Sita Ramam Movie : సీతారామం కథ… ఇదో బ్రహ్మ పదార్థం అయ్యిందిగా!
Sita Ramam Movie : దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మిక మందన కీలక పాత్రలో నటించిన సీతారామం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కు అందాల రాక్షసి దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ మరియు ఆయన కుమార్తె స్వప్న నిర్మించారు. మహానటి దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమా కథ విషయంలో మరియు స్క్రీన్ ప్లే విషయంలో సహాయ సహకారాలు అందించాడు అనేది సమాచారం. ఇక ఈ సినిమా ప్రమోషన్ ప్రారంభమైన రెండు వారాల నుండి కథ గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతుంది.
ముఖ్యంగా దర్శకుడు హను రాఘవపూడి మరియు నిర్మాతలు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటి కథ రాలేదు అనే వ్యాఖ్యలు, పదాలను ఉపయోగించి అంచనాలు పెంచేస్తున్నారు. కథ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.. అసలు లైన్ ఏంటి అనేది ఇప్పటి వరకు లీకు దొరకలేదు. దాంతో సీతారామం కథ అనేది ఒక బ్రహ్మ పదార్థం అన్నట్లుగా మారింది. అంత గొప్పగా కథ ఉంటుందా.. అంత సీన్ ఈ సినిమాకు ఉంటుందా అంటూ ప్రేక్షకులు కూడా సినిమాపై ఆసక్తి పెంచుకుంటున్నారు. కథ ఏంటీ అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది.
తాజాగా దర్శకుడు హను రాఘవపూడి మరియు హీరో సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఇలాంటి కథలు మళ్ళీ ఎప్పటికి వస్తాయో అని అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి కథ వస్తుందని అన్నారు. నిర్మాత స్వప్న మాట్లాడుతూ ఇది ఒక కమర్షియల్ కథ కూడా కాదు. కాని కథ విన్న వెంటనే చేయాలని అనిపించిందని, ఇలాంటి కథను చేసేందుకు చాలా ధైర్యం ఉండాలి అని.. నాన్న అశ్వినిదత్ గారు మాకు ఈ సినిమా చేసేందుకు మీ సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి కథ ఏదో ఒక అద్భుతం అన్నట్లుగా చెప్తున్నారు. మరి కొన్ని గంటల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అప్పటికి సినిమా కథ ఏంటి అనేది క్లారిటీ రాబోతుంది. నిజంగానే కథ అద్బుతమా అనేది చూడాలి.