Intinti Gruhalakshmi 26 Oct Today Episode : ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఉద్యోగులు ఆఫీసుకు రాకపోయేసరికి తులసి ఏం చేస్తుంది? ప్రాజెక్ట్ ను ఎలా పూర్తి చేస్తుంది?
Intinti Gruhalakshmi 26 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 అక్టోబర్, 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవికి పూజ చేశాక హారతి తీసుకోండి అని నందుకు ఇస్తుంది శృతి. దీంతో నాకెందుకు హారతి. మేం చేతగానివాళ్లం కదా అంటూ నందు సీరియస్ అవుతాడు. ఒరేయ్ నందు.. దేవుడి మీద ఎందుకురా నీకు కోపం.. ముందు హారతి తీసుకో అంటాడు పరమానందయ్య. నీ జీవితాన్ని నువ్వు చూసుకోరా. వేరే వాళ్ల చేతుల్లో నీ జీవితాన్ని పెట్టకురా అంటూ నందు తన తండ్రిపై సీరియస్ అవుతాడు. మామయ్య గారు అవసరం లేని సలహాలు మీరు ఇవ్వకండి.. అని అంటుంది. దీంతో నందు, లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
నిజంగా తనకు మీ మీద ప్రేమ ఉంటే పూజ చేసి మనసులో అనుకోవాలి కానీ.. ఇలా అందరి ముందు చెప్పడం దేనికి.. అంటూ అంకిత శృతిపై సీరియస్ అవుతుంది. మీకు నిజంగా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం కోసం మీ పెద్ద కొడుకు అభి ఓవర్ నైట్ డ్యూటీ చేస్తున్నాడు. అది నిజంగా హెల్ప్ అంటే అంటూ అంకిత.. తులసికి చెబుతుంది. నేను కూడా సంపాదిస్తున్నాను.. శృతి కాదు. శృతి సంపాదించడం లేదు అంటుంది. దీంతో కరెక్టేనమ్మా నువ్వు చెప్పేది కరెక్టే. కానీ.. శృతి కూడా ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. నువ్వు చేయలేని పనులను కూడా చేస్తోంది.. అంటుంది తులసి. దీంతో ఈ ఇంట్లో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదని నాకు అర్థం అయింది.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంకిత.
కట్ చేస్తే అంకిత ఏడుపు మొహం పెడుతుంది. దీంతో ఏమైంది అంకిత అని అభి అడుగుతాడు. చెప్తే మాత్రం నువ్వేం చేస్తావు. ఎప్పుడూ తప్పు నాదే అంటారు. ఈ ఇంట్లో నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు. మొన్నటి వరకు నేను ఈ ఇంట్లో బంగారు తల్లిని. ఇప్పుడు నేను మట్టి బొమ్మను అయిపోయాను.. అంటుంది అంకిత. శృతి.. ప్రేమ్ ను పెళ్లి చేసుకొని ఇంటికి రాగానే తను గొప్ప అయిపోయింది. నేను తక్కువైపోయాను అంటుంది అంకిత. అందరితో పాటు నువ్వు కూడా మారిపోయావు. నన్ను పట్టించుకోవడం లేదు.. అని ఏడ్చేస్తుంది అంకిత.
Intinti Gruhalakshmi 26 Oct Today Episode : ప్రేమ్, శృతిల రొమాన్స్
మరోవైపు శృతి కూరగాయలు కట్ చేస్తుంటుంది. ఇంతలో రాములమ్మ వచ్చి అమ్మా.. నేను కురగాయలు తరుగుతాను కానీ.. నువ్వు వెళ్లి ప్రేమ్ బాబుకు ఏం కావాలో చూసుకోవచ్చు కదా అంటుంది రాములమ్మ. ప్రేమ్ బిజీగా ఉన్నాడు అంటుంది. ఇంతలో ప్రేమ్ వచ్చి శృతినే చూస్తుంటాడు. ఇంతలో ప్రేమ్ వచ్చి తన దగ్గరే కూర్చొని తననే చూస్తుంటాడు. కాసేపు తనతో సరసాలు ఆడుతాడు. తన నడుము గిల్లుతాడు. అది చూసి రాములమ్మ అరుస్తుంది. వీళ్ల సరసాలు చూసి తులసి కూడా షాక్ అవుతుంది. తనలో తానే నవ్వుకుంటుంది.
కంపెనీ ఉద్యోగులను మళ్లీ రావాలంటూ ఫోన్ చేస్తాడు నందు. మేనేజర్ కు ఫోన్ చేస్తే.. మీ మీద నమ్మకం పోయింది సార్. మేము మళ్లీ కంపెనీకి రాము అంటాడు మేనేజర్. ఇంతలో తులసి వచ్చి ఉద్యోగులు అందరూ వస్తున్నారు కదా అని అడుగుతుంది. రావట్లేదు అంటాడు నందు. దీంతో ఏం చేయాలో తులసికి అర్థం కాదు.
అంకిత విషయం గురించి అభి వచ్చి తులసితో మాట్లాడుతాడు. ప్రతి విషయంలో నువ్వు శృతిని ఎక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అమ్మ అంటాడు అభి. అంకిత ఫీల్ అవుతోంది.. ఏడుస్తూ గదిలో కూర్చుంది.. అంకితను ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడకు అమ్మ.. అంటాడు అభి. మొత్తానికి అభి కూడా శృతిపై కోపం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.