Sudigali Sudheer : ఇంద్రజ,సుడిగాలి సుధీర్ రిలేషన్!.. కించపరుస్తుంటే పగలబడి నవ్వేసిన రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : ఇంద్రజ,సుడిగాలి సుధీర్ రిలేషన్!.. కించపరుస్తుంటే పగలబడి నవ్వేసిన రోజా

 Authored By sandeep | The Telugu News | Updated on :9 March 2022,12:30 pm

Sudigali Sudheer : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. కొన్ని సంవ‌త్స‌రాలుగా స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షోలో ప‌లువురిని కామెంట్ చేయ‌డం, కించ‌ప‌ర‌చ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. తాజాగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ షో ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో సుధీర్, ఇంద్ర‌జ క‌లిసి ప‌ర్‌ఫార్మెన్స్ చేయ‌గా, అదే స్టైల్‌లో రోహిణి , న‌రేష్ చేసి న‌వ్వులు పంచారు. పాట పాడుతుంటే ఇంద్ర‌జ క‌ళ్లు మూసుకొని మైమ‌ర‌చిపోతున్నట్టుగా ఉంటుంది. అయితే రోహిణి క‌ళ్లు మూసుకొని అలా ప‌డుకుండిపోతుంది. వెంట‌నే న‌రేష్ వ‌చ్చి లేపుతాడు. చాలా ఫ‌న్నీగా ఈ స‌న్నివేశం ఉండ‌గా, రోజాదీనికి ప‌గ‌ల‌బడి న‌వ్వుతుంది. స‌న్నివేశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

ప్ర‌స్తుతం ఈ ప్రోమో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.రోజా అనారోగ్య కారణాలతో జబర్దస్త్ కామెడీ షో నుంచి కొన్నాళ్ల పాటు తప్పుకున్నారు. ఆమె ప్లేస్‌లో సీనియర్ బ్యూటీ ఇంద్రజను రంగంలోకి దింపారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఇంద్రజ జబర్దస్త్ జడ్జీగా పూర్తి స్థాయిలో మెప్పించారు. వన్నె తరగని అందంతో.. చక్కని నవ్వుతో మెస్మరైజ్ చేసిన ఇంద్రజకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. జబర్దస్త్‌కి అంతకు ముందు చాలామంది జడ్జీలు వచ్చి వెళ్లారు కానీ.. ఇంద్రజ అయితే తన మార్క్ చూపిస్తూ పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచింది. అయితే రోజా రీ ఎంట్రీ త‌ర్వాత ఇంద్ర‌జ సైడ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీలో అల‌రిస్తుంది.

Indraja Sudigali Sudheer relationship comments on roja

Indraja Sudigali Sudheer relationship comments on roja

Sudigali Sudheer : పాపం ప‌రువు తీసారుగా..

బుల్లితెరపై ప్రసారమవుతున్న షోల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అన్ని రకాలుగా ప్రేక్షకులకు వినోదం పంచుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సుడిగాలి సుధీర్‌ హోస్ట్ చేస్తున్న ఈ షోలో బుల్లితెర, వెండితెర తారల సందడి ఓ రేంజ్‌లో ఉంటోంది. దీంతో ప్రతి ఎపిసోడ్ వైరల్ అవుతోంది. ఇటీవ‌ల ఇంద్ర‌జ డ్యాన్స్ చేయ‌గా, దానిపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ 18 ఏళ్ల తర్వాత స్టేజ్‌పై మళ్లీ డ్యాన్స్ చేశానని చెప్పింది. ఇక ఇంద్రజ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్‌ చూసిన సుడిగాలి సుధీర్ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. ‘సాంగ్ పర్‌ఫామ్ చేసి పద్దెనిమిదేళ్లు అయిందట.. కానీ పద్దెనిమిదేళ్ల పిల్లలా చేశారు’ అని సుధీర్ అన్నాడు. ఇలా ఈ ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించుకుంటూ ఉంటారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది