Intinti Gruhalakshmi 20 July Today Episode : తులసి గురించి అసలు నిజం తెలుసుకున్న సామ్రాట్.. ప్రేమ్ ను వదిలేసిన శృతి.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 20 July Today Episode : తులసి గురించి అసలు నిజం తెలుసుకున్న సామ్రాట్.. ప్రేమ్ ను వదిలేసిన శృతి.. ఇంతలో మరో ట్విస్ట్

 Authored By gatla | The Telugu News | Updated on :20 July 2022,9:30 am

Intinti Gruhalakshmi 20 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జులై 2022, బుధవారం ఎపిసోడ్ 689 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ.. లిఫ్ట్ లో ఇరుక్కొన విషయం తెలిసి సామ్రాట్ షాక్ అవుతాడు. పైకి వెళ్లి లిఫ్ట్ దగ్గర తులసిని చూసి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని ప్రశ్నిస్తాడు. హనీ లోపల ఇరుక్కుంటే ఏం చేస్తున్నారు అంటూ స్కూట్ యాజమాన్యాన్ని తిడుతాడు సామ్రాట్. తర్వాత తులసిపై విరుచుకుపడతాడు. అసలు నువ్వు నా బిడ్డను వదలవా? నీకు దండం పెడతాను. నీకు ఎంత డబ్బు కావాలి చెప్పు. నా కూతురును వదిలేయ్ అంటాడు సామ్రాట్. తనపై కోప్పడుతున్న సమయంలో సామ్రాట్ బాబాయి వస్తాడు. వద్దు నువ్వు ముందు ఇటురా అని చెప్పి తనను లోపలికి తీసుకెళ్తాడు. తులసి గురించి అసలు నిజం చెబుతాడు.

intinti gruhalakshmi 20 july 2022 full episode

intinti gruhalakshmi 20 july 2022 full episode

తులసి వల్లనే ఇప్పుడు పాప బతికి ఉందని చెబుతాడు. దీంతో సామ్రాట్ షాక్ అవుతాడు. ఇంతలో ఎలక్ట్రిషియన్, డాక్టర్ వస్తారు. ఎలక్ట్రిషియన్ వెళ్లి లిఫ్ట్ రిపేర్ చేస్తుంటాడు. ఇంతలో హనీ భయపడకుండా తులసి పాట పాడుతుంది. దీంతో హనీ లిఫ్ట్ లో భయపడకుండా ఉంటుంది. ఇంతలో లైట్ వెలుగుతుంది. లిఫ్ట్ బాగవుతుంది. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే హనీని బయటికి వస్తుంది. బయటికి రాగానే హనీ తులసిని హత్తుకుంటుంది. ఆ తర్వాత డాడీ అంటూ సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది హనీ. తులసి గురించి అసలు నిజం తెలుసుకున్నాక పశ్చాతాపపడుతాడు సామ్రాట్. అది అంటూ తులసితో మాట్లాడబోతాడు సామ్రాట్. కానీ.. మీకో పెద్ద నమస్కారం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

కట్ చేస్తే ప్రేమ్ ఫుల్లుగా తాగి వస్తాడు. ప్రేమ్ తాగి రావడం చూసి శృతి షాక్ అవుతుంది. ప్రేమ్ ఏంటి ఇలా మనసును బాధపెడుతున్నావు ప్రేమ్ అంటుంది శృతి. మన పెళ్లి అయిన క్షణం నుంచి నీ వెనుకే నడిచాడు. నీతోనే కష్టాలు పంచుకున్నాను అంటుంది శృతి.

Intinti Gruhalakshmi 20 July Today Episode : అభి ఫ్రెండ్ పై చిరాకు పడ్డ అంకిత

వాడు అన్ని మాటలు అంటున్నా నువ్వు వాడిని ఒక్కమాట కూడా అనలేదు. పెళ్లాం సంపాదన మీద బతుకుతున్నాను కదా. అంతేలే నాకు కావాల్సిందే ఇది.. అంటూ ప్రేమ్ శృతిపై చిరాకు పడతాడు. ఇష్టం ఉన్నట్టు శృతిపై వాగి ఆ తర్వాత శృతి ఒడిలో నిద్రపోతాడు.

కట్ చేస్తే తెల్లవారుతుంది. అంకితకు.. అభి ఫ్రెండ్ నరేశ్ ఫోన్ చేస్తాడు. నేను నరేశ్ ను అంటాడు. అభి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి వాడికి ఫోన్ ఇస్తావా అంటాడు. దీంతో నేను ఇంట్లో లేను అంటుంది అంకిత. దీంతో అలా అని అభి చెప్పమన్నాడా అంటాడు నరేశ్.

దీంతో కోపం వచ్చి ఫోన్ కట్ చేస్తుంది అంకిత. నా పెళ్లాం నాతో ఉండటం లేదని తన ఫ్రెండ్స్ కు చెప్పుకోవచ్చు కదా. చీ.. చీ.. ఏంటో ఈ జీవితం.. అంటూ చిరాకుతో ఇంట్లోకి వెళ్లిపోతుంది అంకిత. అసలు వీళ్ల గొడవ ఏంటో అని అనసూయ.. తులసితో అంటుంది.

వీళ్ల సమస్యకు పరిష్కారం లేదా అని అడుగుతుంది అనసూయ. పెళ్లాం పక్కన లేకుండా ఒక్కడు అత్తారింట్లో ఉండటం ఏంటి అని అంటాడు పరందామయ్య. వాళ్లను నేనే కలుపుతాను అంటుంది తులసి. కృష్ణాష్టమి వస్తుంది కదా. అభిని పిలుస్తాను. నాలుగు రోజులు ఇక్కడ ఉండమంటాను అంటుంది తులసి.

ప్రేమ్, శృతిని కూడా పిలుద్దాం. అందరం నాలుగు రోజులు కలిసి ఉండొచ్చు సరదాగా అంటుంది తులసి. కట్ చేస్తే తెల్లవారుతుంది. ప్రేమ్ నిద్ర లేస్తాడు. లేచి చూసేసరికి శృతి ఉండదు. ఒక లెటర్ రాసి బయటికి వెళ్లిపోతుంది. ఇక మనం కలిసి ఉండలేం ప్రేమ్ అంటూ లెటర్ రాస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది