Sreeleela : హీరోయిన్ శ్రీలీల మామూలుది కాదు బాబోయ్ .. ఈ వయసులోనే .. వామ్మో..!!

Advertisement

Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ శ్రీలీల ఫుల్ ఫామ్ లో ఉందని చెప్పవచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఏడు సినిమాలు చేస్తుంది. ఇక మొదటగా రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ పెళ్లిసందడి ‘ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ సినిమాతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్గా నిలిచింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎక్కువ కాలం కాలేదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాను. కనుక నేను పాత్రలను డిమాండ్ చేయడం లేదు. నాకు వచ్చిన పాత్రలను చేస్తున్నాను. అలాగే సినిమాలో ఆ పాత్ర అంత ఉండాలి,

Interesting news about Sreeleela
Interesting news about Sreeleela

ఇలా ఉండాలి అని అస్సలు డిమాండ్ చేయను అని తెలిపింది. అందుకే మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కు కూడా ఒకే చెప్పింది. అంతే కాదు బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా శ్రీలీల ఓ కీలక పాత్ర చేసేందుకు ఓకే చెప్పింది. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. వారంలో ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా బిజీ బిజీగా షూటింగ్లో పాల్గొంటున్నట్లుగా తెలిపింది. కెమెరా ముందుకు వెళ్ళని రోజు ఏదో వెలితిగా ఉంటుంది అని శ్రీలౌల చెప్పుకొచ్చింది.

Advertisement
Interesting news about Sreeleela
Interesting news about Sreeleela

మొత్తానికి శ్రీలీల తన కెరీర్ విషయంలో చాలా క్లారిటీగా ఉందని తెలుస్తుంది. హీరోలను చూసి వారు మొదటి రెండు మూడు రోజులు థియేటర్లకు వస్తారు. కాబట్టి వారికి సినిమాలో ప్రాముఖ్యత ఉండడంలో తప్పేం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏదిఏమైనా శ్రీలీల తన కెరీర్ చాలా క్లియర్ గా ఉండడంతో భవిష్యత్తులో ఆమె బాగుంటుంది అనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి వస్తుంది. లేనిపోని స్టార్ డమ్ ను ఊహించుకొని ఆ సినిమా చేస్తా, ఈ కథ చేస్తాను అని ఎదురు చూడకుంటే కెరీర్లో మరెన్నో సినిమాలు చేయవచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్త చేసింది. ఇటీవల శ్రీలీల ‘ ధమాకా ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. త్వరలోనే మహేష్ బాబు, బాలయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement