Intinti Gruhalakshmi 18 Oct Tomorrow Episode : ప్రేమ్, శృతి పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని తులసికి మాటిచ్చిన జీకే.. ప్రేమ్, శృతి పెళ్లి ఆపడం కోసం నందు, లాస్య మరో ప్లాన్?
Intinti Gruhalakshmi 18 Oct Tomorrow Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి 18వ తారీఖున ప్రసారం అవుతుంది. 18 అక్టోబర్ 2021, సోమవారం రోజున ప్రసారం అవుతుంది. ఆరోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్.. అక్షర కోసం రాసిన లెటర్ ను చదువుతాడు జీకే. దీంతో షాక్ అవుతాడు. ఏంటిది.. అని అడుగుతాడు. అక్షర కూడా ఆ లెటర్ ను చదువుతుంది. ప్రేమ్ ఇక్కడికి రా అని పిలిచి.. ఆ లెటర్ ను చూపిస్తాడు. శృతిని ప్రేమించినప్పుడు అక్షరను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని నిలదీస్తాడు ప్రేమ్ ను.

intinti gruhalakshmi 18 october 2021 episode highlights
ఇంతలో తులసి వస్తుంది. ప్రేమ్ శృతిని ప్రేమిస్తున్నాడని నిజం చెబుతుంది. దీంతో జీకే షాక్ అవుతాడు. ఇన్ని విషయాలు దాచిపెట్టి ఎందుకు ప్రేమ్, అక్షర పెళ్లి చేస్తున్నారు అంటే.. ఇదంతా నందు ప్లాన్ అని చెబుతుంది తులసి. శృతి, ప్రేమ్ చాలా గాడంగా ప్రేమించుకుంటున్నారని తులసి చెప్పేసరికి జీకేకు ఏం చేయాలో అర్థం కాదు.
వాళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు సరే.. నా కూతురు అక్షర పరిస్థితి ఏంటి అని అడుగుతాడు జీకే.కొన్ని రోజులు ఆగితే అక్షర సెట్ అవుతుంది. తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. కానీ శృతి ఒక అనాథ. తనకు మీరు దగ్గరుండి పెళ్లి జరిపించండి అని తులసి.. జీకేను కోరుతుంది. దీంతో సరే.. వెళ్లి శృతిని తీసుకురా అని చెబుతాడు జీకే.
Intinti Gruhalakshmi 18 Oct Tomorrow Episode : ప్రేమ్, శృతి పెళ్లికి ఒప్పుకున్న జీకే
అనాథ అయిన ఒక ఆడపిల్లకు అండగా ఉండాలనుకున్నాను. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఆమాత్రం చేయలేనా? ఆలస్యం చేయకు తులసి. ముహూర్త సమయానికి శృతిని తీసుకురా వెళ్లు అని చెబుతాడు జీకే. సొసైటీలో పిల్లల కోసం తప్పుడు దారిలో నడిచే పేరెంట్స్ ను చూశాను. కానీ.. ఉన్నదారిలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవడం కోసం నీ కొడుకు జీవితాన్ని పణంగా పెట్టాలని అనుకున్నావు.. అని జీకే నందుకు వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో లాస్య కల్పించుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమ్ తో శృతి పెళ్లి జరగదు అంటుంది.

intinti gruhalakshmi 18 october 2021 episode highlights
ఇంతలో తులసి.. శృతిని తీసుకొని కళ్యాణ మండపానికి వస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.