Anchor Sowmya Rao : కన్నీళ్లు పెట్టిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్ ఫ్లాష్ బ్యాక్ .. ” మా నాన్న మోసం చేశాడు ” అంటూ ఏడ్చేసిన సౌమ్యరావు ..!
Anchor Sowmya Rao : బుల్లితెరలో జబర్దస్త్ షో కి ఫుల్ క్రేజ్ ఉంది. ఇటీవల జబర్దస్త్ లో ఎన్నో మార్పులు జరిగాయి. కొత్త యాంకర్ కొత్త జడ్జిలు వచ్చారు. అయిన షో కి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్న కమెడియన్స్ కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి. జబ్బులతో, ఆర్థిక సమస్యలతో ఎంతోమంది బాధపడుతూనే మనల్ని నవ్విస్తుంటారు. అలాంటి షో కి తాజాగా యాంకర్ సౌమ్య ఎంట్రీ ఇచ్చింది. అనసూయ వెళ్ళిపోయాక ఆమె స్థానంలో తన అందాలతో మెప్పిస్తుంది సౌమ్యరావు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ని పూర్తి చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తన భాషలో ఏదో గమ్మత్తు, కాన్ఫిడెన్స్, తన నాజూకు అందాలు అప్పుడే సౌమ్య ని ఆడియన్స్ కి దగ్గర చేశాయి.సౌమ్య సంథింగ్ స్పెషల్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే యాంకర్ సౌమ్య తన జీవితం గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారు. తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి కన్నీళ్లు ఆగవు. సౌమ్య జబర్దస్త్ కంటే ముందు మరో టీవీ షో చేసింది. హైపర్ ఆదితో కలిసి అందులో చాలా హంగామా చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన జబర్దస్త్ తన షో కి యాంకర్ గా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ షో లో యాంకర్ ప్రదీప్ ఆమె ఫ్యామిలీ గురించి చెప్పమని అడగగా నేను చెప్పను అని అందరికీ షాక్ ఇచ్చింది సౌమ్య. ప్రదీప్ మళ్లీ అడగడంతో తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పేసింది సౌమ్య.
నా లైఫ్ గురించి చెప్పను. నాకు అమ్మ లేదు, నాన్న ఉండి కూడా లేడు. మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం నేను ఓ అనాథని. నాకు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్న వారందరికీ అమ్మనో, నాన్ననో, బ్రదర్ నో, సిస్టర్ నో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. కానీ నాకు ఎవరూ లేరు. ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది సౌమ్య రావు. ఇది విన్న అందరి హృదయాలు బరువెక్కిపోయాయి. కన్నడ కి చెందిన సౌమ్యరావు మోడలింగ్ నుంచి టీవీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమెకు ఉన్న టాలెంట్ ద్వారా జబర్దస్త్ షో కి రాగలిగింది. అలాగే ప్రేక్షకులు కూడా జబర్దస్త్ కి యాంకర్ గా సౌమ్యరావుని ఉంచాలని కోరుకుంటున్నారు.