koratala Siva : కొరటాల శివ గురించి పిచ్చ వాగుడు వాగే వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది !
Koratala Siva : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లలో ఒకరు కొరటాల శివ. రైటర్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారాడు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే కొరటాల పోసాని కృష్ణమురళికి స్వయానా మేనల్లుడు. మామ దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి ఊహించనంత స్థాయికి ఎదిగాడు. ఇదంతా కేవలం కొరటాల టాలెంట్ కి సాధ్యమైంది. పోసాని మేనల్లుడు అని ఆయనకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ఆయన ప్రతిభను గుర్తించి వచ్చిన అవకాశాలే. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో కొరటాల అంటే ఏంటో అర్థమైంది. రెండు సినిమాల్లో కొన్ని కామన్ పాయింట్లు కనిపిస్తాయి.
వ్యక్తిగతంగా కొరటాల కొన్ని విలువలు పాటిస్తారు. తాజాగా అలాంటి సందర్భం ఒకటి బయటకు వచ్చింది. సాధారణంగా ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదిగితే ఇతరులను పట్టించుకోవడం మానేస్తారు. ఎదిగిన తర్వాత తెలిసిన వాళ్ళు కంటి ముందు ఎదురుపడితే తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ వాళ్లు అవకాశాలు అడుగుతారు అని, వాళ్లకి ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక తప్పించుకుంటూ ఉంటారు. కానీ కొరటాల మాత్రం అలా కాదు. డైరెక్టర్ అయిన తర్వాత ఎలా ఉన్నారు అనడానికి ఈ సన్నివేశం ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో తిరిగే ఓ యువకుడికి కొరటాల డైరెక్టర్ కాకముందే అన్నపూర్ణ స్టూడియోలో పరిచయం ఏర్పడింది. అప్పుడు చాలా సాధారణంగా ఇద్దరు మాట్లాడుకున్నారు. తర్వాత కొరటాల పెద్ద డైరెక్టర్ అయ్యారు.
ఆ క్రమంలోనే ఆయన దర్శకత్వం వహించిన భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా పలు ఈవెంట్స్ లలో కొరటాల పాల్గొన్నారు. అయితే సినిమా ఈవెంట్లో తన పాత పరిచయస్తుడిని గుర్తుపట్టి మరి కొరటాల పలకరించారు. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు వంటి వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే మేనేజర్ ని పిలిపించి అతడి నెంబర్ తీసుకొని తనని ఎప్పుడు అతను కలవాలని వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వు అని ఫోన్ చేసి విషయం వెంటనే నాకు చెప్పు అని కొరటాల అన్నారట. ఓ సాధారణ వ్యక్తి కోసం కొరటాల అంత తపించిపోవడం నిజంగా గ్రేట్ అని జనాలు అంటున్నారు. అంత పెద్ద స్థాయికి ఎదిగిన కొరటాలలో కొన్ని విలువలు దాగి ఉన్నాయిని, కొరటాల నిజంగా శ్రీమంతుడు అని అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.