Intinti Gruhalakshmi 15 Aug Today Episode : వైజాగ్ బీచ్ లో సముద్రంలో కొట్టుకుపోయిన తులసి.. సామ్రాట్ షాక్.. తులసి ప్రాణాలతో బయటపడుతుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 15 Aug Today Episode : వైజాగ్ బీచ్ లో సముద్రంలో కొట్టుకుపోయిన తులసి.. సామ్రాట్ షాక్.. తులసి ప్రాణాలతో బయటపడుతుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :15 August 2022,9:30 am

Intinti Gruhalakshmi 15 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 711 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఊరికే సామ్రాట్ ను విసిగిస్తూ ఉంటుంది. దీంత తులసి గారు మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరు తొలిసారి విమానం ఎక్కారు. విమానం ఎక్కిన అనుభూతిని పొందండి అంటాడు. దీంతో తను ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత తను కాసేపు నిద్రపోతుంది. దీంతో తనకు చలిపెడుతోందని తెలుసుకొని తన కోటు విప్పి తనకు కప్పుతాడు. ఆ తర్వాత తను లేచి చూసి కోటు ఎందుకు కప్పారు అని అడుగుతుంది. దీంతో మీకు చలిపెడుతోందని కప్పాను అంతే అంటాడు. ఆ తర్వాత సామ్రాట్ తన కోటును వేసుకుంటాడు. మరోవైపు అంకిత చెప్పినట్టుగా శృతిని తీసుకొని వచ్చేందుకు ప్రేమ్.. శృతి ఉండే ఇంటికి వెళ్తాడు. అక్కడ శృతి ఉండదు. ఇంటికి తాళం వేసి ఉంటుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు.

intinti gruhalakshmi 15 august 2022 full episode

intinti gruhalakshmi 15 august 2022 full episode

ఇంతలో అంకిత ఫోన్ చేసి నువ్వు ఏం టెన్షన్ పడకు. శృతి నీతో వస్తుంది. శృతికి ఫోన్ చేసి తను ఎక్కడుందో కనుక్కో అని చెబుతుంది అంకిత. అతడికి భరోసా ఇస్తుంది. కట్ చేస్తే విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడి విమానం కుదుపులకు గురవుతుంది. దీంతో విమానంలోని ప్రయాణికులంతా షాక్ అవుతారు. ఏమైంది అని అందరూ కంగారు పడతారు. అందరూ ఎయిర్ హోస్టెస్ ల మీద అరుస్తారు. నందు అయితే ఏకంగా ఎయిర్ హోస్టెస్ మీద అరిచి నెట్టేస్తాడు. దీంతో తులసి నందుపై సీరియస్ అవుతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నారు. ఆవిడ ఏం చేస్తుంది. ఆవిడ తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తోంది అని సర్దిచెబుతుంది.

మన భయమే మన మృత్యువు.. అని చెబుతుంది. పిరికివాడిని మృత్యువు తేలికగా తీసుకెళ్తుంది అంటుంది. మీరు ఏం టెన్షన్ పడకండి. ధైర్యంగా ఉండండి అని తులసి అందరికీ ధైర్యం చెబుతుంది. ఇంతలో విమానంలో టెక్నికల్ సమస్య తగ్గినట్టు ప్రకటిస్తారు.

Intinti Gruhalakshmi 15 Aug Today Episode : విమానంలోని అందరినీ మోటివేట్ చేసిన తులసి

దీంతో అందరూ తులసి మోటివేట్ చేసినందుకు చప్పట్లు కొడతారు. చూశారా.. మీలో ఉన్న గొప్పదనం అదే అంటాడు సామ్రాట్. మరోవైపు మీకో విషయం చెప్పనా.. అని నందుతో అంటాడు బత్తాయి బాలరాజు. ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్లిద్దరూ ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటారు.. అంటాడు.

ఆ తర్వాత విమానం ల్యాండ్ అవుతుంది. సామ్రాట్, తులసి తో పాటు నందు, లాస్య హోటల్ కు వస్తారు. హోటల్ ముందు సామ్రాట్, తులసి ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి లాస్య, నందు షాక్ అవుతారు. తర్వాత సామ్రాట్ దగ్గరికి వెళ్తారు. సామ్రాట్ కు ఇంతలో ఫోన్ వస్తుంది.

వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉందని క్లయింట్ మీటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు అని చెబుతాడు సామ్రాట్. రేపటికి వాయిదా చేశారు అని అంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది తులసి. చేసేదేముంది… ఇవాళ రెస్ట్ తీసుకోవడమే అంటాడు. తర్వాత సామ్రాట్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి మాకు ఇంకో రూమ్ కావాలి అంటాడు.

దీంతో ఇంకో రూమ్ లేదు అంటుంది రిసెప్షనిస్ట్. దీంతో పర్లేదు సార్.. మనిద్దరం ఒక రూమ్ లో ఉండి.. వాళ్లిద్దరిని ఇంకో రూమ్ లో ఉంచుదాం అంటాడు నందు. కానీ.. వద్దు నేను ఒప్పుకోను అంటాడు సామ్రాట్. ఎంతో ముచ్చటపడి మీ ఆవిడను టూర్ కు తీసుకొచ్చారు అంటాడు సామ్రాట్.

మీ ఇద్దరిని విడదీస్తే నాకు పాపం తగులుతుంది అంటాడు సామ్రాట్. మీరిద్దరూ రూమ్ కు వెళ్లండి అని కీ ఇస్తాడు సామ్రాట్. దీంతో మరి మీరు అంటాడు నందు. దీంతో మా విషయం మేము చూసుకుంటాం కదా అంటాడు సామ్రాట్. ఆ తర్వాత రూమ్ లో ప్రెషప్ అయ్యాక తులసిని బీచ్ కు తీసుకెళ్తాడు సామ్రాట్.

అయితే.. బీచ్ లో అలలు ఎక్కువగా ఉండటంతో అలలకు తులసి సముద్రంలో కొట్టుకుపోతుంది. సామ్రాట్ ఫోన్ లో మాట్లాడుతూ తులసిని చూసుకోడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది