Indraja : హ్యాట్సాఫ్ టు ఇంద్రజ.. వర్ష, దీపిక పిల్లి మంచి మనసుకు అంతా ఫిదా
Indraja శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇప్పుడు తన మీద పడ్డ మచ్చను తుడిపేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త ఈవెంట్లు చేస్తూ విభిన్నంగా ప్రయత్నిస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ప్రారంభ సమయంలో దానిపై అందరికీ చెడు అభిప్రాయం ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం తన రూపురేఖలు మార్చుకుంటోంది. ఇక వచ్చే వారం ప్రసారం చేయబోతోన్న ఎపిసోడ్‌లో అయితే ఏకంగా అందరి మనసును దోచుకుంది. అక్టోబర్ 1న వృద్దుల దినోత్సవం.
ప్రతీ నెలా సాయం చేస్తానన్న ఇంద్రజ Indraja
ఆ సందర్భంగా ఆ వారంలో వృద్దాశ్రమంలోని పెద్దవారందరినీ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు తీసుకొచ్చారు. వారి కష్టాలను బాధలను కాసేపు దూరం చేశారు. వారితో హైపర్ ఆది కామెడీ కూడా చేశాడు. ఆ వృద్దుల కష్టాలు తెలిసేలా స్కిట్లు వేశారు. ఎందుకు ఇలా వదిలేస్తున్నారు.. మీ అమ్మనాన్నలను తీసుకెళ్లండి అంటూ సుధీర్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇక దీపిక, వర్ష వంటివారు స్టేజ్ మీదే ఆర్థిక సాయాన్ని అందించారు. ఇంద్రజ మంచి మనసుకు అందరూ ఫిదా అయ్యారు.
వర్ష, దీపిక చెరో యాబై వేల చొప్పును ఆ వృద్దాశ్రమానికి ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక ఇంద్రజ అయితే మరో అడుగు ముందుకు వేసింది. ఆ వృద్దులకు నెలకు అయ్యే మెడిసిన్స్ ఖర్చులను తెలసుకుంది. లక్ష నుంచి లక్షాయాభై వేల వరకు అవుతుందని చెబితే.. నెల కాదు.. ఇకపై ప్రతీ నెలా నుంచి డబ్బులు వస్తాయ్.. వెళ్లేటప్పుడు అకౌంట్ నంబర్ ఇచ్చి వెళ్లండి అని చెప్పింది. దీంతో అందరూ కూడా ఇంద్రజ మంచి మనసుకు ఫిదా అయ్యారు.