Nagarjuna : నాగార్జునకు వైఎస్ జగన్ అంటే భయం.. అందుకే ఇలా బుక్కయ్యాడు
Nagarjuna : టాలీవుడ్ కు సంబంధించిన నిర్మాతలు.. బయ్యర్లు మొత్తం అందరు కూడా ఏపీలో ఉన్న టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.. అలాగే కొనసాగితే అక్కడ టికెట్ల రేట్లను అమ్మడం మా వల్ల కాదు.. దయచేసి టికెట్ల రేట్లను పెంచండి లేదంటే మా థియేటర్లను పంక్షన్ హాల్స్ గా మార్చేసుకుటాం అంటూ కొందరు థియేటర్ల యాజమాన్యాలు ఏపీ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రతి ఒక్కరికి అందుబాటులో సినిమా ఉండాలి.. కనుక తక్కువ టికెట్ రేట్లను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. మద్యతరగతి వాడు వెయ్యి రూపాయలు లేనిదే సినిమా చూడలేక పోతున్నాడు.
కనుక అలాంటి వారికి ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జగన్ ప్రభుత్వం బల్లగుద్ది మరీ చెబుతోంది. ఈ సమయంలో టాలీవుడ్ వారు కూడా ఖచ్చితంగా టికెట్ల రేట్లు ఇలా ఉంటే మా వల్ల కాదు అన్నట్లుగా తేల్చి పారేస్తున్నాయి. నాగార్జున మరియు ఇతర కొద్ది మంది మాత్రం ఏం పర్వాలేదు ఏపీలో అంతా బాగానే ఉంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. సి కళ్యాణ్ వంటి వారు మాట్లాడినా జనాలు పట్టించుకోరు. ఆయన ఒక చిన్న నిర్మాత కనుక జనాలు ఆయన గురించి ఆలోచించడం లేదు. కాని నాగార్జున వంటి ఒక బడా స్టార్ మాట్లాడుతూ ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. నా సినిమాలకు అక్కడ ఉన్న టికెట్ల రేట్లు సరిపోతాయి అంటూ మాట్లాడటం ఇప్పుడు దుమారం రేపుతోంది.
Nagarjuna : బంగార్రాజును బ్యాన్ చేస్తామంటూ హెచ్చరిక
ఆయన మాటలకు ఇప్పటికే పలువురు నిర్మాతలు మరియు బయ్యర్లు కౌంటర్ ఇస్తున్నారు. మీరు ఒక్కరు బతికేస్తా చాలా నాగార్జున.. ఇండస్ట్రీ లో ఎవరేం అయినా మీకు అవసరం లేదు. ఏపీలో థియేటర్ల నిర్వహణ ఎంత భారం అయ్యిందో నీకు తెలియదేమో.. వచ్చే టికెట్ల రేట్ల తో కనీసం మెయింటెనెన్స్ కూడా రావడం లేదు. ఏపీలో ఉన్న ప్రతి ఒక్క థియేటర్ పరిస్థితి ఇదే అయినా కూడా నీవు మాత్రం నాకు ఏం ఇబ్బంది లేదు అంటూ మాట్లాడేశావు అంటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నాగార్జున కు వైఎస్ జగన్ అంటే భయమో లేదా భక్తో.. అందుకే ఈ విధంగా ఇండస్ట్రీని బలి చేసే వ్యాఖ్యలు చేస్తున్నాడు.
ఈ పెద్ద మనిషే గతంలో జగన్ వద్దకు వెళ్లి టికెట్ల రేట్ల విషయంలో ఇతర విషయాల్లో టాలీవుడ్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడేమో బంగార్రాజు సినిమా ప్రెస్ మీట్ సందర్బంగా జగన్ అమలు చేస్తున్న టికెట్ల రేట్ల విషయంలో ఇబ్బంది లేదు అన్నాడు. నాగార్జున వ్యాఖ్యలకు బంగార్రాజు కు దెబ్బ కొట్టాలని ఏపీ బయ్యర్లు భావిస్తున్నారు. కొందరు థియేటర్లు ఇచ్చేది లేదు అంటూ ఉంటే మరి కొందరు నాగార్జున సినిమా ఎలా ఏపీలో ఆడుతుందో చూస్తామంటూ సవాల్ చేస్తున్నారు. ఈ సమయంలో నాగార్జున ఏం చేస్తాడు అనేది చూడాలి.