Intinti Gruhalakshmi 22 Dec Today Episode : లాస్యతో మళ్లీ గొడవ.. స్పృహ తప్పి పడిపోయిన శృతి.. రెస్టారెంట్ లో పరువు పోగొట్టుకున్న నందు.. ఇంతలో తులసికి మరో షాక్
Intinti Gruhalakshmi 22 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 822 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు మీరు ఈరోజు పార్టీ ఇస్తున్నారా లేదా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో మీ దృష్టిలో పార్టీ అంటే ఏంటి అని అడుగుతుంది తులసి. దీంతో ఏముంది.. పార్టీ అంటే మనకు వచ్చిన ఆనందాన్ని మనకు నచ్చిన వాళ్లతో పంచుకోవడం అంటాడు. అదే కదా.. అంటుంది తులసి. సరే.. పదండి వెళ్దాం అంటే నాకు ఇప్పుడు ఆకలిగా లేదు.. ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా రెస్టారెంట్ కు వెళ్దాం అంటాడు సామ్రాట్. ఇంతలో నేను ఒక పని చేస్తా అంటూ ఒక 500 రూపాయల నోటును ఒక పర్సులో పెట్టి కింద పడేస్తుంది. ఇది ఎవరికి దక్కుతుంది అని అడుగుతుంది. దీంతో ముందు ఆ పర్సును ఎవరు చూస్తే వాళ్లకే అంటాడు. దీంతో అంత సీను లేదు. ఎవరికి రాసి పెట్టి ఉంటే వాళ్లకే ఆ డబ్బు దక్కుతుంది అంటుంది తులసి.
ఇద్దరూ కలిసి పక్కన వెళ్లి నిలబడుతారు. ఓ ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఆ పర్సును చూస్తారు. కానీ.. తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు. పైన సీసీకెమెరా ఉంది. మనకెందుకురా లేనిపోని గొడవ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో ఇద్దరు గుడ్డివాళ్లు వస్తుంటారు. వీళ్లకు ఈ పర్సు దొరుకుతుందా? అని అంటాడు సామ్రాట్. దేవుడా పర్సు వీళ్లకు దక్కేలా చూడు అని మనసులో అనుకుంటుంది తులసి. ఇంతలో వాళ్లు కర్రతో కొడుతూ వెళ్తూ దాన్ని చూసి ఆగుతారు. తన భార్యతో చెబుతాడు. నాకు ఏదో మెత్తగా తగులుతోంది అంటాడు. దీంతో కిందికి వంగి దాన్ని తీసి చూస్తాడు. ఇదేదో పర్సులా ఉంది అంటాడు. దీంతో మనకెందుకు ఆ పర్సులో ఏముందో ఏమో.. ఎవరో పోగొట్టుకున్నట్టున్నారు. ఎవరిదో అడుగుదాం అని.. అక్కడ పిలిస్తే ఎవ్వరూ రారు.
చివరకు తులసి అక్కడికి వెళ్లి పర్సు దొరికింది కదా.. మీరు ఉంచేసుకోవచ్చు కదా అంటే పరుల సొమ్ము పాపం అని అంటాడు. దీంతో ఆ పర్సు నాదే అంటుంది తులసి. అయితే మీరే తీసుకోండి అంటాడు. దీంతో అందులో నుంచి డబ్బులు తీసి ఆ 500 నోటును వాళ్లకే ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు కారులో వెళ్తూ.. పరందామయ్య, అనసూయ అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటాడు నందు. ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఎలాంటి వాడిని ఎలా అయిపోయాను. సంపాదన లేకపోవడం నా పెద్దరికాన్ని తగ్గించేసింది. అమ్మానాన్న నన్ను చూసి జాలి పడుతున్నారు అని అనుకుంటాడు నందు.
మళ్లీ వెళ్లి సామ్రాట్ చేతులు పట్టుకుందామా అంటే ఈగో అడ్డొస్తుంది. నా విలువ నేనే తగ్గించుకున్నట్టు అవుతుంది అని అనుకుంటాడు. మరోవైపు ఆ దేవుడు చూశారా.. కళ్లు లేని వాళ్లకు మంచి గుణం ఇచ్చాడు. కళ్లు ఉన్నవాళ్లకు మాత్రం మంచి గుణం ఇవ్వలేకపోయాడు అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 22 Dec Today Episode : రెస్టారెంట్ లో తులసి, సామ్రాట్ ను చూసిన నందు
అయినా.. వాళ్లు కళ్లు లేకున్నా అసలు రోడ్డు మీద ఎలా నడుస్తున్నారు అంటాడు. దీంతో మీకు ఒక చిన్న పరీక్ష అని అంటుంది తులసి. కళ్లకు గంతలు కడతాను. మీరు ఎలా రోడ్డు దాటుతారో నేను చూస్తా అంటుంది తులసి. సామ్రాట్ కళ్లకు గంతలు కడుతుంది.
మీరు రెండు నిమిషాల్లో రోడ్డు దాటాలి అంటుంది తులసి. దీంతో అలాగే అంటాడు సామ్రాట్. తులసి గారు పర్లేదు కదా.. రోడ్డు దాటొచ్చు కదా అంటాడు. తులసి గారు అన్నా కూడా తులసి ఏం మాట్లాడదు. దీంతో సామ్రాట్ కు ఏం చేయాలో అర్థం కాదు. ముందుకు వెళ్దామనుకున్నా కూడా వెళ్లలేకపోతాడు.
వాహనాలు అడ్డొస్తుంటాయి. ఇరుక్కుపోయి నోరు జారాను. ఇది నా వల్ల అయ్యే పనేనా అని అనుకుంటాడు. లాస్ట్ టైమ్ ట్రై చేస్తా అని ముందుకు వెళ్లబోతాడు కానీ.. అతడి వల్ల కాదు. నా వల్ల కాదండి.. నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. గంతలు విప్పేస్తాను అని విప్పేస్తాడు సామ్రాట్.
మా మధ్య తరగతి వాళ్ల లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది. కనపడని కష్టాలను దాటడానికి కళ్లకు గంతలు కట్టుకొని బరిలోకి దిగుతాం. మీలాగే నాలుగు అడుగులు ముందుకు వేస్తుంటాం. రెండు వెనక్కి వేస్తాం.. అంటూ చెప్పుకొస్తుంది తులసి. దీంతో సామ్రాట్ కు తెలిసి వస్తుంది.
కట్ చేస్తే నందు ఓ రెస్టారెంట్ కు వెళ్తాడు. నన్ను నమ్మి నా వాళ్లు అందరూ నా దగ్గరే ఉన్నారు. కానీ.. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అనుకుంటాడు. మరోవైపు తులసి, సామ్రాట్ ఇద్దరూ అదే రెస్టారెంట్ కు వెళ్తారు. కాఫీ తాగుదామని మిమ్మల్ని ఈ రెస్టారెంట్ కు తీసుకొచ్చా అంటుంది తులసి.
అవును.. కాఫీయేగా అన్నారు. మళ్లీ ఏదో పార్సిల్ చెప్పారేంటి అని అడుగుతాడు సామ్రాట్. దీంతో అది తర్వాత చెప్తా అంటుంది తులసి. ఇందాక ఏమన్నారు నేను ఆకలికి తట్టుకోలేనని కాఫీ తాగించడానికి తీసుకొచ్చా అంటున్నారు. మీరు ఆకలి తట్టుకుంటారా? అని అడుగుతాడు.
దీంతో నేనే కాదు.. మా ఆడవాళ్లు అందరికీ ఆకలి తట్టుకునే గుణం ఇచ్చాడు దేవుడు. ఆ ఓపిక, సహనం.. కేవలం మా ఆడవాళ్ల సొంతం. పెళ్లి కాలేదు కాబట్టి మీరు ఇలా ఆశ్చర్యపోతున్నారు. కానీ.. పెళ్లి అయి ఉంటే మీకు తెలిసేది అని అంటుంది తులసి.
దీంతో ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. మధ్యలో ఈ పెళ్లి గోల ఏంటండి బాబు.. ప్రశాంతంగా ఉన్నాను అంటే అదేనండినా ఈర్ష్య అంటూ పగలబడి నవ్వుతూ ఉంటుంది తులసి. దీంతో తన నవ్వును చూసి ఎవరు అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు నందు.
ఇంతలో తనకు సామ్రాట్, తులసి కనిపిస్తారు. దీంతో ఏం చేయాలో నందుకు అర్థం కాదు. ఎవరి నుంచి దాక్కోవాలని అనుకున్నానో వాళ్లే నా కంట పడ్డారు. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకొని ఫ్రైడ్ రైస్ తినకముందే బిల్లు చెల్లించి వెళ్లేందుకు కౌంటర్ దగ్గరికి వస్తాడు నందు.
కానీ.. తన జేబులో పర్సు కనిపించదు. దీంతో బిల్ ఎలా పే చేయాలో అర్థం కాదు నందుకు. ఇందాక కూర్చొన్న ప్లేస్ లో పర్సు మరిచిపోయానా అని అనుకుంటాడు నందు. కానీ.. అక్కడికి వెళ్లి చూసినా పర్సు కనిపించదు. పర్సు ఇంట్లోనే మరిచిపోయినట్టున్నాను. ఇప్పుడు ఎలా అని అనుకుంటాడు నందు.
మరోవైపు పరందామయ్యకు కడుపులో మంట రావడంతో ఏం చేయాలో ఇంట్లో వాళ్లకు అర్థం కాదు. అంకిత వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ తీయబోగా దానికి తాళం ఉంటుంది. మళ్లీ అందరూ లాస్యతో గొడవ పెట్టుకుంటారు. ఇంతలో శృతి స్పృహతప్పి పడిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.