Intinti Gruhalakshmi 14 May Today Episode : తులసికి బిగ్ షాక్ ఇచ్చి వెళ్లిపోయిన ప్రవళిక.. తులసికి మరో షాకిచ్చిన నందు, లాస్య

Intinti Gruhalakshmi 14 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 మే 2022, శనివారం ఎపిసోడ్ 632 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసిని తన ఫ్రెండ్ జానకి దగ్గరికి తీసుకెళ్తుంది ప్రవళిక. తను కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒక్కరే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు చెప్పుకొచ్చింది ప్రవళిక. దీంతో తులసి షాక్ అవుతుంది. తనకు కారులో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లిరావడం డ్రీమ్ అని.. అందుకే.. తను అలా వెళ్తోందని చెబుతుంది ప్రవళిక. తర్వాత ఇద్దరూ తనకు ఆల్ ది బెస్ట్ చెబుతారు. దీంతో జానకి కారులో వెళ్లిపోతుంది. మరోవైపు నేను ఢిల్లీకి వెళ్లిపోతున్నాను. నాకు ట్రాన్స్ ఫర్ అయింది.. అని షాకింగ్ న్యూస్ చెబుతుంది ప్రవళిక.

Advertisement
intinti gruhalakshmi 14 may 2022 full episode
intinti gruhalakshmi 14 may 2022 full episode

ఇదే నిన్ను కలవడం ఆఖరి సారి కావచ్చు. ఇలా వెళ్లిపోవడం నాకు బాధగానే ఉంది అంటుంది ప్రవళిక. కానీ.. పక్కన లేకపోయినా నిన్ను వదిలిపెట్టను. ఫోన్ లో సాధిస్తూనే ఉంటాను అంటుంది ప్రవళిక. దీంతో దేవుడు నాకోసమే నిన్ను ఇక్కడికి పంపినట్టు ఉంది. నువ్వు రావడం వెళ్లడం ఒక కలలా ఉంది అంటుంది తులసి. నువ్వు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వను ప్రవళిక అంటుంది తులసి. ఆ తర్వాత తనను ప్రేమగా తట్టి కౌగిలించుకుంటుంది ప్రవళిక.

మరోవైపు శృతి తన ఓనర్ తో కలిసి కొట్టుకు వస్తుంది. తన బాబును ఎత్తుకుంటుంది. మరోవైపు ప్రేమ్ అప్పుడే దీనంగా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటాడు. అద్దె ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ్ నడుచుకుంటూ వెళ్లడానికి చూస్తుంది శృతి. కానీ.. ప్రేమ్ తనను చూడడు. దీంతో ఊపిరి పీల్చుకుంటుంది శృతి.

ఇంతలో సడెన్ గా ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. శృతికి టీ అంటే ఇష్టం అని టీ పౌడర్ కొనుక్కెళ్లేందుకు కొట్టు దగ్గరికి వస్తాడు ప్రేమ్. దీంతో శృతి తన తల మీద కొంగు కప్పుకొని అటువైపు వెళ్తుంది. తనకు టీ పౌడర్ కొందామనుకొని ఇంకా ఏమైనా కావాలో ఏమో.. శృతికి ఫోన్ చేసి అడుగుతాను అని అనుకుంటాడు ప్రేమ్.

తర్వాత ఎందుకో మనసు మార్చుకోని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్. మరోవైపు అంకితతో ఎంత మాట్లాడాలని ట్రై చేసినా అంకిత మాట్లాడదు. చిరాకుగా ఉంది అంటుంది. దీంతో ఈ చిరాకు ఎప్పుడు తగ్గుతుంది అని అడుగుతాడు అభి. అది నా చేతుల్లో లేదు అంటుంది అంకిత.

Intinti Gruhalakshmi 14 May Today Episode : అభి, అంకిత మధ్య గొడవ

జరిగేదంతా మన మంచికే అనుకోవచ్చు కదా అంటాడు. అలా ఎలా అనుకోమంటావు అంటుంది అంకిత. తనకోసం చీర తీసుకొస్తాడు అభి. రేపు గుడికి వెళ్లేటప్పుడు ఇది కట్టుకో అంటాడు అభి. నా సెలెక్షనే అంటాడు. దీంతో సెలెక్షన్ నీదే.. కానీ.. డబ్బు ఎవరిది అని అడుగుతుంది.

దీంతో సమాధానం తెలిసి కూడా నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు అభి. మరోవైపు తులసి తన స్కూటీ మీద బియ్యం బస్తా తీసుకొస్తుంది. దాన్ని తీయడానికి తంటాలు పడుతుంది. ఇంతలో పరందామయ్య వచ్చి తనకు సాయం చేయబోతాడు.

కానీ.. వద్దు అంటుంది తులసి. దివ్య వచ్చి తనకు సాయం చేయబోతుంది. కానీ.. ఆ బియ్యం బస్తా అస్సలు అందులో నుంచి రాదు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు. అనసూయ, పరందామయ్య అక్కడికి వెళ్లి చూస్తుంటారు. ఆడవాళ్లు.. వాళ్ల వల్ల ఏమౌతుంది. అలా దిష్టిబొమ్మలా చూస్తూ నిలబడే బదులు మీరూ ఒక చేయి వేయొచ్చు కదా అని అంటుంది అనసూయ.

దీంతో వద్దు మామయ్య అంటుంది. మీరు హార్ట్ పేషెంట్ అంటుంది. దివ్య కూడా అదే అంటుంది. ఇలాంటప్పుడే ఇంట్లో మగాడి అవసరం తెలుస్తుందమ్మా. ఉన్న నేను ఒక్కడిని దేనికీ పనికిరాని వాడిని. తిని కూర్చోవడం తప్పితే దేనికీ పనికిరాని వాడిని అని అంటాడు పరందామయ్య.

నువ్వు ఒంటరిగా పడే కష్టం చూస్తుంటే బాధనిపిస్తోంది అని అంటాడు పరందామయ్య. మామయ్య.. ఎక్కువ ఆలోచించకండి అంటుంది. ఇంతలో నందు, లాస్య అక్కడికి వచ్చి వీళ్లను చూస్తుంటారు. నందు నీకు గుర్తుందో లేదో కానీ.. నాకు మాత్రం బాగా గుర్తుంది.

ఈ వీరనారి.. కొన్ని రోజుల క్రితం బస్తీమే సవాల్ అంది. కానీ.. ఇప్పుడు బస్తా బియ్యం బరువును కూడా మోయలేకపోతోంది. చూస్తుంటే జాలేస్తోంది నందు అంటుంది లాస్య. దీంతో మాటలు చెప్పడానికి, చాలెంజ్ చేయడానికి నోరు ఉంటే సరిపోతుంది అంటాడు నందు.

కానీ.. ఆ చాలెంజ్ నిలబెట్టుకోవడానికి సత్తా ఉండాలి అంటాడు నందు. దీంతో నువ్వు మా కొడుకువు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అంటుంది అనసూయ. నీకు చేతనైతే ఆ బస్తా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు అని అంటుంది అనసూయ. దీంతో తనను చెప్పమను.. ఇంట్లో పెడతా అంటాడు నందు.

తను చెప్పేదేంట్రా.. నేనే చెబుతున్నాను.. నీలాంటి పనికిమాలిన కొడుకును కన్నానని అంటుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement