Hyper Aadi : వచ్చి మరీ పరువుతీయించుకోవాలా?.. హేమ వయసు మీద ఆది కౌంటర్లు
Hyper Aadi : హైపర్ ఆది వేసే కౌంటర్ల సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కౌంటర్లు ఒక్కోసారి హద్దులు కూడా దాటుతుంటాయి. అప్పుడప్పుడు ఎదుగుతున్న ఆర్టిస్టులు అయితే ఆది చేత కౌంటర్లు వేయించుకోవాలని చూస్తుంటారు. ఆది పంచులు వేస్తేనే తమకు గుర్తింపు వచ్చిందని అంటూ ఉంటారు. ఆది అలా తమ మీద కౌంటర్లు వేయడం వల్లే తాము జనాలకు తెలిశామని చెబుతుంటారు. అయితే చిన్న ఆర్టిస్టులు వరకు ఓకే గానీ.. చిన్నా పెద్దా అన్నా తేడా చూడడు. తనకు నోటికి ఎంతొస్తే అంత అనేస్తాడు.చివరకు రోజాను కూడా వదిలి పెట్టలేదు.
ఇప్పుడు ఉన్న ఇంద్రజ ( Indraja ), కృష్ణ భగవాన్ ( Krishna Bhagavan ), మనో వంటి వారి మీద కూడా కౌంటర్లు వేస్తుంటాడు. బుల్లితెర సెలెబ్రిటీలను అయితే ఆది దారుణంగా ఆడేసుకుంటాడు. ఆది కౌంటర్లకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తాజాగా వదిలిన ప్రోమోలో హేమ ఏజ్ మీద కౌంటర్లువేశాడు. మంగమ్మ గారి కొడుకు అనే కాన్సెప్టుతో శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్ చేశారు. ఇందులో హేమ కొడుకుగా నరేష్ కనిపించాడు.. చిన్ని తండ్రి ఇటు చూడురా అంటూ నరేష్ వింత గెటప్పులు ఎంట్రీ ఇచ్చాడు.ఏంట్రా మీ అమ్మా.. డెబ్బై ఏళ్లు వచ్చినా ఇంకా గౌన్లు వేయడం మానుకోవడం లేదు అంటూ ఆది కౌంటర్లు వేస్తాడు.

hyper aadi satires on hema in latest sridevi drama company
దీంతో నరేష్ కిందకు తల దించుతాడు. హేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కానీ హేమకు మాత్రం ఏ డైలాగ్ ఇచ్చినట్టు కనిపించడం లేదు. అసలే రాక రాక షోలకు వస్తుంటుంది. వచ్చినప్పుడే ఇలా కౌంటర్లు వేయించుకుంటోంది. అయినా రాసే స్క్రిప్ట్, డైలాగ్స్ అన్నీ కూడా ఆదివే అయినప్పుడు.. కౌంటర్లు ఎలా ఇవ్వగలదు. ఈ ఎపిసోడ్‌లో జంటల డ్యాన్స్ పర్ఫామెన్సులు బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి.ఇక ప్రతీ వారం ఏదో ఒక కాన్సెప్టుతో శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం అంతా కూడా స్టేజ్ మీదకు వస్తుంటుంది. ఈ సారి స్పెషల్ అట్రాక్షన్‌గా నూకరాజు తండ్రి నిలిచాడు. ఆసియా నూకరాజు లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. నూకరాజు గురించి ఆసియాతో మాట్లాడుతూ నూకరాజు తండ్రి వేసిన కౌంటర్లు అదిరిపోయాయి.
