Jabardasth Show : జబర్దస్త్ క్రేజ్ చాలా తగ్గింది అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం.. సినిమా ప్రమోన్స్
Jabardasth Show : ఈటీవీలో గత పది సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం వైభవం కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లో జబర్దస్త్ కార్యక్రమాన్ని పూర్తిగా ఆపేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ గతంలో ఉన్న వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుత అనుభవాలను గురించి చర్చించుకుంటున్నారు. అత్యంత దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని స్వయంగా మల్లెమాల వారు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నారు.
గతంలో ప్రతి వారం కూడా ఏదో ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను జబర్దస్త్ కార్యక్రమం ద్వారా నిర్వహించేవారు. అందుకు గాను సినిమా ల నిర్మాతల నుండి దాదాపు 25 లక్షల రూపాయలను చిత్ర యూనిట్ సభ్యులు జబర్దస్త్ వారు ఫీజుగా తీసుకునే వారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో సినిమాల యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకే నిర్మాతల ఆసక్తి చూపడం లేదు. ఒక వేళ చిన్న సినిమాలు జబర్దస్త్ కి వచ్చి ప్రమోషన్ చేసుకున్న కూడా 5 నుండి 10 లక్షల రూపాయల ఫీజు మాత్రమే వసూలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇంతగా జబర్దస్త్ స్థాయి పడి పోవడానికి కారణం ఎవరు అంటూ వీక్షకులు ఈ సమయంలో ఆలోచిస్తున్నారు. మల్లెమాల వారు మాత్రం ఇంకా జబర్దస్త్ కార్యక్రమాన్ని నాశనం చేసే విధంగా చాలా మంది కమెడియన్స్ ను తొలగిస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో అయినా మళ్లీ జబర్దస్త్ కార్యక్రమానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలాగా పాత కంటెస్టెంట్స్ మరియు టీమ్ లీడర్లను మల్లెమాల వారు తీసుకు రావాలని జబర్దస్త్ సాధారణ ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి అది సాధ్యమా అనేది తెలియాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.