Intinti Gruhalakshmi 12 Oct Today Episode : అనసూయ చెప్పినా వినకుండా సామ్రాట్ ఆఫీసుకు వెళ్లిన తులసి.. అనసూయ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 12 Oct Today Episode : అనసూయ చెప్పినా వినకుండా సామ్రాట్ ఆఫీసుకు వెళ్లిన తులసి.. అనసూయ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :12 October 2022,9:00 am

Intinti Gruhalakshmi 12 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 అక్టోబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 761 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి, సామ్రాట్ అందరి ముందే దాండియా ఆడి కప్పు గెలుచుకోవడంతో కాలనీ వాళ్లంతా ఆశ్చర్యపోతారు. చూశావా అనసూయ.. మా మీద మాత్రం కళ్లు పెద్దవి చేసుకొని మరీ చూస్తావు కదా. ఇప్పుడు నీకు ఇది కనిపించడం లేదా అని అంటారు. ఇంతలా బరి తెగిస్తారా? తెగిన గాలిపటం ఎక్కడికైనా వెళ్తుంది. ఇక్కడే ఇంతలా రెచ్చిపోతున్నారంటే ఇక ఏకాంతంగా ఉన్నప్పుడు ఇంకెలా ప్రవర్తిస్తున్నారో అని అంటారు అమ్మలక్కలు. దీంతో ఇక ఆపుతారా అంటుంది అనసూయ. ఇదంతా నీవల్లే అంటుంది తులసి. వద్దు వద్దు అంటే కూడా ఆయనతో దాండియా ఆడావు కదా. ఇక వెళ్లండి అంటుంది అనసూయ. మా తులసిని వదిలేయ్ అని ఎంత చెప్పినా నీకు అర్థం కాదా. చివరకు తులసి ఉద్యోగంలో నుంచి తీసేయించినా కూడా నువ్వు తులసిని వదిలేయవా అని అన్ని చెబుతుంది అనసూయ.

intinti gruhalakshmi 12 october 2022 full episode

ఏంటి అనసూయ.. నువ్వు చెప్పడం వల్లనే సామ్రాట్ ఉద్యోగంలో నుంచి తులసిని తీసేశాడా అని అడుగుతాడు పరందామయ్య. దీంతో అవును.. నేనే చెప్పాను అంటుంది. ఇలాంటి పరిస్థితి రాకూడదనే చెప్పాను అంటుంది అనసూయ. ఇది తప్పా అంటుంది అనసూయ. దీంతో అవును.. ఇది ముమ్మాటికీ తప్పే.. అంటుంది తులసి. ఇక.. నేను ఆగలేను. అసలు మీకెవరికీ సంస్కారం లేదు అని రెచ్చిపోతాడు సామ్రాట్. తులసి గారు ఇప్పుడు కూడా మన స్నేహం గురించి మాట్లాడకపోతే ఇక తప్పదు అని అంటాడు సామ్రాట్.

తర్వాత దసరా పండుగ నాడు ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అంటాడు. కాలనీ వాసులకు తమ మధ్య ఏముందని క్లారిటీ ఇస్తాడు. సారీ తులసి గారు నేను ఈరోజు ఇక్కడికి రావాల్సింది కాదు అని అంటాడు సామ్రాట్.

దీంతో మీరు వచ్చింది మంచిది అయింది సామ్రాట్ గారు. సామ్రాట్ గారు నాకు మంచి స్నేహితులు. వ్యాపార భాగస్వామి. అంతకుమించి మంచి మనిషి. అని అంటుంది తులసి. దీంతో మాట నిలబెట్టుకోవడం తెలియదు ఆయనకు అంటుంది అనసూయ.

Intinti Gruhalakshmi 12 Oct Today Episode : సామ్రాట్ గారి గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోనన్న తులసి

నిజంగా మనల్ని రోడ్డు మీదికి లాగాలంటే ఆయన హోదాకు ఐదు నిమిషాలు చాలదు. ఒక ఆడది చదువుకోకపోవచ్చు కానీ.. మగాడి మనసును వెంటనే తెలుసుకోగలదు. ఆయన చేసిన తప్పేమైనా ఉంది అంటే.. ఒక్కటే. నాకు సాయం చేయడం.. చేయాలనుకోవడం.

చెప్పేది విని అర్థం చేసుకోండి. అది లేని వాళ్లకు ఎంత చెప్పినా వేస్ట్. ఒక్కటి మాత్రం ఇంట్లో వాళ్లకు, బయటి వాళ్లకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు నుంచి సామ్రాట్ గారి గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోను అంటుంది తులసి.

సీతమ్మ లాంటి మహాసాద్వి మీద ఆనాటి సమాజం ఎలా నిందలు వేయగలిగింది అని. అప్పటి సమాజం.. ఇప్పటి సమాజం ఒక్కటే. నాకు సీతాదేవికి ఒకే తేడా. సీతమ్మ వారిలా నేను నిందలు భరించను. మొహం పగిలేలా సమాధానం చెబుతాను అంటుంది తులసి.

ఒక మనసు ఇంకో మనసుకు దగ్గరవుతే దాన్ని స్నేహం అంటారు. మా స్నేహం ఎప్పుడూ ముక్కలు కాదు. సామ్రాట్ గారి సంస్కారం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ కాలనీకే కాదు.. ఏకంగా నా ఇంటికే వస్తాడు.

నన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను.. ఎప్పుడైనా వస్తాడు. నాతో మాట్లాడటానికి వస్తాడు. రాత్రి అయినా వస్తాడు. పని ఉన్నా వస్తాడు. భోజనానికి వస్తాడు. పండుగ అయినా వస్తాడు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వస్తాడు.

ఆయన ఎప్పుడు వచ్చినా స్వాగతం పలుకుతాను. ఆయనకు అవమానం జరిగితే మాత్రం నేను ఊరుకునేదే లేదు అంటుంది తులసి. దీంతో అందరూ చప్పట్లు కొడతారు. పదండి సామ్రాట్ గారు అని అక్కడి నుంచి తులసి వెళ్లిపోతుంది.

తులసి తనను సపోర్ట్ చేయడంతో సామ్రాట్ చాలా సంతోషిస్తాడు. తనకు పట్టరాని ఆనందం వేస్తుంది. మనసులో నుంచి నాకు దిగులు ఇక పారిపోయింది. అనసూయ మాటలకు బాధపడి తులసికి ఏమవుతుందో అని భయపడ్డా.

నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు కాదని అందరి ముందు తులసి గారు తేల్చేశారు. ఇదే నాకు కావాల్సింది. ఇదే నేను కోరుకుంది. ఈరోజు ఒక్క మనిషి నా స్నేహం కోసం చుట్టూ ఉన్నవాళ్లతో సమాజంతో పోరాడుతోంది.

అందరి ముందు తలవంచుకోవాలేమో.. తులసి గారు నన్ను పట్టించుకోరేమో అని అనుకున్నాను. తులసి గారు నన్ను పూర్తిగా సపోర్ట్ చేశారు. ఈ ప్రపంచాన్నే గెలిచినంత ఆనందంగా ఉంది అంటాడు సామ్రాట్.

నా మనసుకు చాలా తృప్తిగా ఉంది అంటాడు సామ్రాట్. నాకు చాలా సంతోషంగా ఉంది. ధైర్యం అంటే తులసి గారిది. ఆత్మవిశ్వాసం అంటే అది. ఒక స్త్రీ ఎదగాలంటే ఆ మాత్రం తెగింపు ఉండాలి అంటాడు సామ్రాట్.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక వెనక్కి తగ్గను. తులసి గారితో కలిసి మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేస్తా అంటాడు సామ్రాట్. కారులో పడుకున్న హనీని తీసుకెళ్లి లోపలికి వెళ్తాడు సామ్రాట్. మరోవైపు తెల్లారి ఆఫీసుకు వెళ్తుంది తులసి.

మ్యూజిక్ ఫైల్ ఎక్కడుందా అని వెతుకుతుంది. కానీ.. ఆ మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ ను నందు, లాస్య హ్యాండోవర్ చేసుకున్నారని తెలిసి తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది