Intinti Gruhalakshmi 10 Oct Today Episode : జాను ప్లాన్ సక్సెస్.. విక్రమ్‌తో మందు తాగించిన జాను.. హనీ విషయంలో నందు, తులసి మధ్య గొడవ.. రత్నప్రభ గురించి తులసికి తెలుస్తుందా?
Intinti Gruhalakshmi 10 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 10 అక్టోబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1071 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పనికిమాలిన కారణం చెప్పి దాని చెంప పగుల గొట్టారు అంటే.. అది పనికిమాలిన కారణం కాదు అత్తయ్య గారు అంటుంది దివ్య. తన మనసు పగిలింది. ఇప్పుడు జాను అన్నం తినడం కూడా మానేసింది అనడంతో పట్టించుకోకపోవడం ఏంటి విక్రమ్ అంటుంది. ఇదేనా మనం జాను పట్ల మనం చూపించే ప్రేమ అనడంతో పర్లేదు నువ్వు తిను దివ్య.. నేను వెళ్లి జానవిని తీసుకొస్తా అంటాడు విక్రమ్. తన దగ్గరికి వెళ్లి పదా టిఫిన్ చేద్దాం అంటే.. నాకు దివ్య అక్క చెంప మీద కొట్టాలని ఉంది అంటుంది జానవి. దీంతో దివ్య సారీ చెబితే చాలా అంటాడు విక్రమ్. చెబుతుందా అంటుంది. నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి రా అని చెప్పి విక్రమ్.. జానును చేయి పట్టుకొని తీసుకొస్తాడు. తన చేయి పట్టుకోవడం దివ్య చూడటంతో చేయి వదులుతాడు విక్రమ్. అయినా కూడా జాను.. విక్రమ్ చేయి వదలదు. దీంతో దివ్యకు ఇంకా కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా.. దివ్య ఆగు అంటాడు విక్రమ్.
ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలంట మన మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు అంటే.. నేను ఎప్పుడో మరిచిపోయాను అంటుంది దివ్య. దీంతో జాను మరిచిపోలేదు అంటాడు విక్రమ్. దానికి నేనేం చేయాలి అంటే జానుకు సారీ చెప్పు అంటాడు విక్రమ్. దీంతో సారీ అంటూ విక్రమ్ వైపు చూస్తుంది దివ్య. దీంతో సారీ నాకు చెప్పాలి అనడంతో జానుకు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దివ్య. తన దగ్గరికి వెళ్లి దివ్యను రెచ్చగొడుతుంది తన అత్తయ్య. గుర్తు పెట్టుకో.. ఇప్పటి కైనా జాను పవరేంటో తెలుసుకో అని చెప్పి విక్రమ్ తల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు దివ్యకు నానమ్మ ఫోన్ చేస్తుంది. కానీ.. దివ్య లిఫ్ట్ చేయదు. అనసూయ మళ్లీ ఫోన్ చేస్తుంది. చెప్పు నానమ్మ అంటే.. నువ్వు అర్జెంట్ గా ఒకసారి రావాలి దివ్య అంటుంది అనసూయ. మీ తాతయ్యను ఎవరో కొట్టారు. దెబ్బలు బాగా తగిలాయి. చాలా భయంగా ఉంది అంటుంది అనసూయ. దీంతో నువ్వేం కంగారు పడకు. నను వెంటనే బయలుదేరి వస్తున్నాను అంటుంది దివ్య.
Intinti Gruhalakshmi 10 Oct Today Episode : హనీ గురించి తులసితో మాట్లాడిన నందు
దేవుడా ఆయనకు ఏం కాకుండా చూడు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది అనసూయ. మరోవైపు తులసి.. హనీకి జడ వేస్తూ ఉంటుంది. నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇక్కడే ఉండాలని ఉంది అంటుంది హనీ. ఇంతలో నందు వచ్చి తులసి నీతో మాట్లాడాలి అంటాడు. హనీని వాళ్ల ఇంట్లో దింపి వస్తాను. హనీ మన బాధ్యత కాదు అంటాడు నందు. దీంతో తులసికి కోపం వస్తుంది. సమాజం గురించి నేను చూసుకుంటాను. సమాజానికి నేను సమాధానం చెప్పుకుంటాను అంటుంది తులసి.
దీంతో ఏ హక్కుతో హనీని మన దగ్గర ఉంచుకుంటాం అని నందు అంటే.. దత్తత తీసుకోమంటారా? అనవసరంగా మాటలు మించొద్దు. ఆ పసిదాని మనసు బాధపెట్టకండి. కనీసం ఇక్కడైనా తనను ప్రశాంతంగా ఉండనివ్వండి. తనకేం ఇక్కడ ఇబ్బంది లేదు. ఏంటి మీ ప్రాబ్లమ్.. అంటుంది.
మరోవైపు అనసూయ వచ్చి ఏమైందిరా అంటే.. రత్నప్రభ రచ్చ రచ్చ చేస్తోంది. నాన్నను కూడా కొట్టించింది. హనీని పంపించాలని అంటోంది అని చెబుతాడు నందు. దీంతో అనసూయకు ఏం చేయాలో అర్థం కాదు. పరందామయ్యకు తగిలిన దెబ్బలను చూసి ఏడుస్తుంది అనసూయ. ఈ గొడవ ఎప్పుడు చల్లారుతుందో అని అనుకుంటుంది అనసూయ.
ఇంతలో దివ్య వస్తుంది. నన్ను కంగారు పెట్టి పిలిచారా? అని అడుగుతుంది దివ్య. దీంతో చూడు దెబ్బలు చూడు అంటుంది అనసూయ. ఏంటి తాతయ్య ఇది అంటుంది. ఇంతలో నందు, తులసి వస్తారు. అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా మామయ్య అంటుంది తులసి. ఇది ఎవరు చేశారో తెలియాలి కదా అంటుంది దివ్య. దీంతో తెలుసుకొని ఏం చేస్తావమ్మా అంటాడు పరందామయ్య.
మరోవైపు విక్రమ్ రెడీ అవుతుంటే జాను వస్తుంది. ఈల వేస్తూ ఉంటుంది. నువ్వా అంటాడు. మరి ఎవరు మీ ఆవిడ అనుకున్నావా? పుట్టింటికి వెళ్లిన ఆడాళ్లు అంత త్వరగా రారు అంటుంది. నేను ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు విక్రమ్.
పార్టీ ఇస్తా అన్నావు కదా.. పదా నువ్వు ఇవ్వకున్నా నేనైనా ఇస్తా అని చెప్పి అన్నీ అరేంజ్ చేసి పెడుతుంది. ఇదంతా ఏంటి.. అంటే మా బావ ఎంత పెద్ద మగాడూ తెలుసుకుందామని మందు సెటప్ చేశా అంటుంది. రా బావా కూర్చో. మందు తాగు. ఇప్పుడు నువ్వు తాగకపోతే లైఫ్ లో నీ ముఖం చూడను. మాట్లాడను. నీ ఇష్టం అంటుంది జాను. దీంతో విక్రమ్ తప్పక మందు తాగుతాడు.
టెన్షన్ పడకు బావ. అక్క రాదులే అంటుంది జాను. మరోవైపు నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో రత్నప్రభ ఫోన్ చేస్తుంది. ఇంతకుముందే కదా ఫోన్ చేశావు అంటే.. వాయిస్ రేజ్ చేయకు అంటుంది రత్న ప్రభ. ఒక్కసారి కాదు.. వందసార్లు ఫోన్ చేస్తా. నా మాట వినేవరకు ఫోన్ చేస్తా అంటుంది రత్నప్రభ.
నేను చెప్పేది విను. హనీని తీసుకొచ్చి అప్పగించు అంటుంది రత్నప్రభ. దీంతో తులసి హనీని ఇచ్చేలా లేదు ఏం చేయను అంటే.. హనీ వచ్చేవరకు నేను నీ వెంట పడుతూనే ఉంటాను. సతాయిస్తూనే ఉంటాను అంటుంది రత్నప్రభ. లేదంటే నేను డైరెక్ట్ గా తులసితోనే డీల్ చేసుకుంటాను అంటుంది రత్నప్రభ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.