Hyper Aadi : అమ్మాయిని మోసం చేసిన హైపర్ ఆది!.. అది మాత్రం సస్పెన్స్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : అమ్మాయిని మోసం చేసిన హైపర్ ఆది!.. అది మాత్రం సస్పెన్స్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :7 June 2022,7:00 pm

Hyper Aadi : హైపర్ ఆది మీద చేసే ఏ స్టంట్ అయినా కూడా జనాల్లో బాగానే హాట్ టాపిక్‌గా మారుతుంది.బుల్లితెరపై అందరూ టీఆర్పీ రేటింగ్ల కోసం ఆరాటపడుతుంటారు. టీఆర్పీలే షోల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాంటి టీఆర్పీ కోసం కొందరు పిచ్చి వేషాలు వేస్తుంటారు. ప్రోమోల రూపంలో జనాలను పిచ్చోళ్లను చేస్తుంటారు. అయితే ఆ ప్రోమో ట్రిక్కులను జనాలు ఎప్పుడో పసిగట్టేశారు. అయినా కూడా జనాలను ఇంకా ఇంకా పిచ్చోళ్లను చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూస్తే జనాలు నవ్వుకునేలా ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆదిని అందరూ కార్నర్ చేశారు. ప్రోమోలో ఆదికి సన్మానం చేసినట్టుగా చూపించారు.

అందరూ అలా సన్మానం కోసం రెడీ అయ్యారు. ఆదికి సన్మానం చేసే సమయంలో ఓ లేడీ ఎంట్రీ ఇచ్చింది. తనను మోసం చేశాడంటూ మొహానికి స్కార్ప్ కట్టుకుని వచ్చింది. ఎవరు నువ్ అని ఆది అడుగుతాడు. నన్ను మోసం చేసి ఇప్పుడు ఇలా సన్మానం చేసుకుంటారా? అని నిలదీస్తుంది. నువ్ ఎవరు అని అడగడంతో ఆమె తన మొహానికి ఉన్న స్కార్ప్‌ను తీస్తుంది. కానీ తను ఎవరు అన్నది మాత్రం చూపించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. అయితే వారి ప్రేమ కథ అంటూ ఓ స్కిట్ వేసి చూపించారు. పంచ్ ప్రసాద్, పొట్టి నరేష్ ఓ స్కిట్ వేశారు. మాయ మాటలు చెప్పి ఎలా మోసం చేశాడన్ని స్కిట్ వేసి చూపించారు.

Hyper Aadi Cheated Women in Sridevi Drama Company

Hyper Aadi Cheated Women in Sridevi Drama Company

అంటే ఇదంతా కూడా స్కిట్‌లో భాగస్వామ్యంగానే అనిపిస్తోంది. ఇంకా ఎలా ఎన్ని రోజులు కాంట్రవర్సీలతో టీఆర్పీ రేట్లను సంపాదించుకుంటారు అని జనాలు మండి పడుతున్నారు. ఈ టీఆర్పీ స్టంట్ల కన్నా షోను ఎలా ఎంటర్టైనింగ్‌గా నడిపించాలో దర్శకులు ఆలోచిస్తే బాగుంటుందని అంటున్నారు. మొత్తానికి ఆదిని మాత్రం ఈ ప్రోమోలో బాగానే వాడినట్టు కనిపిస్తోంది. ప్రోమో మొత్తం ఆదినే హైలెట్ అయ్యాడు. చివర్లో పోలీసోడు అంటూ వచ్చి నానా హంగామా చేశాడు. ఆది యాక్సిడెంట్ చేశాడట.. చావు బతుకుల్లో ఉన్నాడట.. అందుకే అరెస్ట్ చేసేందుకు వచ్చారట.. మొత్తానికి ప్రోమో మాత్రం వైరల్ అవుతోంది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది