Intinti Gruhalakshmi 2 Dec Today Episode : కలిసిపోయిన తులసి, లాస్య.. ఇద్దరికీ సమస్య నందునే.. మరోవైపు తులసికి క్యాన్సర్ అని తెలియడంతో అందరూ షాక్
Intinti Gruhalakshmi 2 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 డిసెంబర్ 2021, గురువారం ఎపిసోడ్ 492 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు.. పెళ్లి గురించి ఏమన్నాడు.. అని లాస్యను తులసి అడుగుతుంది. కానీ లాస్యకు చిరాకు వేస్తుంది. నీ మాజీ భర్త కావచ్చు కానీ.. నాకు నందు గురించి మాట్లాడాలంటేనే చిరాకు వేస్తోంది తులసి అంటుంది లాస్య. ఆడవాళ్లం.. జీవితం గురించి ఇంత క్లారిటీతో మనం ఉన్నప్పుడు తనెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఒక్కోసారి నటిస్తున్నాడా లేక నిజంగానే కన్ఫ్యూజ్ అవుతున్నాడా అనిపిస్తుంది అంటుంది లాస్య. ఆయనకు నటించడం తెలియదు లాస్య.
ఆయన మనసులో ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతారు అంటుంది తులసి. నువ్వేమైనా నందును అడ్డుకుంటున్నావా? అంటుంది లాస్య. నాకేం అవసరం. నాకు సంబంధమే లేదు.. అంటుంది తులసి. నందు ప్రవర్తన వల్ల నాకు పిచ్చెక్కుతోంది అంటుంది లాస్య. నీకే కాదు.. నాకు కూడా అలాగే ఉంది. ఈ సమస్య ఎంత త్వరగా తెగితే అంత మంచిది అనిపిస్తుంది. నందు అంత త్వరగా తెగ్గొట్టడు అంటుంది లాస్య. మనం ఇలా మనసు విప్పి మాట్లాడుకోవడం మొదటిసారి కదా తులసి అంటుంది లాస్య. మనిద్దరి మధ్య ఈ గొడవలే లేకపోతే మనం మంచి ఫ్రెండ్స్ అయ్యేవాళ్లమేమో కదా అంటుంది లాస్య. నువ్వేమో కానీ.. మొదటి నుంచి నేను నిన్ను ఒక స్నేహితురాలిగానే చూశాను. నాకు కూడా నువ్వు మంచి ఫ్రెండ్ అవుతావనుకున్నా కానీ..
ఆయన, నువ్వు కలిసి నానమ్మకాన్ని కూల్చేశారు.. అంటుంది తులసి. కానీ.. నేను ఇరుక్కుపోయాను అంటుంది తులసి. లేదు తులసి.. ఇరుక్కుంది నందు కాదు.. నువ్వు నేను మాత్రమే అంటుంది లాస్య.నందును వెంటనే డిసిషన్ తీసుకొమ్మని అంటాను. నీతో ఉంటాడో నాతో ఉంటాడో తేల్చుకోమంటాను అంటుంది లాస్య. దీంతో నాతో కలిసి ఉండటం జరగని పని లాస్య. నా గురించి మరిచిపో అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 2 Dec Today Episode : తులసికి అన్ని టెస్టులు చేసిన డాక్టర్ సునీత
నందు అనే వ్యక్తి లాస్యతో మాత్రమే జీవితం పంచుకుంటాడు.. పంచుకోవాలి. అలా జరిగేలా చూసే బాధ్యత కూడా నాదే అని చెప్పి లాస్యకు భరోసా ఇస్తుంది తులసి.మరోవైపు డాక్టర్ సునీత వచ్చి తులసికి అన్ని టెస్టులు చేస్తుంది. తర్వాత అభి దగ్గరికి వచ్చి బయోప్సీ టెస్ట్ చేశాం అని చెబుతుంది సునీత. ఇంతలో అద్వైత కృష్ణ వస్తాడు. ఆశలు వేరు వాస్తవం వేరు అంటాడు. ఒక మనిషిగా పేషెంట్ క్షేమంగా ఉండాలని అనుకోవాలి. మనకు చేతనైనంత చేయాలి. ఆ తర్వాత వాస్తవం ఏదైనా గ్రహించాల్సి ఉంటుంది అంటాడు.
మరోవైపు తులసి టెస్టులు ముగిశాక.. తులసితో కలసి అందరూ మాట్లాడుతారు. ఇంతలో అక్కడికి మరోసారి అద్వైత కృష్ణ వస్తాడు. మొత్తానికి మీకు ఇన్ని రోజులకు అర్థం అయిందా అంటాడు. మీరందరూ తులసి ఆరోగ్యం బాగు చేయాలనుకుంటున్నారా? ఇంకా కష్టపెట్టాలనుకుంటున్నారా? అని అడుగుతాడు.
అదేంటి బాబు అలా అంటావు. ఆమె మా గృహలక్ష్మి. ఆమెను కష్టపెట్టాలని ఎందుకు అనుకుంటాం అంటాడు. కానీ.. మీరు చేస్తున్నది అదే. ఆమెను ప్రేమగా చూసుకుంటూ.. పాత గాయాలను తవ్వతూ తనను ఇంకా బాధపెడుతున్నారు అంటాడు. కాలంతో పాటు కొట్టుకుపోయిన పాత మెమోరీస్ ను ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటాడు.మరోవైపు.. తులసి రిపోర్టులు వస్తాయి. ఆ రిపోర్టులను చూస్తాడు అద్వైత కృష్ణ. అప్పుడే నందు వస్తాడు.
ఏమైంది అని అడుగుతాడు. రిపోర్టుల్లో ఏముంది అని అడుగుతాడు. తులసి రిపోర్ట్స్ వచ్చాయి. అనుకున్నదాని కంటే ఎక్కువ సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. గర్భాశయంలో క్యాన్సర్ అంటాడు అద్వైత కృష్ణ. దీంతో నందు వెక్కివెక్కి ఏడుస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుంతో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.