karthika Nair : కాబోయే భర్త ఫోటోను రివీల్ చేసిన ఎన్టీఆర్ మరదలు..!
ప్రధానాంశాలు:
karthika Nair : కాబోయే భర్త ఫోటోను రివీల్ చేసిన ఎన్టీఆర్ మరదలు..!
karthika Nair : సీనియర్ నటి రాధ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన రాధ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కోలీవుడ్ కి చెందిన రాధ తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించిన ఈమె పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈమె తన ఇద్దరు కుమార్తెలను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ వారు రాధ స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.
ఇక రాధ పెద్ద కుమార్తె కార్తీక తెలుగులో నాగచైతన్య నటించిన ‘ జోష్ ‘ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత రంగం, ఎన్టీఆర్ తో ‘ దమ్ము ‘ సినిమాలు చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్కు మరదలుగా నటించారు. కానీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్ గా ఆమెకు సక్సెస్ లో రాకపోవడంతో ఇండస్ట్రీ కెరియర్ చాలా త్వరగానే ముగిసింది. కానీ వ్యాపార రంగంలో మంచి సక్సెస్ను అందుకున్నారు. అయితే కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈమె నిశ్చితార్థపు ఫోటోలను రాధ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
ఆ ఫోటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. అయితే కార్తీక తనకు కాబోయే భర్త ఫేస్ ను రివిల్ చేయకుండా దాచారు. అయితే పెళ్లి దగ్గర పడుతుండడంతో కార్తిక తనకు కాబోయే భర్త రోహిత్ మీనన్ తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ నిన్ను కలవటం డెస్టినీ ప్రకారం జరిగింది. నీతో ప్రేమలో పడటం మ్యాజిక్. నీతో జీవితాన్ని పంచుకునేందుకు కౌంట్ డౌన్ ప్రారంభించా అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో కార్తీక ప్రేమ వివాహం చేసుకుంటున్నారు అని తెలుస్తుంది. అలాగే ఆమెకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు.