jabardasth praveen : ఫైమా లవర్ జబర్దస్త్ ప్రవీణ్ కష్టానికి దక్కే పారితోషికం అంతేనా?
jabardasth praveen : జబర్దస్త్ లో చేసే పలువురు కమెడియన్స్ అత్యంత దారుణమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొన్నాం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటారు. బుల్లి తెరపై జోకులు వేస్తూ ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా కనిపిస్తున్న కమెడియన్స్ నిజ జీవితంలో మాత్రం ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడ్డట్లుగా చెప్పుకొచ్చారు. కొన్ని ఎపిసోడ్స్ చేసిన తర్వాత గౌరవప్రదమైన రెమ్యూనరేషన్ ఇస్తారు కానీ ఆరంభంలో మాత్రం చాలా దారుణంగా పరిస్థితి ఉంటదని జబర్దస్త్ లో చేసిన వాళ్ళు.. చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఆరంభంలో కేవలం భోజనం పెట్టి పంపిస్తారని.. 500 నుండి 1000 రూపాయలు కూడా ఇచ్చేందుకు ఆసక్తి చూపించారని గతంలో ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఇక జబర్దస్త్ ( jabardasth ) లో గత కొంత కాలంగా చేస్తూ మంచి గుర్తింపును దక్కించుకున్న ప్రవీణ్ ( jabardasth praveen ) కి దక్కే పారితోషకం తాజాగా బయటకు వచ్చింది. ఫైమాతో రిలేషన్షిప్ కారణంగా జబర్దస్త్ ప్రవీణ్ కి మంచి గుర్తింపు దక్కిందని చెప్పాలి. పటాస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలతోనే ఈయనకు ఎక్కువ గుర్తింపు లభించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన ఒక్క రోజు కాల్ షీట్ కి 5000 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఆరు నెలల క్రితం వరకు 1000 నుండి 1500 రూపాయలు మాత్రమే ఈయనకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారట.

jabardasth praveen remuneration for etv shows
ఈమధ్య రాకింగ్ రాకేష్ టీమ్ లో రెగ్యులర్ కంటెస్టెంట్ గా చేస్తున్న కారణంగారెమ్యూనరేషన్ పెరిగిందట. కాస్త పారితోషికం పెంచి తన టీం లో మెయిన్ లీడ్ గా తీసుకున్న రాకేష్ అతడిని బాగానే వాడేసుకుంటున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించే ప్రవీణ్ అక్కడ కూడా అదే పారితోషకమును తీసుకుంటాడట. నెలకు అటు ఇటుగా 50 నుండి 60 వేల రూపాయలను సంపాదించే ప్రవీణ్ ఇప్పుడిప్పుడే జీవితంలో సెటిల్ అవుతున్నాడు. తల్లిని చిన్నప్పుడే కోల్పోయిన ప్రవీణ్ ఇటీవలే తండ్రిని కూడా కోల్పోవడంతో జబర్దస్త్ స్టేజిపై కన్నీళ్లు పెట్టుకోవడం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఫైమాతో ప్రేమ నిజమా లేదా అనేది ఆమె బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.