Hyper Aadi : కాజల్ అగర్వాల్ ని ట‌చ్ చేయ‌బోయిన హైప‌ర్ ఆది.. ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : కాజల్ అగర్వాల్ ని ట‌చ్ చేయ‌బోయిన హైప‌ర్ ఆది.. ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Hyper Aadi : కాజ‌ల్‌ని ట‌చ్ చేయ‌బోయిన హైప‌ర్ ఆది.. ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందంటే..!

Hyper Aadi : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న హైప‌ర్ ఆది ఇప్పుడు న‌టుడిగా కొన‌సాగుతున్నాడు. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ ఢీ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా, ఇందులో హైపర్ ఆది చేసిన సంద‌డి మాములుగా లేదు. కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఇందులో సందడి చేసింది. కాజల్ వేదికపైకి మగధీర చిత్రంలోని ధీర ధీర అనే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. అక్కడున్న వారంతా కాజల్ కి ఘనస్వాగతం పలికారు. కాజల్ రాగానే హైపర్ ఆది ఆమెని ఇంప్రెస్ చేసే విధంగా ఫ్ల‌ర్ట్ చేశాడు.

Hyper Aadi ఆదితో కాజ‌ల్ పంచ్‌..

మీ పెళ్లి రోజు అక్టోబర్ 30 కదా అని హైపర్ ఆది కాజల్ అని అడిగాడు.కాజల్ అగర్వాల్ అవునని సమాధానం ఇచ్చింది. ఆ రోజు నా డెడ్ డేట్ అంటూ హైపర్ ఆది ఫన్నీగా చెప్పాడు. పెళ్ళికి ముందు నీమీద ఎన్నో కవితలు రాసుకున్నా అని తెలిపాడు.. మరి పెళ్లి తర్వాత అని కాజల్ అడిగింది.. పెళ్లి తర్వాత కిచ్లు బాధితుడిగా మారాను అంటూ ఆమె భర్తపై సెటైర్ వేశాడు. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ శేఖర్ మాస్టర్ తో కలసి బాద్షా చిత్రంలోని పాటకి డ్యాన్స్ చేసింది. ఇద్దరూ ఎంతో అందంగా వేదికపై డ్యాన్స్ తో అలరించారు. తన డ్యాన్స్ మూమెంట్స్ తో తనలో ఇంకా గ్రేస్ తగ్గలేదని కాజల్ నిరూపించింది.

Hyper Aadi కాజల్ అగర్వాల్ ని ట‌చ్ చేయ‌బోయిన హైప‌ర్ ఆది ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందంటే

Hyper Aadi : కాజల్ అగర్వాల్ ని ట‌చ్ చేయ‌బోయిన హైప‌ర్ ఆది.. ఎలాంటి వార్నింగ్ ఇచ్చిందంటే..!

చివర్లో హైపర్ ఆది, కాజల్ ఇద్దరూ ఫ్యాన్స్ కి భలే సర్ప్రైజ్ ఇచ్చారు. హైపర్ ఆది, కాజల్ కలసి మగధీరలోని పంచదార బొమ్మ సాంగ్ పాడారు. కాజల్ ని ముట్టుకోవడానికి హైపర్ ఆది ప్రయత్నిస్తూ.. గాలి నిన్ను తాకింది, నేలకూడా తాకింది నేను నిన్ను తాకితే తప్పా అని పాడాడు. కాజల్ అద్భుతంగా పాడుతూ హైపర్ ఆది పరువు తీసింది. గాలి ఊపిరయ్యింది..నేల నన్ను నడిపింది ఏమిటంటే నీలోని గొప్పా అంటూ క్యూట్ గా పాడింది. ఫుల్‌ ఎపిసోడ్ మే 22న టెలికాస్ట్ కానుంది

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది