Intinti Gruhalakshmi 13 Sep Today Episode : ప్రేమ్ ను పెళ్లి చేసుకోను.. అని తులసికి తెగేసి చెప్పిన శృతి.. ఆ మాటలు విన్న ప్రేమ్ ఏం చేశాడు? శృతిని వదిలేశాడా? అక్షరను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా?

intinti gruhalakshmi 13 september 2021 monday episode 423 highlights
Intinti Gruhalakshmi 13 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి 13 సెప్టెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 423 తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 423 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నందు, ప్రేమ్ చెప్పిన మాటలను తలుచుకుంటూ బాధపడుతుంది శృతి. ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. ఎందుకు బాధపడుతున్నావు తులసి. ఏమైంది.. అని అడుగుతుంది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.

intinti gruhalakshmi 13 september 2021 monday episode 423 highlights
ఏం లేదు ఆంటి.. అంటుంది శృతి. దీంతో.. నాకు తెలుసు శృతి.. నువ్వు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో.. దేని గురించి ఆలోచిస్తున్నావో.. అంటుంది. ఏ అమ్మాయికైనా.. ఈ క్షణంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సమయాల్లో అమ్మ పక్కనే ఉంటే బాగుండు కదా.. అని అనిపిస్తుంది. నేను నీ కన్నతల్లి లాంటి దాన్నే అనుకో. నీలో ఉన్న బాధను నాకు చెప్పు.. అంటుంది. ఇంతలో తనను కౌగిలించుకుంటుంది శృతి. వెక్కి వెక్కి ఏడుస్తుంది.
ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు.. చెప్పాను కదా. నీకు తల్లి స్థానంలో ఉండి అడుగుతున్నా. నీకు ఎలాంటి సమస్య వచ్చినా తీర్చుతాను. నీ మనసులోని బాధను అర్థం చేసుకుంటాను చెప్పమ్మా.. అని అడుగుతుంది తులసి. అదేం లేదు ఆంటి.. సమాధానం లేని ప్రశ్న అంటున్నారు కదా. దాన్ని అలాగే ఉండనివ్వండి.. అంటుంది శృతి.

intinti gruhalakshmi 13 september 2021 monday episode 423 highlights
ప్రేమ్ లాంటి భర్తను నువ్వు కోరుకున్నావని నాకు తెలుసు. ప్రేమ్ లాంటి భర్తను ఎందుకు కోరుకోవాలి.. ప్రేమ్ నే ఎందుకు కోరుకోకూడదు.. అని అడుగుతుంది తులసి. కానీ.. శృతి మాత్రం ఏం మాట్లాడదు. ప్రేమ్ మనస్తత్వం గురించి నీకు తెలుసు కదా.. అని చెప్పినా.. ప్రేమ్ కు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయడంలో తప్పు లేదు కానీ.. మీరు నా మనసును సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆంటి. నేను ప్రేమ్ ను పెళ్లి చేసుకోవాలనుకోలేదు ఆంటి.. అంటూ పెద్ద షాక్ ఇస్తుంది శృతి.
అదేంటమ్మా.. నువ్వు మనసును చంపుకొని సమాధానం చెబుతున్నావు కదా.. అంటే ఆ అవసరం నాకు లేదు ఆంటి. నా మనసులో ఉన్నదే నేను చెబుతున్నాను.. అంటుంది. నిజానికి కూడా అబద్ధం అనుకుంటే నేనేం చేయలేను.. అంటుంది శృతి.
ఎంత సేపు మీరు ప్రేమ్ గురించే ఆలోచిస్తున్నారు కానీ.. నా గురించి ఎందుకు ఆలోచించడం లేదు అంటుంది శృతి. ప్రేమ్ ను పెళ్లి చేసుకోవాలనుకునే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. తనతో జీవితాంతం ఉండాలన్న ఆలోచన నాకు లేదు. మీరు పదే పదే అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి.. అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

intinti gruhalakshmi 13 september 2021 monday episode 423 highlights
ఖచ్చితంగా శృతి మనసులో ప్రేమ్ ఉన్నాడు కానీ.. తన మనసులో ఉన్న ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతోంది. ఈ విషయాన్ని ప్రేమ్ కు ఎలా చెప్పాలి. ప్రేమ్ కు చెబితే వాడు ఎలా అర్థం చేసుకుంటాడు.. అని అనుకుంటుండగానే ప్రేమ్ అక్కడే ఉండి.. వీళ్ల మాటలు అన్నీ వింటాడు. శృతి అన్న మాటలను కూడా ప్రేమ్ వింటాడు.
Intinti Gruhalakshmi 13 Sep Today Episode : శృతి.. ప్రేమ్ తో పెళ్లికి ఒప్పుకోలేదని నందుకు చెప్పిన లాస్య

intinti gruhalakshmi 13 september 2021 monday episode 423 highlights
కట్ చేస్తే తెల్లారుతుంది. షూర్ అండి.. అంటూ నందు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుంటాడు. ఈ క్లయింట్స్ కు ఏవిధంగా సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది. ఇంతలోనే లాస్య అక్కడికి వచ్చి.. మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతున్నాయి. శృతి విషయంలో చేసిన ప్రయోగం ఫలించింది. ప్రేమ్ ను పెళ్లి చేసుకోను.. అని శృతి చెప్పేసింది. తులసితో చెప్పేసింది. నేరుగా తులసితో చెప్పేసింది. ప్రేమ్ కూడా తులసికి శృతి చెబుతుండగా విన్నాడు. అయితే.. ప్రేమ్ మనం చెప్పినట్టే వింటాడు అన్నమాట.. జీకే కూతురుతో పెళ్లికి ఒప్పుకుంటాడు.. అని అంటాడు నందు. కానీ.. అది అంత ఈజీ కాదు. ప్రేమ్ ను మన దారికి తెచ్చుకోవాలంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ్ కండీషన్ ను మనకు అనుకూలంగా మార్చుకోవాలి.. అని నందు అంటుండగానే జీకే ఫోన్ చేస్తాడు.

intinti gruhalakshmi 13 september 2021 monday episode 423 highlights
రెండు రోజుల్లో మీకు ఒక శుభవార్త చెబుతాను.. అని నందు చెప్పగానే.. ఈ విషయం నా కూతురుకు కూడా చెప్పొచ్చా.. అని అంటాడు జీకే. నిరభ్యంతరంగా అంటాడు నందు. కూతురు పెళ్లి కోసం ఆయన ఆరాటపడుతున్నారు.. అంటూ లాస్యకు నందు చెబుతాడు. కట్ చేస్తే.. ప్రేమ్.. శృతి గురించే ఆలోచిస్తుంటాడు. తులసి.. ప్రేమ్ ను ఓదార్చుతుంది. వద్దు నాన్నా.. నువ్వు బాధపడకు. ఇవన్న మన జీవితంలో సహజం. నువ్వు కుమిలిపోకు.. అంటూ ప్రేమ్ ను ఓదార్చుతుంది తులసి.

intinti gruhalakshmi 13 september 2021 monday episode 423 highlights
ఇంతలో ప్రేమ్ కు అక్షర ఫోన్ చేస్తుంది. ఎవరు అని అడుగుతాడు ప్రేమ్. ఒక అందమైన అమ్మాయి.. తీయని గొంతుతో హాయ్ అని చెబితే.. అబ్బాయిలు ఎవరు అయినా ఎగిరి గంతేస్తారు.. నువ్వేంటి.. ఇలా మాట్లాడుతున్నావు అంటే.. అక్షరను ఇష్టం ఉన్నట్టు తిడుతాడు ప్రేమ్. నీకు అసలు సిగ్గుందా? పక్కనే ఉంటే చంపేస్తా.. అంటూ సీరియస్ గా మాట్లాడేసరికి.. అక్షర తెగ ఫీల్ అవుతుంది. వెంటనే తన నాన్నకు చెబుతుంది. ప్రేమ్ కు ఫోన్ చేస్తే సీరియస్ అయ్యాడు. తిట్టి ఫోన్ పెట్టేశాడు అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.