Hyper Aadi : వైజాగ్ ఘటనలో రాం ప్రసాద్.. అసలు గుట్టు విప్పిన ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : వైజాగ్ ఘటనలో రాం ప్రసాద్.. అసలు గుట్టు విప్పిన ఆది

 Authored By bkalyan | The Telugu News | Updated on :12 November 2021,7:50 pm

Hyper Aadi  : జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్స్‌‌‌కు చాలా క్రేజ్ ఉంది. ఆది తన స్కిట్‌లో పంచుల వర్షం కురిపిస్తాడు. వేరే వారికి చాన్స్ ఇవ్వకుండా కౌంటర్స్ అన్ని తానే వేస్తాడు. అంతేకాకుండా గెస్ట్‌లపై కూడా పంచులు వేస్తూ ఫన్ క్రియేట్ చేస్తాడు. అయితే ఆది స్కిట్స్‌లో జబర్దస్త్‌లో ఆఫ్ కెమెరా జరిగే విషయాలను కూడా కొన్నింటిని ప్రస్తావిస్తుంటాడు.

అంతేకాకుండా ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ మీద కూడా తనదైన శైలిలో స్కిట్స్‌లో డైలాగ్‌లు పేలుస్తాడు.ముఖ్యంగా వైజాగ్ ఇన్సిండెంట్‌కు సంబంధించి ఆది పలు స్కిట్స్‌లో.. తన టీమ్‌మేట్స్ పరదేశి, దొరబాబులపై చాలా సార్లు పంచులు వేసిన సంగతి తెలిసిందే. వైజాగ్ గురించి ప్రస్తావన వచ్చిన, వారిద్దరు స్కిట్‌లో ఉన్న ఆ డైలాగ్ ఉండాల్సిందే. అయితే ఇటీవలి కాలంలో వైజాగ్ డైలాగ్‌ పెద్దగా ఆది స్కిట్‌లో కనిపించలేదు.

Hyper Aadi Comments on ramprasad over vizag incident

Hyper Aadi Comments on ramprasad over vizag incident

Hyper Aadi  : రాం ప్రసాద్ పరువుపాయే..

కానీ ప్రతీ సారి ఆది మాత్రం ఆ ఘటనను గుర్తు చేస్తూనే ఉంటాడు. పరదేశీ, దొరబాబులను ఆడుకుంటూనే ఉంటాడు.అయితే ఆది తన స్కిట్‌లో వైజాగ్‌ డైలాగ్‌ను వాడాడు. అయితే ఈసారి మాత్రం ఆటో రామ్‌ప్రసాద్ మీద కౌంటర్ వేశాడు. ఆది తన తాజా స్కిట్‌లో.. సూసైడ్‌కు సంబంధించిన స్కిట్ చేశాడు. స్కిట్‌లోకి రామ్‌ప్రసాద్‌ను కూడా తీసుకువచ్చాడు. పరదేశి వచ్చి రామ్‌ప్రసాద్‌ను మీది ఏ ఊరు అన్న అని అడుగుతాడు.

అందుకు రామ్‌ప్రసాద్ వైజాగ్ అని సమాధానం చెప్తాడు. దీంతో పరదేశి.. ఆ రోజు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు అన్న అని అడిగాడు. అప్పుడు ఆది కలుగజేసుకుని.. చూడటానికి కాదు అసలు నీతో పాటు రావాలి అని అదిరిపోయే కౌంటర్ వేస్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌ అవుతుంది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది