Intinti Gruhalakshmi 2 Nov Today Episode : నా ఇంట్లో నుంచి వెళ్లు.. అంటూ నందుకు జీకే వార్నింగ్.. వెళ్లి తులసి కాళ్లు పట్టుకో అని జీకే సలహా
Intinti Gruhalakshmi 2 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 నవంబర్ 2021, మంగళవారం 466 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఒక మోసగాడివి. నీలాంటి మోసగాడితో నాకు మాటలు అనవసరం. కేవలం తులసి వల్ల నేను ఇప్పుడు బాగున్నాను. ముందు వెళ్లి తులసి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగు.. అప్పుడు ఆలోచిస్తాను.. అంటే నందు షాక్ అవుతాడు. నువ్వు ఆ పని చేయలేవు కదా. ముందు ఇంట్లో నుంచి వెళ్లు.. ఇంతకన్నా నన్ను దిగజారి మాట్లాడేలా చూడకు.. అని చెప్పి నందును ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు.

intinti gruhalakshmi 2 november 2021 full episode
కట్ చేస్తే.. తులసి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో లాస్య వచ్చి.. ఈ ఇంట్లోని వాళ్లంతా త్వరలో ఎవరికి తోచిన దారి చూసుకోబోతున్నారు. ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. పాపం తులసి. నువ్వు ఒక్కదానివే ఒంటరి దానివి అవ్వబోతున్నావు అంటుంది. దీంతో నన్ను ఎంత పెద్ద ఊబి అయినా ఏం చేయలేదు. స్వార్థం తప్ప బంధాల గురించి తెలియని దానివి నీకు ఇవన్నీ తెలియవులే.. అంటుంది.
ఏ ప్రయాణం ఆగదు లాస్య కానీ.. వెళ్లే దారి మాత్రం మారుతుంది అంటుంది తులసి. నీకో విషయం తెలుసా? త్వరలో నందు 2 కోట్ల ఫెనాల్టీ కట్టబోతున్నాడు. తనేంటో నిరూపించుకోబోతున్నాడు. ఇక నిన్ను బయటికి నెట్టడమే అంటుంది. అయితే అందులో చిన్న మార్పు లాస్య.. బయటికి నెట్టేది నన్ను కాదు నిన్ను.. అని చాలెంజ్ చేస్తుంది తులసి.
మరోవైపు అంకిత అన్న మాటలనే గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతుంటుంది శృతి. తులసిని కూడా అందరూ బాధపెడుతున్నారని అనుకుంటుంది. రాములమ్మ.. శృతి పరిస్థితి చూసి బాధపడుతుంది. ఏమ్మా.. మనసు బాగోలేదా అంటుంది. ఎందుకలా అడుగుతున్నావు అంటుంది. నీ నోటి నుంచి మాటలు రాకపోతే అలా అనిపించింది అంటుంది. నేను తనకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా.. తను నన్ను ధ్వేషించుకుంటోంది.. అంటుంది శృతి.
ఇంతలో అంకిత వచ్చి ఛీ.. ఛీ.. దరిద్రం.. దరిద్రం.. అప్పటికీ నేను నెత్తీ నోరు మొత్తుకున్నాను. వింటే కదా.. దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్లు అసలు ఎందుకు పుడతారో కూడా తెలియదు.. అని అంకిత అనగానే.. రాములమ్మకు కోపం వస్తుంది. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు. తొందరపడి ఏదో ఒక మాట అనకండి అంటుంది. దీంతో పనిమనిషివి పనిమనిషిలా ఉండు. ఎక్కువ మాట్లాడితే నీ పని కూడా పోతుంది అని రాములమ్మను బెదిరిస్తుంది అంకిత.
Intinti Gruhalakshmi 2 Nov Today Episode : దివ్యపై సీరియస్ అయిన నందు
జీకే దగ్గర్నుంచి ఇంటికి వచ్చిన నందు.. చాలా డిస్టర్బ్ గా ఉంటాడు. ఇంతలో దివ్య అక్కడికి వస్తుంది. డాడీ అంటుంది. ఒకే ఇంట్లో ఉంటున్నా మిమ్మల్ని కలవాలంటే ఎంత కష్టం అవుతుందో తెలుసా? మీతో మాట్లాడాలని 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అంటే.. దివ్యపై సీరియస్ అవుతాడు. ఇంతలో పరందామయ్య వచ్చి నందును తిడతాడు. దీంతో దివ్యకు సారీ చెబుతాడు నందు. ఇంతకు ముందు మీరే నాదగ్గరికి వచ్చి నా గురించి ప్రతి చిన్న విషయం అడిగే వారు. కానీ.. ఇప్పుడు మాత్రం మీరు అసలు నా దగ్గరికే రావడం లేదు. నేను వచ్చినా కూడా మీరు మాట్లాడటం లేదు.. అంటూ తన బాధనంతా చెప్పుకుంటుంది దివ్య.

intinti gruhalakshmi 2 november 2021 full episode
ఇంతలో లాస్య దగ్గరికి వస్తాడు నందు. జీకే ఇంటికి వెళ్లావు అక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది లాస్య. అవమానించాడు. నేను మోసగాడినట. నమ్మి పెట్టుబడి పెడితే నమ్మి మోసం చేయవని ఏంటి అని అడిగాడు. వర్క్ విషయంలో నా టాలెంట్ గుర్తించి ఆర్థిక సాయం చేస్తాడనుకున్నా. కానీ.. వర్కవుట్ కాలేదు. నేను ఎట్టిపరిస్థితుల్లో కూడా తులసికి సరెండర్ కాను. ఏదో ఒకటి చేస్తాను.. గెలిచి చూపిస్తాను అంటాడు. అవసరమైతే జైలుకు అయినా వెళ్లి కూర్చుంటాను అంటాడు నందు.
మరోవైపు జీకే.. తులసికి కాల్ చేస్తాడు. అమ్మ తులసి బాగున్నావా? అని అడుగుతాడు. అక్షర ఎలా ఉంది అంటుంది తులసి. నీకో విషయం చెబుదామని కాల్ చేశాను. ఉదయం నందు నా దగ్గరకి వచ్చాడు. తన కంపెనీకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయమని అడిగాడు.. అని అసలు విషయం చెబుతాడు జీకే. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.