Sukumar : డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో ఐటీ అధికారుల సోదాలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sukumar : డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో ఐటీ అధికారుల సోదాలు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :19 April 2023,12:00 pm

Sukumar : తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో డైరెక్టర్ సుకుమార్ ఒకరు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. 2021వ సంవత్సరంలో “పుష్ప” సినిమా చేసి దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించారు. ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేయటం జరిగింది. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా..

IT officials searched Sukumar house

IT officials searched Sukumar house

స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ వీడియోతో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా బుదవారం సుకుమార్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో మరియు ఆయన కార్యాలయాల్లో ఐటీ అధికారులు… ఒక్కసారిగా సోదాలు నిర్వహించడం జరిగిందట. డైరెక్టర్ సుకుమార్ తో పాటు పలువురు ప్రముఖులు మరియు సెలబ్రిటీల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులకు కారణమిదే..!

ఈ వార్త ఇండస్ట్రీలో మరియు ఎలక్ట్రానిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సుకుమార్… “పుష్ప 2” షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వేగవంతంగా జరుగుతుంది. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో భాగం దానికి మించే విధంగా విజయం సాధించాలని… స్క్రిప్ట్ విషయంలో ఇంకా అన్ని రకాలుగా డైరెక్టర్ సుకుమార్ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం కంటే మరిన్ని ఎక్కువ భాషల్లో పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేయబోతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది