Heroine : ” నాకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా మగాళ్ళు నాకోసం పడి చచ్చే వాళ్ళు ” హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !

Advertisement

Heroine ; తమిళ నటుడు జెమినీ గణేషన్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. మహానటి సావిత్రి, ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకు దూరం అయ్యారు. మొదటగా ఆయనకు వేరే ఆమెతో పెళ్లి అయింది. ఆ తర్వాత సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో అప్పట్లో ఆయన బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆయన చూడటానికి కూడా చాలా అందంగా ఉండేవాడు. ఉంగరాల జుట్టు, ఒడ్డు పొడవు తో చాలా అందంగా ఉండేవాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో జెమినీ గణేషన్ కుమార్తె కమలా గణేషన్ తండ్రి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ మా డాడీ చాలా హ్యాండ్సమ్ గా ఉండేవాడు.

Advertisement
Heroine sh0cking comments
Heroine sh0cking comments

ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుండేది. పిల్లలందరినీ ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ప్రతిరోజు మా డాడీని చూడడానికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చేవారు. పెళ్లి చేసుకోమని చాలామంది అడిగేవారు. తనకి ఇంతకుముందే పెళ్లి అయిందని చెప్పి వాళ్ళని పంపించేవారు. ఇక సావిత్రిని పెళ్లి చేసుకోవడం అనేది విధిరాతగా చెప్పాలి. డాడీ ఎవరిని బలవంతం చేయలేదు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అనివార్య కారణాలతో ఇద్దరు దూరమయ్యారు. నటుడుగా మా డాడీకి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయన జీవితంలో ఎన్ని సంఘటనలు చోటు చేసుకున్న ఆయన కెరీర్ కి ఏనాడు దెబ్బ పడలేదు.

Advertisement

Kamala Ganesan made interesting comments

సినిమాలో అవకాశాలు లేక ఇబ్బంది పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అబద్ధాలే. ఇక ఆయన గురించి మహానటి సినిమాలో తప్పుగా చూపించారు. బయట జరిగింది వేరు సినిమాలో చూపించింది వేరు. నాన్న గురించి చాలా విషయాలు చూపించాలి ఆ సినిమాలో. కానీ అలా చేయలేదు. సావిత్రి గారిని నేను చూశాను. ఆమె మాతో బాగా మాట్లాడేవారు. మా అమ్మగారు కూడా ఆమెతో చాలా ఆత్మీయంగా ఉండేవారు అని జెమినీ గణేషన్ కుమార్తె కమల గణేషన్ తన తండ్రి గురించి చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement