Intinti Gruhalakshmi 19 Oct Today Episode : పెళ్లయిన మొదటి రోజే శృతికి కష్టాలు ప్రారంభం.. శృతిపై విరుచుకుపడిన అంకిత
Intinti Gruhalakshmi 19 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 19 అక్టోబర్, 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంగరంగవైభవంగా ప్రేమ్, శృతి పెళ్లి జరుగుతుంది. ఓవైపు ఏడుస్తూనే అక్షర.. వాళ్ల పెళ్లి వేడుకలో పాల్గొంటుంది. తులసి చాలా సంతోషిస్తుంది. మరోవైపు నందు, లాస్య తీవ్రంగా కోపంతో ఉంటారు. పెళ్లి కాగానే అందరి ఆశీర్వాదం తీసుకుంటారు ప్రేమ్, శృతి. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు.. నీ విషయంలోనే అక్షర. నాలో అమ్మతనం ఈ తప్పు చేయించిందో.. నా కొడుకు ప్రేమను గెలిపించాలనే ఆరాటం ఆ తప్పు చేయించిందో నాకు అర్థం కావడం లేదు అని అక్షరను క్షమించమని కోరుతుంది తులసి. అదేం లేదు ఆంటి.. వద్దు ఆంటి అలా అనకు అంటుంది అక్షర.

intinti gruhalakshmi 19 october 2021 full episode
పెళ్లి అయిపోయాక అందరూ ఇంటికి వస్తారు. కొత్త కోడలు ఇంట్లోకి అడుగు పెడుతోంది. మీరు ఆశీర్వదించండి అని చెబుతుంది తులసి. శృతి ఈ ఇంటి కోడలిగా మొదటిసారి ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతోంది అని చెబుతుంది తులసి. తనకు ఈ ఇల్లు ఏమన్నా కొత్తా.. తనకు ఆశ్రయం ఇచ్చిన ఇంటినే అత్తారిల్లుగా మార్చుకుంది కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. అంకిత కూడా వెళ్లబోతుంది. అమ్మా.. అంకిత.. పెద్ద కోడలుగా నువ్వే తోటి కోడలుకు హారతి ఇవ్వాలమ్మా అని అన్నా కూడా అంకిత పట్టించుకోదు. దీంతో తులసి బాధపడుతుంది.
Intinti Gruhalakshmi 19 Oct Today Episode : శృతిని గడప ముందే తిట్టిన అంకిత
గతి లేక ఈ ఇంటికి అనాథగా వస్తే.. ఈ ఇంటికే కోడలుగా చేస్తారా? అది కూడా వేరే మగాడిని పెళ్లి చేసుకున్న ఆడది అంటూ మాట్లాడుతుంది అంకిత. వదిన.. మాటలు జాగ్రత్త అంటాడు. దీంతో ప్రేమ్ నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడినా నా మీద ఒట్టే.. అంటుంది శృతి. నందు తల్లి కూడా సీరియస్ అవుతుంది. వీళ్లకు దిష్టి వద్దు ఏది వద్దు. వీళ్ల కడుపు మంటతోనే నీ దిష్టిపోయింది శృతి అని చెబుతాడు నందు నాన్న.

intinti gruhalakshmi 19 october 2021 full episode
చివరకు రాములమ్మ హారతి పడుతుంది. నువ్వే వీళ్లకు హారతి ఇవ్వమ్మా తులసి అని అంటాడు నందు నాన్న పరమానందయ్య. దీంతో తులసే వాళ్లకు హారతి ఇస్తుంది. దీంతో కుడికాలు పెట్టి శృతి ఇంట్లోకి వస్తుంది. అంకిత, అభి.. ఇద్దరూ శృతి కోసం గొడవ పెట్టుకుంటారు. శృతి.. నీ తోటికోడలు అని చెబుతాడు అభి. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఒక ఆడదాని కష్టాలు తోటి ఆడది అర్థం చేసుకుంటుంది అంటారు. కానీ.. నువ్వు శృతిని బాగా అపార్థం చేసుకున్నావు.
తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయింది.. అని చెబుతాడు ప్రేమ్.తన అన్న అభితో ఉన్న అనుబంధం గురించి ప్రేమ్.. తన వదిన అంకితకు చెబుతాడు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మాత్రం విడదీయకండి.. అని చెబుతాడు ప్రేమ్. ఇంతలో తులసి అక్కడికి వచ్చి ప్రేమ్ ను ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.