Intinti Gruhalakshmi 14 Oct Today Episode : లాస్య విషయంలో నందుపై జీకే సీరియస్.. అక్షరకు శృతి ప్రేమ గురించి తెలిసేలా లెటర్ రాసి పంపించిన ప్రేమ్
Intinti Gruhalakshmi 14 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 అక్టోబర్ 2021, గురువారం లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ పెళ్లికొడుకుగా అయ్యాక కూడా ఇంకా శృతిని మరిచిపోలేకపోతాడు. బట్టలు మార్చుకొని రావాలంటూ పూజారి చెప్పడంతో తన రూమ్ లోకి వచ్చిన ప్రేమ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. దీంతో తనకు ఓ ఆలోచన వస్తుంది. వెంటనే పెన్ను పేపర్ తీసుకొని ఏదో రాస్తాడు. దాన్ని మడతబెడుతాడు. మరోవైపు తులసి కూడా టెన్షన్ పడుతుంటుంది.

intinti gruhalakshmi 14 october 2021 full episode
శృతి.. ఒకవేళ పెళ్లిమండపానికి వస్తే ఎలా? అని భయపడుతుంది భాగ్య. ఈ విషయం లాస్యకు చెప్పడంతో.. లాస్యను గదిలో నందు బంధించాడు. శృతి కళ్యాణ మండపానికి వచ్చే చాన్సే లేదు అని అంటుంది లాస్య. ఈ విషయం తెలుసుకున్న తులసి షాక్ అవుతుంది. మరోవైపు తన లెటర్ ను తీసుకొని ఆ లెటర్ ను అక్షరకు చేర్చాలని అనుకుంటాడు. ఒక అమ్మాయిని పిలిచి.. ఈ లెటర్ పెళ్లికూతురుకు ఇవ్వు అని చెబుతాడు. ఆ చిన్నారి తీసుకెళ్లి ఏకంగా అంకితకు ఇస్తుంది. అంకిత ఆ లెటర్ మొత్తం చదువుతుంది. శృతి ప్రేమ గురించి అక్షరకు చెప్పి ఈ పెళ్లి ఆపేద్దామని అనుకున్నావా? అది జరగనివ్వను.. అని మనసులో అనుకుంటుంది అంకిత.
Intinti Gruhalakshmi 14 Oct Today Episode : జీకేతో మాట్లాడేందుకు ప్రయత్నించిన తులసి
ఇలా అయితే కుదరదు.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది తులసి. వెంటనే జీకే గారి దగ్గరికి వచ్చి అన్నయ్యగారు మీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి అంటుంది. ఇక్కడ కాదు పక్కకెళ్లి మాట్లాడదాం అంటుంది. ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు అంటాడు. ఇంతలో జీకే పదా అని అనేలోపే.. నందు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి పదా.. అంటాడు నందు. ముందు తనేదో చెబుతా అంటోంది. అది అయ్యాక మీరు మాట్లాడుకోవచ్చు అంటాడు జీకే.

intinti gruhalakshmi 14 october 2021 full episode
నందుతో వెళ్లిన తులసి.. నందుపై సీరియస్ అవుతుంది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. శృతి ఎక్కడ అని అడుగుతుంది. నేను మీకంటే గట్టిగా అరవగలను.. అంటుంది. ఇప్పుడు నీకు శృతితో ఏం అవసరం అంటాడు నందు. తులసి ఎన్నిమాటలు చెప్పినా వినకుండా నందు తను అనుకున్న పనే చేస్తాడు. పెళ్లి బట్టలు కట్టుకొని ప్రేమ్ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. పెళ్లి కూతురును పిలుస్తారు.
పెళ్లి కూతురు తన లెటర్ చదివి రాదు కావచ్చు అని ప్రేమ్ అనుకుంటాడు. కానీ.. అక్షర చక్కగా ముస్తాబు అయి పెళ్లి పీటల మీదికి వస్తుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. తులసి కూడా ఏం చేయలేని నిస్సాయక స్థితిలోకి చేరుకుంటుంది. శృతిని నేను తీసుకొస్తా అని చెప్పి బయలుదేరుతుంది తులసి. కన్యాదానం సమయం అవుతుంది.. తులసి ఎక్కడ అని జీకే.. నందును అడుగుతాడు. తులసి వచ్చేసరికి సమయం అవుతుంది. తన స్థానంలో లాస్యను కూర్చోబెడదాం అని నందు అనేసరికి.. సీరియస్ అవుతాడు జీకే. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.