Heroine : స్టార్ హీరోయిన్‌కి అది వేసుకునే అల‌వాటు లేదట‌.. ఆశ్చ‌ర్యపోతున్న అభిమానులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine : స్టార్ హీరోయిన్‌కి అది వేసుకునే అల‌వాటు లేదట‌.. ఆశ్చ‌ర్యపోతున్న అభిమానులు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :31 August 2022,1:40 pm

Heroine : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనా క‌పూర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన కూడా త‌న లేలేత అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంటుంది. రాజ్‌కపూర్‌ మనవరాలు అనే ప్రివిలేజ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. తన నటనాకౌశలాన్ని నిరూపించుకుంటూ కొనసాగుతున్న నటి కరీనా కపూర్‌. తమ సినిమాల్లో కథానాయికగా కరీనాయే కావాలి అని హీరోలు పట్టుబట్టే స్థాయికి రాగానే తానూ ఓ డిమాండ్‌ లిస్ట్‌ను ప్రొడ్యూసర్స్‌కు పంపడం మొదలుపెట్టింది కరీనా. ‘ఏ గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ల సరసనే నటిస్తా.. బి గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ల సరసన నటించను. సో నన్ను తమ సినిమాల్లో హీరోయిన్‌గా కావాలి అనుకుంటున్న హీరోల రేంజ్‌ చూసుకున్నాకే నాకు చెప్పండి’ అంటూ. దాంతో మంచి మంచి సినిమాలెన్నింటిలోనో నటించే చాన్స్‌ను కోల్పోయిందట కరీనా.

Heroine : ఇలా చేస్తుందా?

కరీనా కపూర్ ఇద్దరు బిడ్డలకు పెళ్లయిన ఇప్పటికీ ఎంత అందంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నం. పర్ఫెక్ట్ ఫిగర్ తో పర్ఫెక్ట్ సైజులతో కుర్రాలను అట్రాక్ట్ చేస్తుంది . కరీనాకపూర్ వ్యాయామాలు చేసిన ఒకే ఒక్క అలవాటు కారణంగా అమ్మడు ఇప్పటికి చక్కటి పొజిషన్లో ఉందట. ఇక ఫుడ్ విష‌యంలోను ఈ అమ్మ‌డు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కరీనాకపూర్ ఇప్పటివరకు పంచదార అనేది వాడదట. తాను హీరోయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు తన పంచదార ఏ ఐటెం లోను వేసుకోనంటూ కరీనాకపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందట.

heroine Kareena Kapoor Do not use sugar

heroine Kareena Kapoor Do not use sugar

పంచదార వ‌ల‌న ఫ్యాట్ పెరిగి వెయిట్ వచ్చేస్తామని భావించిన క‌రీనాకపూర్.. ఇప్పటివరకు షుగర్ ను ఏ ఐటెం లోను వేసుకోలేదట. అంతేకాదు తన బిడ్డలకి కూడా ఏ ఐటెంలోనూ షుగర్ లేకుండానే ఫుడ్ పెడుతుందట. చీటింగ్ డైట్.. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పంచదార తీసుకోవడం.. దానికి తగ్గట్టు పక్క రోజు వ్యాయామాలు చేస్తూ ఉంటారు. దాదాపు 17 ఏళ్ల నుంచి పంచదార తీసుకోకుండా క‌రీనా ఉంటుంద‌నే విష‌యం తెలుసుకున్న అభిమానులు గ్రేట్ అని ప్ర‌శంసిస్తున్నారు. కాగా క‌రీనా రీసెంట్‌గా హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా వచ్చిన లాల్ సింగ్ చ‌ద్దా అనే చిత్రంలో న‌టించింది. ఈ మూవీ దారుణంగా నిరాశ ప‌ర‌చింది.. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగ చైత‌న్య కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు నుంచే బాయ్‌కట్‌ లాల్‌ సింగ్‌చడ్డా అంటూ కొందరు నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది