Intinti Gruhalakshmi 23 April Today Episode : అభి, అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో దివ్య షాకింగ్ నిర్ణయం.. తులసికి దివ్య కూడా షాకిస్తుందా?

Authored By Varun G | The Telugu News | Published on: April 23, 2022, 9:30 am

Intinti Gruhalakshmi 23 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 ఏప్రిల్ 2022, శనివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత బాధ్యత తెలిసిన మనిషి. కష్టాలకు ఎప్పుడూ వెన్ను చూపించలేదు. ఇప్పటికీ తనకు ఇంటి నుంచి వెళ్లడం ఇష్టం లేదు కానీ.. నేనే బలవంతంగా ఒప్పించాను అంటుంది తులసి. అంతకుముందు రాత్రే.. తులసి.. అంకితతో మాట్లాడుతుంది. నేను అస్సలు వెళ్లను. ఈ ఇంటిని వదిలేది లేదు అంటుంది అంకిత. కానీ.. నేను ఏం చెప్పినా మీ మంచి కోసమే అంటుంది తులసి. కానీ.. అంకిత మాత్రం అస్సలు వినదు. ఒక్కసారి మా అమ్మను నమ్మినందుకే నాకు తగిన శిక్ష పడింది. జీవితాంతం ఆ తప్పును మోస్తూ బతుకుతున్నాను. అమ్మ అని పిలిపించుకునే అర్హత లేదు తనకు అంటుంది అంకిత.

intinti gruhalakshmi 23 april 2022 full episode

intinti gruhalakshmi 23 april 2022 full episode

నిజమే ఒప్పుకుంటాను.. మీ అమ్మ నీకు అన్యాయం చేసింది. కానీ.. ఇప్పుడు మనసు మార్చుకుంది అంటుంది తులసి. నీ భవిష్యత్తు కోసమే తను ఈ నిర్ణయం తీసుకుంది అని చెబుతుంది తులసి. మీ అమ్మ మాట వింటే.. మీ భవిష్యత్తు బాగుంటుందని అభి అనుకుంటున్నాడు అంటుంది తులసి. అభి ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతాడు అంటుంది అంకిత. కానీ.. వాడి మనసులో ఏది వస్తే అదే చేస్తాడు. నీకంటే నాకే వాడి గురించి ఎక్కువ తెలుసు అంటుంది తులసి. ఈ అమ్మ మీద ఉన్న ప్రేమ.. వాడిని సంకెళ్లు వేస్తోంది. అలాంటప్పుడు తల్లిగా నేను ఏం చేయాలి. బలవంతంగా వాడిని ఇంటికే బందీ చేయడం ఎంత వరకు న్యాయం అంటుంది తులసి. ఈ బంధాలు ప్రతి దానికి అడ్డం పడుతుంటాయి అంటుంది తులసి.

చివరకు అంకితను ఎలాగోలా ఇంట్లో నుంచి వెళ్లేందుకు ఒప్పిస్తుంది తులసి. ఆ విషయాన్ని తులసి.. అందరికీ చెబుతుంది. దీంతో నాతో మాట్లాడుకుండా అంకితను ఒప్పించడం ఏంటి మామ్ అంటాడు అభి. ఒప్పించాల్సింది నిన్ను కాదు అంకితను అని చెప్పి తనను ఒప్పించాను అంటుంది తులసి.

నీ జీవితంలో సెటిల్ అవ్వడానికి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. అందుకే నేను చొరవ తీసుకున్నాను అంటుంది తులసి. నీకేది మంచిదో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను అంటుంది తులసి. అమ్మ కోసం త్యాగం చేయడం వల్లే నష్టపోయాను అనుకుంటాడు. ఆ ఒక్కటి చాలు.. నేను తలదించుకోవడానికి అంటుంది తులసి.

డాడీ తన దారి తాను చూసుకున్నారు. ప్రేమ్ ను ఇంట్లో నుంచి పంపించేశావు. ఇప్పుడు నన్ను పంపించేస్తున్నావు. అందరినీ పంపించేసి ఎలా ఉంటావు మామ్ అంటాడు అభి. నువ్వు బాగుపడితే చూసి ఆనందించాలని ఉందిరా నాకు కూడా అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 23 April Today Episode :  ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అభి, అంకిత

నేను స్వార్థపరుడినే. ఒక్కోసారి గీత దాటి ఆలోచిస్తాను. నాకోసం మాత్రమే ఆలోచిస్తాను. కానీ.. దాని అర్థం నాకు ఎవ్వరూ అక్కర్లేదు అని కాదు మామ్ అంటాడు అభి. నేను నీకు ఇప్పుడు అడ్డుపడితే.. అది ఏదో ఒక రోజు మనస్పర్థలను తీసుకురావచ్చు అంటుంది తులసి.

సంతోషంగా దూరం అవుదాం. దాని వల్ల కనీసం మన మధ్య ప్రేమ అలాగే ఉండిపోతుంది. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. ప్రేమ్ ను కూడా వాడి భవిష్యత్తు కోసమే పంపించాను. ఇప్పుడు నీ విషయంలో కూడా అంతే. ఇప్పుడు కనుక నువ్వు నా మాట వినకపోతే నన్ను బాధ పెట్టిన వాడివే అవుతావు. అది నీకు ఇష్టమా అంటుంది తులసి.

మొదటి సారి మీ అమ్మ చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. తన గురించి కాకుండా తన పిల్లల గురించి ఆలోచించింది. ఇంకా ఆలోచన ఏంటి అభి. రాహు కాలం రాకముందే బయలు దేరుదాం అంటుంది గాయత్రి. అంకిత మామ్ ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందాం పదా అంటాడు అభి.

వెళ్లే ముందు మీరంటే నాకు ఎంతో ఇష్టం ఆంటి. ఎంత ఇష్టం అంటే.. నా నుంచి దూరంగా మీరు వెళ్లండి అని చెప్పినా కాదనలేని ఇష్టం. మీరు తీసుకున్నది సరైన నిర్ణయమో కాదో.. కాలమే సమాధానం చెబుతుంది ఆంటి.. కేవలం మీ సంతోషం కోసం.. తృప్తి కోసం మీరు చెప్పిన దానికి తలూపాను అంటుంది అంకిత.

మమ్మల్ని దూరం చేసుకొని కూడా మీరు సంతోషంగా లేరని తెలుసుకున్న మరుక్షణం నేను మీ కాళ్ల దగ్గర ఉంటాను అంటుంది అంకిత. ఆ తర్వాత బ్యాగు తీసుకొని అంకిత, అభి.. గాయత్రితో పాటు వెళ్లిపోతారు. అభి, అంకిత వెళ్లిపోగానే.. మీ ఫ్రెండ్ కు ఏదో సమస్య అన్నావు కదా. ఈరోజుతో అది సాల్వ్ అయినట్టే కదా మామ్ అని దివ్య చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

కట్ చేస్తే శృతిని రెస్ట్ తీసుకోమని చెప్పి.. ప్రేమ్ బట్టలు ఆరేస్తా అంటాడు. దీంతో శృతి షాక్ అవుతుంది. నీకు చేతగాని పనుల జోలికి రాకు అంటుంది శృతి. దీంతో నాకు చేతగాని పనా అంటాడు ప్రేమ్. దీంతో తనతో ఓ పందెం కాస్తాడు ప్రేమ్. దీంతో ఆ పందేనికి ఒప్పుకుంటుంది.

దీంతో బట్టలు ఆరేయడం స్టార్ట్ చేస్తాడు ప్రేమ్. తన బట్టలు ఆరేసుకుంటాడు కానీ.. శృతి చీరను మాత్రం ఆరేయలేకపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp