేస్తే.. వచ్చే సంవత్సరం పెన్షన్లు ఇచ్చుకోవడానికి మన దగ్గర డబ్బులు మిగలవు. అందుకే మనకు ఎన్నికలు కావాలి అని సంతకాలు పెట్టండి” అంటూ హేమ వాయిస్ మెసేజ్ పంపింది. ప్రస్తుతం ఈ వాయిస్ మెసేజ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది