Hyper Aadi : నరేష్ పై హైపర్ ఆది పంచ్ లు శృతి మించుతున్నాయి.. వాళ్లందరిని కూడా అవమానించినట్లే
Hyper Aadi : జబర్దస్త్ హైపర్ ఆది కామెడీని ఎంత మంది అభిమానిస్తారో అంతకంటే ఎక్కువ మంది ఆయన డబల్ మీనింగ్ పంచ్ లను అసహ్యించుకుంటారు. అయినా కూడా తన యొక్క పంచ్ లను హైపర్ ఆది కొనసాగిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అతడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నరేష్ తో స్కిట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి స్కిట్ లో కూడా నరేష్ ని అవమానించినట్లుగా మాట్లాడడం మరియు నరేష్ యొక్క లోపంను పదే పదే ఎద్దేవా చేయడం చేస్తున్నాడు. పొట్టిగా ఉన్నావు అంటూ డైరెక్ట్ గా మాట్లాడకుండా రకరకాలుగా నరేష్ ని అవమానపరుచుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పదే పదే పొట్టి వాడవి.. మేటర్ లేదు.. అన్ని చిన్నవే అంటూ రకరకాలుగా నరేష్ విషయంలో హైపర్ ఆది చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు ఒక వర్గం వారిని తీవ్రంగా అవమానపరిచినట్లుగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
ఈ విషయంలో నరేష్ ని అన్నట్లుగా కాకుండా అందరినీ అన్నట్లుగా కొందరు భావిస్తున్నారట. అందుకే హైపర్ ఆది విషయంలో ఆ కొందరు త్వరలోనే కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ నిర్ణయం ఏంటి అనే విషయం త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల దసరా ఈవెంట్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ లో కూడా నరేష్ ని తీవ్రంగా అవమానిస్తూ హైపర్ ఆది కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. నరేష్ కూడా కాస్త ఇబ్బంది పడ్డట్లుగానే అనిపిస్తున్నాడు. అయినా కూడా హైపర్ ఆది తరహాలో తీవ్రమైన పదజాలంతో జుగుప్సకరమైన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా చేసిన వ్యాఖ్యలు నరేష్ తో పాటు నరేష్ వంటి ఎంతో మంది శారీరక వికలాంగులను అవమానించినట్లుగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

hyper aadi dirty comedy punches on jabardasth naresh
బుల్లి తెరపై హైపర్ ఆది మంచి కామెడీ ని పండిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ అతడు ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగ్ లేకుండా కామెడీ పండిస్తే మరింత బాగుంటుంది అంటూ ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో హైపర్ ఆది గురించి చాలా రోజులుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజా విమర్శలపై ఆయన ఎలా స్పందిస్తాడు.. ఆయన ఇకనైనా తన పంచ్ లను దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటాడేమో చూడాలి. గతంలో హైపర్ ఆది జబర్దస్త్ ని వీడి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. కానీ మళ్ళీ ఆయన ఇప్పుడు జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. వేరే చానల్స్ నుండి ఆఫర్స్ వస్తున్నా కూడా ఈటీవీ పై అభిమానంతో అతడు వెళ్లడం లేదు. సినిమాల్లో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నా హైపర్ ఆది జబర్దస్త్ ని మాత్రం వదలడం లేదు. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశంను హైపర్ ఆది దక్కించుకున్న విషయం తెలిసిందే.