Intinti Gruhalakshmi 1 March Today Episode : అభిని ఎన్ కౌంటర్ చేయబోతూ అడ్డంగా కమిషనర్ కు దొరికిపోయిన ఎస్ఐ.. మనోజ్ బతుకుతాడా? అభిని రిలీజ్ చేస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 1 March Today Episode : అభిని ఎన్ కౌంటర్ చేయబోతూ అడ్డంగా కమిషనర్ కు దొరికిపోయిన ఎస్ఐ.. మనోజ్ బతుకుతాడా? అభిని రిలీజ్ చేస్తారా?

 Authored By gatla | The Telugu News | Updated on :1 March 2022,9:30 am

Intinti Gruhalakshmi 1 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 568 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ తులసి దగ్గరికి వస్తాడు. మీ అబ్బాయిని ఎస్ఐ ఏదో చేయబోతున్నాడు. మీ అబ్బాయిని మీరే రక్షించుకోవాలి అంటాడు కానిస్టేబుల్. మీ విషయం కమిషనర్ కు తెలిసిందని తెలుసుకొని అట్నుంచి అటే పారిపోయాడు. వెంటనే వెళ్లి రక్షించుకోండి అంటాడు కానిస్టేబుల్. దీంతో మా అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టారో తెలుసా అని అడుగుతుంది తులసి. దీంతో తెలుసు అని అడ్రస్ చెబుతాడు కానిస్టేబుల్. దీంతో వెంటనే అక్కడికి వెళ్లిపోతుంది.

intinti gruhalakshmi 1 march 2022 full episode

intinti gruhalakshmi 1 march 2022 full episode

కట్ చేస్తే అభిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్తారు. అభిని వదిలేసి.. పారిపో అంటాడు ఎస్ఐ. దీంతో మీరు నిజం చెబుతున్నారా అంటాడు అభి. నీకోసం మీ అమ్మ ఎదురు చూస్తోంది. వెళ్లు.. వెళ్లరా అంటాడు ఎస్ఐ. కానీ.. అభికి ఏదో డౌట్ వస్తుంది. మీరు నన్ను ఎందుకు వదిలేస్తున్నారు. నాకేదో అనుమానంగా ఉంది అంటాడు అభి. దీంతో ఎస్ఐ తన చేతుల్లోకి గన్ తీసుకుంటాడు. ఏందిరా ఆగిపోయినవు. మీ అమ్మ మీద ఒట్టేసినా నీకు అర్థం కావడం లేదా అంటాడు. నేను పరిగెడితే నన్ను షూట్ చేసి ఎన్ కౌంటర్ లా సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అంటాడు అభి.

దీంతో అవును.. నువ్వు పరిగెత్తినా షూట్ చేస్తాను.. నువ్వు నిలబడి ఉన్నా షూట్ చేస్తాను అంటాడు ఎస్ఐ. చూడు.. తప్పించుకుంటావని నీకు ఒక చాన్స్ ఇస్తున్నా. తప్పించుకుంటావా.. లేక చాన్స్ లేకుండా చస్తావా.. చాయిస్ నీదే.. అంటాడు ఎస్ఐ.

దీంతో తప్పక.. అభి పరిగెడుతుంటాడు. ఇంతలో ఎస్ఐ కాలుస్తాడు. కానీ.. బుల్లెట్ మిస్ అవుతుంది. అబ్బా.. జస్ట్ మిస్ అయినవురా బయ్. ఈసారి ఫైనల్ అంటాడు ఎస్ఐ. అభిని కాల్చబోతుండగానే అంతలోనే అక్కడికి తులసి పరిగెత్తుకుంటూ వచ్చి ఎస్ఐ పిస్తోల్ ను పడేస్తుంది.

తులసితో పాటే కమిషనర్ కూడా వస్తాడు. కమిషనర్ ను చూసి ఎస్ఐ షాక్ అవుతాడు. నీలాంటి వాడి వల్ల యూనిఫామ్ కు చెడ్డ పేరు వస్తోంది. నీలాంటి వాళ్ల వల్లే పోలీస్ వ్యవస్థకు అవమానం. నిన్ను వెంటనే సస్పెండ్ చేస్తున్నాను. అరెస్ట్ చేయండి అని కమిషనర్.. ఎస్ఐపై సీరియస్ అవుతాడు.

ఆ తర్వాత తులసి దగ్గరికి వెళ్లి ఆడది సాధించలేనిది అంటూ ఏదీ లేదు. జీకే గారు టీవీలో చూసి మీ గురించి చెప్పారు. దీంతో నేను అక్కడికి వచ్చాను అంటాడు కమిషనర్. ఇంతలో ఆయనకు ఫోన్ చేసి ఆసుపత్రిలో ఉన్న మనోజ్ కు స్పృహ వచ్చింది అని చెబుతాడు. దీంతో అదే విషయం తులసికి చెబుతాడు కమిషనర్.

Intinti Gruhalakshmi 1 March Today Episode : తులసి దీక్ష చేయడం.. ఇంట్లో వాళ్లంతా టీవీలో చూసి షాక్

తులసి పోలీస్ స్టేషన్ ముందు దీక్ష చేయడం ఇంట్లో వాళ్లంతా టీవీలో చూస్తారు. చూసి షాక్ అవుతారు. తను పోరాటం చేస్తుంటే మనం సపోర్ట్ గా ఉండాలి కదా.. పదండి వెళ్దాం అని అందరూ పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతారు. మరోవైపు మనోజ్ దగ్గరికి తులసి, కమిషనర్ వెళ్తారు.

ఎంతో మందిని నువ్వు నమ్మించి మోసం చేశావు. అన్యాయంగా వాళ్ల డబ్బును కాజేసి వాళ్లను రోడ్డున పడేశావు. నీ బాధితుల లిస్ట్ మొత్తం మాదగ్గర ఉంది. అభి విషయంలో జరిగింది చెప్పు. నీకు తక్కువ శిక్షతో బయటపడేలా చేస్తాను అంటాడు కమిషనర్.

దీంతో అసలు విషయం మొత్తం చెబుతాడు మనోజ్. తనే కాలు జారి బీరు బాటిల్ మీద పడ్డానని.. తప్పంతా నాదేనని.. అభి నన్ను చంపడానికి ప్రయత్నించలేదు అంటాడు మనోజ్. దీంతో అభిని వదిలేయండని చెబుతాడు కమిషనర్. దీంతో చాలా థ్యాంక్స్ సార్ అంటుంది తులసి.

ఇంట్లో వాళ్లు పోలీస్ స్టేషన్ కు బయలుదేరే సమయానికి అప్పటికే అభి ఇంటికి వస్తాడు. దీంతో అంకిత వెళ్లి అభిని హత్తుకుంటుంది. పొగరుతో మాట్లాడిందనుకున్నాను.. నిజంగానే సాధించింది కదా.. ఇక ఈవిడ గారిని పట్టుకోలేం.. కొమ్ములొచ్చేస్తాయి అని తులసి గురించి అనుకుంటుంది లాస్య. ఇంట్లో వాళ్లంతా సంతోషిస్తారు. అభిని తీసుకొచ్చినందుకు తులసిని మెచ్చుకుంటారు. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది