Intinti Gruhalakshmi 16 Sep Today Episode : సామ్రాట్ కారుకు యాక్సిడెంట్.. తులసి, సామ్రాట్ కు ఏమౌతుంది? సామ్రాట్ చనిపోతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 16 Sep Today Episode : సామ్రాట్ కారుకు యాక్సిడెంట్.. తులసి, సామ్రాట్ కు ఏమౌతుంది? సామ్రాట్ చనిపోతాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :16 September 2022,9:00 am

Intinti Gruhalakshmi 16 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 739 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మాకు ఈ ఉద్యోగం మళ్లీ వచ్చేలా చేసినందుకు థాంక్స్ అని తులసితో చెబుతుంది లాస్య. కానీ.. నందు విషయం మనసులో పెట్టుకొని ఏదైనా చేస్తాడా అని అడుగుతుంది లాస్య. దీంతో ఇన్ని రోజుల నుంచి సామ్రాట్ గారితో పని చేస్తున్నావు కదా. ఆయన గురించి నీకు తెలియదా అని అంటుంది తులసి. ఆ తర్వాత సామ్రాట్ రూమ్ లోకి వెళ్లిపోతుంది తులసి. లాస్య వచ్చి నన్ను కలిసింది అని అంటుంది తులసి. దీంతో వాళ్ల గురించి పెద్దగా పట్టించుకోండి. ముందు మీరు బ్రేక్ ఫాస్ట్ చేశారా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో నేను చేశాను.. మీరు చేశారా అని అడుగుతుంది తులసి. నేను తినలేదు. నాకు కంపెనీ ఇవ్వండి బయటికెళ్లి చేద్దాం అంటాడు. దీంతో ఈ కంపెనీయే మీది.. నేను కంపెనీ ఇవ్వకపోతే ఎలా అంటుంది తులసి.

intinti gruhalakshmi 16 september 2022 full episode

intinti gruhalakshmi 16 september 2022 full episode

కట్ చేస్తే లాస్య.. ఇంటికి వెళ్లి నందును కలిసి సంతోషంతో ఉద్యోగం వచ్చింది అని చెబుతుంది. సామ్రాట్ మన ఉద్యోగాలు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అంటుంది లాస్య. దీంతో అలా ఎలా ఒప్పుకున్నాడు అని అడుగుతాడు నందు. దీంతో ఏదో ఒకటి చెప్పి ఒప్పించానులే అంటుంది లాస్య. నాకు తెలియాలి చెప్పు అంటాడు నందు. దీంతో భూమిపూజ రోజు జరిగిన దానికి సారీ అని చెప్పాను అంటుంది లాస్య. మరి మాజీ భర్త విషయం అని అడుగుతాడు. దీంతో అది కావాలని దాచలేదు. అది చెప్పేంత ముఖ్యమైన విషయం కూడా కాదు కదా అని సామ్రాట్ కు చెప్పాను అంటుంది లాస్య. మరి తులసి ఏం అనలేదా అంటే.. తులసి అసలు ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉంది అని చెబుతుంది లాస్య. ఇంతలో నందుకు ఫోన్ వస్తుంది. మీ దివ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అని చెబుతుంది. దీంతో నందు చాలా సంతోషిస్తాడు. మనమే పర్సనల్ గా వెళ్లి దివ్యకు కంగ్రాట్స్ చెబుదాం అని అంటాడు నందు.

మరోవైపు కన్ స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్తారు నందు, లాస్య. అప్పటికే సామ్రాట్ ఇంకా రాడు. దీంతో నందుకు కోపం వస్తూ ఉంటుంది. సామ్రాట్ కోసం కాదు… ఆ తులసి కోసం ఇప్పుడు నేను వెయిట్ చేయాల్సి వస్తోంది అంటాడు నందు.

మరోవైపు కారులో సామ్రాట్, తులసి ఇద్దరూ వస్తారు. వాళ్లను చూసి నందుకు చాలా కోపం వస్తుంది. చాలా గంటల గ్యాప్ తర్వాత కలుసుకున్నారు కదా.. ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది అంటుంది లాస్య.

వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ రావడం చూసి నందుకు కోపం వస్తుంది. సారీ నందు.. అనుకోకుండా కొంచెం లేట్ అయింది అంటాడు సామ్రాట్. ఇట్స్ ఓకే సార్ అంటాడు సామ్రాట్. ఆ తర్వాత తులసి ఇంతకుముందు నువ్వు ఏదో అన్నట్టున్నావు అంటాడు సామ్రాట్.

ప్రతి క్లాస్ రూమ్ కు వెంటిలేషన్ ఉండాలన్నారు కదా. ప్రతి క్లాస్ కు నాలుగు వైపుల నుంచి వెంటిలేషన్ ఉండేలా ప్లాన్ చేయించండి అంటాడు సామ్రాట్. దీంతో దానికి చాలా స్పేస్ వేస్ట్ అవుతుంది. లాభం కూడా ఉండదు అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi 16 Sep Today Episode : తులసితో జీవితం పీడకల అని చెప్పిన నందు

దీంతో నువ్వు కట్టుకున్న చీర ఖరీదు ఎంత.. అని అడుగుతుంది తులసి. దీంతో 20 వేలు.. అంటుంది. మరి ఇంత ఖర్చు పెట్టి కొన్న చీర వల్ల మీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతుంది తులసి. కొన్ని గంటలు కట్టుకునే చీరకోసమే ఇంత ఖర్చుపెడితే మన దగ్గరికి వచ్చే పిల్లల కోసం ఆ మాత్రం నష్టపోతే తప్పేం లేదు అంటుంది తులసి.

ఆ తర్వాత సైట్ చూడటానికి వెళ్తారు తులసి, సామ్రాట్. అక్కడ ఒక గుంత ఉంటుంది. దాన్ని దాటడానికి భయపడుతుంది తులసి. దీంతో రండి నేను దాటిస్తా అని తన చేయి పట్టుకుంటాడు సామ్రాట్.

తన చేయి పట్టుకొని దాటిస్తాడు. ఇవన్నీ నందు చూడలేకపోతాడు. తర్వాత తులసి.. అక్కడ ఉన్న ఇంజనీర్లతో మాట్లాడుతూ ఉంటే సామ్రాట్ అలాగే తనను చూస్తూ ఉండిపోతాడు. దీంతో నందుకు తెగ కోపం వస్తూ ఉంటుంది.

ఇంతలో తులసితో గడిపిన రోజుల గురించి నందును సామ్రాట్ అడుగుతాడు. దీంతో ఆ పీడకలను గుర్తు చేయకండి అంటాడు నందు. ఒక్క రోజు మీ ఫ్యామిలీతో గడిపితేనే నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటాడు.

కట్ చేస్తే సామ్రాట్ కారుకు బ్రేకులు తీసేస్తాడు నందు. దీంతో సామ్రాట్, తులసి వెళ్తున్న కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది