Intinti Gruhalakshmi 29 March Today Episode : తులసిపై నందు, లాస్య సీరియస్.. పరందామయ్య, అనసూయను వెతికేందుకు వెళ్లిన తులసికి షాక్
Intinti Gruhalakshmi 29 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 592 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి వాళ్లను ఎందుకు ఒప్పిస్తుంది అని నందుతో లాస్య అంటుంది. ఇంతలో తులసి వస్తుంది.. మామయ్య, అత్తయ్య మీతో రావడానికి ఒప్పుకున్నారు అని నందుతో చెబుతుంది. దీంతో మేము అడిగినప్పుడు రానన్నవాళ్లు.. నువ్వు చెబితే ఎలా వస్తా అన్నారు అంటుంది లాస్య. అది నీకు అనవసరం అంటుంది తులసి. తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే.. వాళ్లు వచ్చేది మా ఇంటికి అంటుంది తులసి. ఇలా నువ్వు అడ్డంగా మాట్లాడితే వాళ్లను మీతో పంపించేదే లేదు అంటుంది తులసి.

intinti gruhalakshmi 29 march 2022 full episode
దీంతో నువ్వు లాస్య మాటలు పట్టించుకోకు అంటాడు నందు. దీంతో వాళ్లను మంచిగా చూసుకోండి. వాళ్లకు ఏ లోటు రానీయకుండా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. తులసి వెళ్లిపోయాక రేపే మన ప్రయాణం అని చెప్పి.. దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు అని చెప్పి నందు వెళ్లిపోతాడు. కట్ చేస్తే ప్రేమ్, శృతి.. ఇద్దరూ దేవుడికి పూజ చేస్తారు. దేని సమయం దానికి పడుతుంది ప్రేమ్. ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడకూడదు అంటుంది శృతి. దీంతో అమ్మను తప్పుపడుతున్నావు శృతి అంటాడు ప్రేమ్. దీంతో నేను ఆంటిని తప్పుపట్టడం లేదు. తను మాట్లాడిన మాటల గురించి చెబుతున్నాను అంటుంది శృతి.
మీ అమ్మ అన్న మాటలను తప్పు అని నువ్వు రుజువు చేయాలి. నీకు ఒక్క కొడుకు కాదమ్మా.. ఇద్దరు కొడుకులు అని తెలిసేలా చేయాలి. ఇది ఆంటి మీద కోపం కాదు. నా గుండెల్లో బాధ. అర్థం చేసుకో అంటుంది. దీంతో అమ్మ కోపం తగ్గడానికి కాదు. నీ గుండెల్లో బాధ తగ్గడానికి చేస్తాను అంటుంది శృతి.
మరోవైపు తెల్లారుతుంది. నందు, లాస్య ఇంట్లో నుంచి వెళ్లే టైమ్ వస్తుంది. పరందామయ్య, అనసూయ.. ఇద్దరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లేందుకు దివ్య, అంకిత, అభి ఒప్పుకోరు. అందరూ బాధపడతారు. ఆంటి మీకు కోపం వచ్చినా సరే.. అమ్మమ్మ వాళ్లు వెళ్లకుండా మేము అడ్డుకుంటాం అంటుంది అంకిత.
దివ్య కూడా ఏదో అనబోయే సరికి ఇక ఆపుతారా అంటుంది తులసి. వాళ్లతో నాకు మీ నాన్న విడాకులు ఇచ్చినప్పుడే బంధం తెగిపోయింది. అనుబంధం మాత్రమే ఉంది. మీ నాన్నకే వాళ్ల మీద హక్కు ఉంది. వాళ్లను విడదీస్తే పాపం చేసినట్టు అవుతుంది అంటుంది తులసి.
Intinti Gruhalakshmi 29 March Today Episode : నందును పట్టుకొని ఏడ్చేసిన దివ్య
మరోవైపు నందును పట్టుకొని దివ్య ఏడుస్తుంది. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. ఇది లాస్య ఆంటి తీసుకున్న నిర్ణయమని అంటుంది దివ్య. దీంతో మీ అందరి కళ్లకు నేనే కనిపిస్తాను అంటుంది లాస్య. కనీసం వెళ్లేటప్పుడయినా ప్రశాంతంగా వెళ్లనీయరా అంటుంది లాస్య.
మరోవైపు పరందామయ్య, అనసూయ కోసం వాళ్ల రూమ్ లోకి వెళ్తుంది అనసూయ. కానీ.. వాళ్లు కనిపించరు. కానీ.. అక్కడ లెటర్ కనిపిస్తుంది. దాన్ని తీసుకొని హాల్ లోకి వస్తుంది రాములమ్మ. అమ్మ.. పెద్దయ్య గారు వాళ్లు రూమ్ లో లేరమ్మా అంటుంది రాములమ్మ.
దీంతో అందరూ షాక్ అవుతారు. ఇదేదో ఉత్తరం రాసిపెట్టుంది అంటుంది. ఆ లెటర్ చదివి నందు షాక్ అవుతాడు. అమ్మ తులసి.. నువ్వు వెళ్లమని బలవంతం పెట్టావు కాబట్టి ఒప్పుకున్నాం కానీ.. మాకు నందుతో వెళ్లడం ఇష్టం లేదు. మేము బతికుండగా మా మనసు చంపుకొని వాడితో వెళ్లలేం.
అలా అని నీకు మాటిచ్చాక ఈ ఇంట్లో ఉండలేం. అందుకే.. తప్పనిసరై ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాం. ఇక ఎప్పటికీ తిరిగిరాం. మా గురించి వెతకడం కానీ.. ఆలోచించడం కానీ చేయకండి.. అని లెటర్ లో రాసిపెట్టి ఉంటుంది. ఆ లెటర్ ను చూసి.. ఏంటి ఈ డ్రామా తులసి అంటాడు నందు.
నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటాడు నందు. వాళ్లు ఇల్లు వదిలి వెళ్లిన విషయం నాకు తెలియదు అంటుంది తులసి. వాళ్లను నువ్వే ఎక్కడో కనబడకుండా దాచావు అంటుంది లాస్య. వాళ్లను దాచాల్సిన అవసరం నాకేంటి అంటుంది తులసి.
దీంతో మాతో పంపించడం ఇష్టం లేదు కాబట్టి అంటాడు నందు. కట్ చేస్తే.. పరందామయ్య, అనసూయను వెతకడం కోసం తులసి, మాధవి ఇద్దరూ బయటికి వెళ్తారు. వాళ్లను వెతుకుతుండగా.. పరందామయ్య, అనసూయ కనిపిస్తారు. అక్కడికి వెళ్లేలోపు దాచుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.