Intinti Gruhalakshmi 05 Sep Today Episode : నందు, లాస్యకి పెద్ద ట్విస్ట్ ఇచ్చిన సామ్రాట్.. తులసిపై మండిపడుతున్న సామ్రాట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 05 Sep Today Episode : నందు, లాస్యకి పెద్ద ట్విస్ట్ ఇచ్చిన సామ్రాట్.. తులసిపై మండిపడుతున్న సామ్రాట్..!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 September 2022,9:00 am

Intinti Gruhalakshmi 05 Sep Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ఈ సీరియల్ అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 729 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సామ్రాట్ తులసి పాట్నర్షిప్ గా చేయను అన్నందుకు సామ్రాట్ మండిపడిపోతూ ఉంటాడు. అంతలో వాళ్ళ బాబాయ్ వస్తే వాళ్ళ బాబాయ్ ని కూడా తిడతాడు. తర్వాత నందు, లాస్య వచ్చి తులసి పై ఇంకాస్త మండిపడేలా తనపై అన్ని పుకార్లు చెబుతూ ఉంటారు. తులసి మీకు మా నేను మాజీ వార్త అన్న సంగతి మీకు చెప్పలేదు.. అన్న సంగతి మాకు తెలియదు సార్ అని తనపై కోపం వచ్చేలా చేస్తూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ తన పైన ఇంకా కోపంని పెంచుకొని కనీసం నాతో ఫోన్లో కూడా మాట్లాడకుండా మెసేజ్ పెట్టింది. అసలు తనే ఏమనుకుంటుంది. నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కకుండా పోయిందంటే దానికి కారణం తులసి.

అంటూ మీరే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయట పడేయాలి అని నందు, లాస్య అని అంటాడు. అప్పుడు లాస్య, నందు చెప్పమని అడుగుతారు. అప్పుడు సామ్రాట్ ఒక పెద్ద షాక్ ఇస్తాడు. మీరే ఏదైనా చేసి తులసిని తీసుకొచ్చి నా ప్రాజెక్టులో జాయిన్ చేపించాలి. మీ వల్లే గొడవ వచ్చింది. మీరే దీన్ని సాల్వ్ చేయాలి అని వాళ్ళిద్దరికీ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. అప్పుడు అక్కడ నుంచి లాస్య, నందు వెళ్లిపోతారు. తర్వాత సామ్రాట్ వాల్ల బాబాయ్ నవ్వుతూ భలే మంచి పని చేశావు అని అంటాడు. కట్ చేస్తే లాస్య, నందు, తులసి ఇంటికి వస్తే చీపో అన్నాను. ఇప్పుడు తన దగ్గరికి వెళ్లి తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునేలా చేయాలి. అని ఒక పెద్ద ప్లాన్ నీ నందుకు చెప్తుంది. అప్పుడు సరే అని నందు లాస్య తులసి దగ్గరికి వస్తారు. నందు వాళ్ళమ్మ ని వెళ్లి మొదటగా అడుగుతారు. కానీ ఆవిడ నందుని లాస్య అని చెడమడ తిట్టి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

intinti gruhalakshmi 05 september 2022 full episode

intinti gruhalakshmi 05 september 2022 full episode

తర్వాత నందు వాళ్ల నాన్న దగ్గరికి వస్తాడు. కానీ నందు వాళ్ల నాన్న మాట వినిపించుకోకుండా ఫోన్ మాట్లాడుతూనే తిరుగుతూ ఉంటాడు. అప్పుడు గట్టిగా నాన్న అని అనగానే… ఏంటి మీరు ఏది మాట్లాడాలనుకున్న తులసి తో మాట్లాడండి నాతో కాదు అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఇద్దరు కలిసి తులసి దగ్గరికి వెళ్తారు. అప్పుడు తులసి మీ పిల్లల దగ్గరికి కదా.. వచ్చింది వాళ్ళు లోపల ఉన్నారు వెళ్లి మాట్లాడుకోండి అని అంటుంది. అప్పుడు లాస్య మేము వచ్చింది పిల్లల కోసం కాదు.. నీకోసమే అని తులసిని అంటుంది. అప్పుడు అందరూ బయటికి వస్తారు. అప్పుడు లాస్య తెగ డ్రామాలాడుతూ తులసి నీ ఎలాగైనా తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ లాస్య పై ఒక సెటైర్ వేస్తాడు. అప్పుడు నందు నేను వచ్చింది నీ ప్రాజెక్టు మాట్లాడడానికి నేను సామ్రాట్ దగ్గరికి వెళ్లి నేను మాట్లాడాను.. ఆయన రమ్మన్నారు అని అంటాడు.

అప్పుడు నేను చెప్పింది చేయండి. అప్పుడు నేను వస్తాను అని తులసి అంటుంది. మీరు వెళ్లి సామ్రాట్ కి మీరు నా మాజీ భర్తని చెప్పకుండా ఉండడానికి కారణం మీరేనని చెప్తే నేను వస్తాను అని గట్టిగా చెప్తుంది తులసి. అప్పుడు అవి కూడా నందుని మమ్మీ ప్రాజెక్ట్ వదిలేసింది. మళ్లీ మీరు ఎందుకు రమ్మని అడుగుతున్నారు అని అంటాడు. అప్పుడు తులసి నాకు ఆత్మ అభిమానం ఉంది దానిని చంపుకొని నేను సామ్రాట్ దగ్గరికి రాలేను అని అంటుంది. ఇక అందరూ వెళ్ళిపోతారు. కట్ చేస్తే నందు, లాస్య, తులసి గురించి ఆలోచిస్తూ ఉంటారు.ఇక రేపటి ఎపిసోడ్ లో తులసిని విలేకరులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడగగా.. తులసి సమాధానం ఇస్తుంది. అది పేపర్లో రావడం చూసి సామ్రాట్ తులసి వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది