ఆర్ ఆర్ ఆర్ .. ఆచార్య మధ్యలో రాం చరణ్.. ఎటూ తేల్చుకోలేకపోతున్నాడా …?
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్ ఆర్ ఆర్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసందే. రాజమౌళి ఎంతో ప్రతిస్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. నిహారిక పెళ్ళి కోసం ఆర్ ఆర్ ఆర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న చరణ్ త్వరలో మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ లో జాయిన్ కాబోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ఆలియా మీద కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట.
ఇక ఈ సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ ల పాత్రలని కలిపే ముఖ్య పాత్రలో ఆలియా కనిపించబోతుండగా అజయ్ దేవగన్, శ్రియ శరణ్, ఓలియా మోరిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ని ఫిబ్రవరి లేదా మార్చ్ వరకు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం. కాగా ఆచార్య లో కూడా చరణ్ నటించాల్సి ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆచార్య షూటింగ్ మొదలు పెట్టిన కొరటాల శివ నాన్ స్టాప్ గా చిత్రీకర చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కూడా ఆచార్య షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మెగాస్టార్ మీద సోలో సాంగ్ కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది.
కొరటాల ఈ సినిమా షూటింగ్ ని మార్చ్ వరకు కంప్లీట్ చేసేలా షూటింగ్ జరుపుతున్నాడట. ఈ క్రమంలో ఆచార్య లో కీలక పాత్ర పోషిస్తున్న చరణ్ దాదాపు 20 రోజులు ఈ సినిమా కోసం కేటాయించాల్సి ఉండగా జనవరిలో ఆ డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ నుంచి కాస్త గ్యాప్ తీసుకొని ఆచార్య షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ లో జాయిన్ కానున్నాడట. మొత్తానికి చరణ్ అటు ఆర్ ఆర్ ఆర్ .. ఇటు ఆచార్య కోసం బాగానే ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. ఏదేమైనా వచ్చే ఏడాది చరణ్ నుంచి రెండు భారీ సినిమాలు అభిమానులకి పండగే.