Hyper Aadi : ఆమెను ఎందుకు తీసుకుంటారు.. దీపిక పిల్లిపై హైపర్ ఆది కామెంట్స్
Hyper Aadi : దీపిక పిల్లి టిక్ టాక్ పుణ్యాన ఫేమస్ అయింది. టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ఎంతో ఘోరాలు ఆగిపోయాయి. అయితే టిక్ టాక్ నుంచి ఫేమస్ అయిన కొందరు మాత్రం ఇంకా తమ పిచ్చిని తగ్గించుకోవడం లేదు. కొంతమంది ఏకంగా బుల్లితెర, వెండితెర అంటూ అవకాశాలు సంపాదించేసుకుంటున్నారు. అందులో భాగంగా దీపిక పిలి, భాను వంటి వారు బుల్లితెరపై ఇప్పుడు దుమ్ములేపుతున్నారు. ఢీ షోలో దీపిక, శ్రీదేవీ డ్రామా కంపెనీలో భాను రచ్చ చేస్తున్నారు.

Hyper Aadi Counters On Deepika Pilli
దీపిక పిల్లితో ఆది ట్రాక్ క్రియేట్ చేద్దామని చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. కానీ అది వర్కవుట్ అవ్వడం లేదు. గత సీజన్‌లో వర్షిణితో ఆది ట్రాక్ బాగా వర్కవుట్ అయింది. ఏకంగా పెళ్లి రూమర్లు వచ్చే వరకు వారి కెమిస్ట్రీ వెళ్లింది.కానీ ఈసారి మాత్రం ఆది, దీపిక మధ్య ఎలాంటి కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడం లేదు. తాజాగా ఓ ప్రోమోను వదిలారు. వచ్చే వారం ఢీ షోలో రోజా స్పెషల్ గెస్ట్‌గా రాబోతోంది. రోజా బర్త్ డే సందర్భంగా స్పెషల్ పర్ఫామెన్స్‌లు ఉండబోతోన్నాయి.
Hyper Aadi : దీపిక పిల్లి పరువుతీసిన ఆది..

Hyper Aadi Counters On Deepika Pilli
సుధీర్ అటు వైపు వస్తే నీకైమైనా ప్రాబ్లమా? అని రష్మీని ఆది అడుగుతాడు. నాకు ఎందుకు ప్రాబ్లం ఉంటుంది.. అని రష్మీ అంటుంది. అలా రష్మీ అన్న వెంటనే.. దీపిక ఇటు రారా అని అంటాడు. నాకు ప్రాబ్లమ్ ఉంది నేను రాను అంటుంది. చెప్పాను కదా? ఆమెకు ప్రాబ్లమ్ ఉంది.. హెల్త్ సమస్యలు ఉన్నాయి.. ఆమెను ఎందుకు తీసుకున్నారు అసలు అంటూ ఆమె పరువు తీసేశాడు ఆది. అలా దీపిక మీద సెటైర్లు వేస్తూ ఉంటే రోజా పగల బడి నవ్వేసింది.
