Intinti Gruhalakshmi 14 Dec Today Episode : తులసి ఊళ్లో సామ్రాట్ ను చూసి తన భర్త అనుకొని ఇద్దరినీ ఒకే రూమ్ కు పంపించిన తులసి ఫ్రెండ్స్.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
Intinti Gruhalakshmi 14 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 డిసెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 815 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయం కాగానే తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి కారులో వెళ్తుంటారు. తులసి వాళ్ల ఊరు దగ్గరికి వస్తుంది. కానీ.. తులసి తన ఊరును గుర్తుపట్టదు. దీంతో కారును స్లో గా తీసుకుపోనిస్తుంటాడు సామ్రాట్. ఎలాగైనా తులసి తన ఊరిని గుర్తుపట్టేలా చేయాలి అని అనుకుంటాడు సామ్రాట్. ముందు రామచంద్రాపురం అనే బోర్డు కనిపిస్తుంది. దీంతో వెంటనే కారును ఆపుతాడు. కారు ఆగిపోయింది. ఏమైందో చూడాలి. దిగండి అంటాడు సామ్రాట్. దీంతో కారు దిగుతుంది తులసి. కారు దిగి విచిత్రంగా ఊరును చూస్తుంది. ఊరు అందాలను ఆస్వాదిస్తూ ఉంటుంది.

intinti gruhalakshmi 14 december 2022 full episode
ఇంతలో వెనక్కి తిరిగి తన ఊరు బోర్డు చూసి షాక్ అవుతుంది. రామచంద్రాపురం అంటూ నోరెళ్లబెడుతుంది. మనం సంతోష పడే కన్నా.. ఇంకొకరు సంతోషానికి కారణం కావడం చాలా ఆనందాన్నిస్తుంది అని అనుకుంటాడు సామ్రాట్. నా ఊరు అంటూ అనుకుంటుంది తులసి. తన ఊరు పేరును చూసి మురిసిపోతుంది. వెంటనే సామ్రాట్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుంది. దీంతో ఏమైంది తులసి గారు అని అడుగుతాడు సామ్రాట్. పట్టలేని సంతోషంతో ఉన్నారు ఎందుకు అని అడుగుతాడు. దీంతో అది అది అంటూ ఊరు బోర్డు చూపిస్తుంది. దీంతో అది మా ఊరు అని చూపిస్తుంది. ఇంత ఆలస్యంగా గుర్తు పట్టారేంటి మీ ఊరును అని అడుగుతాడు సామ్రాట్. దీంతో ఎప్పుడో చిన్నప్పుడు మా ఊరిని చూశా. ఆ తర్వాత రాలేదు అని అంటుంది తులసి.
చిన్నతనంలో ఇక్కడే నేను పెరిగానను అని అంటుంది తులసి. నా జీవితం నాది.. చాలా ఎంజాయ్ చేశాను అని అంటుంది తులసి. తులసి గారు.. కారు రిపేర్ పూర్తయింది. ఇక మనం బయలుదేరుదామా అంటాడు సామ్రాట్. దీంతో వెళ్లాలా అంటుంది. తప్పదా అంటుంది తులసి. దీంతో అది మీ ఇష్టం అంటాడు సామ్రాట్.
దీంతో నాకు ఈరోజు మొత్తం ఇక్కడే గడపాలని ఉంది అని అంటుంది తులసి. దీంతో ఈరోజు మీది. నేను నా కారు మీ సేవలోనే ఉంటాం. మీతోనే ఉంటాం అంటాడు సామ్రాట్. మీ ఆనందాన్ని చూస్తూ ఉంటాం అంటాడు సామ్రాట్. కాకపోతే ఒక కండిషన్ అంటాడు. నన్ను కూడా మీ ఆనందంలో భాగం చేసుకోవాలి. నాకు కూడా మీ సంతోషాన్ని పంచి ఇవ్వాలి అంటాడు సామ్రాట్.
Intinti Gruhalakshmi 14 Dec Today Episode : తన ఊరంతా కలియ తిరిగిన తులసి
దగ్గరుండి మీ ఊరు అంతా చూపించండి అంటాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది తులసి. ఊరిలో మొత్తం తిరుగుతూ ఉంటారు. మరోవైపు లాస్య ఇంటికి ఎవరో వస్తారు. ఎవరు అని అడుగుతుంది. డాక్టరమ్మ గారి కోసం వచ్చాం అని అంటారు. దీంతో మీ డాక్టరమ్మ ఇక్కడ క్లీనిక్ పెట్టలేదు. హాస్పిటల్ కు వెళ్లండి అని అంటుంది లాస్య.
దీంతో బాగోలేనప్పుడు ఇంటికే వచ్చి చూపించుకుంటాం అని అంటుంది ఆమె. డాక్టర్ గారిని పిలవండి అంటారు. దీంతో పిలుస్తాను కానీ.. 500 ఇవ్వండి అంటుంది లాస్య. డబ్బులెందుకమ్మా. మా దగ్గర ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదమ్మా అంటారు.
డబ్బులు లేనప్పుడు జబ్బులు ఎందుకు తెచ్చుకున్నారు. ఇంకా ఇక్కడే నిలబడ్డారు ఎందుకు. వెళ్లండి అంటుంది లాస్య. దీంతో ఒక్క నిమిషం అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ ఇస్తాడు. లోపలికి వెళ్లి కూర్చోండి.. డాక్టరమ్మను పంపిస్తాను అంటుంది లాస్య.
మరోవైపు తన ఊరు మొత్తం తిరుగుతూ ఉంటుంది తులసి. ఇంతలో మామిడి తోటకు వెళ్తుంది. అక్కడ తన చిన్ననాటి మెమోరీస్ గుర్తొస్తాయి తులసికి. వీరయ్య అనే వ్యక్తిని మస్కా కొట్టి మామిడికాయలు కోసుకున్న విషయాలు తనకు గుర్తొస్తాయి.
ఇంతలో వీరయ్య కనిపిస్తాడు తులసికి. ఆయనకు కొన్ని డబ్బులు ఇచ్చి నేను వస్తాను వీరయ్య తాత అంటుంది తులసి. ఆ తర్వాత ఊళ్లో తన చిన్ననాటి స్నేహితులు కనిపిస్తారు తులసికి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.