Indraja : ఇంద్రజ కూడా అదే పనిలో ఉందా..?
Indraja : జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీకి అస్సలు టైమ్ బాగాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే జబర్దస్త్ కు ఈమద్య కాలంలో రేటింగ్ మరీ దారుణంగా పడిపోయింది. అదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుధీర్ తప్పుకోవడంతో ఉన్నట్లుండి కింద పడి పోయింది. మొన్నటి వారం లో సుధీర్ బదులుగా రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేసింది. దాంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. సుధీర్ లేకుండా మేము ఈ షో ను చూడము అంటూ కొందరు తెగేసి చెప్పేశారు. ఇదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీకి ప్రత్యేక ఆకర్షణగా ఉండే ఇంద్రజ కూడా కనిపించకుండా పోయింది.
ఆమె జబర్దస్త్ కు వెళ్లడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి తప్పించారు. ఇంద్రజ లేక పోవడంతో ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో హైప్ తగ్గింది. సుధీర్ మరియు ఇంద్రజలు తల్లి కొడుకులు గా పండించే ఒకరకమైన కామెడీ మరియు మంచి ఎమోషన్ తో అంతా కనెక్ట్ అయ్యారు. సుధీర్ వెళ్లి పోవడంతో జబర్దస్త్ ఎపిసోడ్ లో ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఇంద్రజ కూడా అవకాశం వస్తే పక్క ఛానల్ కు జంప్ అయ్యేందుకు సిద్దం అన్నట్లుగా ఉందట.

jabardasth and Sridevi Drama Company shows judge indraja going out very soon
సుధీర్ స్టార్ మా కు వెళ్లడంతో ఖచ్చితంగా ఇప్పుడు కాకున్నా కొన్ని రోజులకు అయినా ఇంద్రజ ఛానల్ మార్చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ లో ఇంద్రజ ను రోజా స్థానంలో ఉంచారు. అక్కడ ఆమె ఇమడటం కష్టమే.. ఎందుకంటే అక్కడి పరిస్థితులు వేరుగా ఉంటాయి. కనుక ఇంద్రజ అతి త్వరలోనే ఛానల్ మారే అవకాశాలు ఉన్నాయని.. అదే ప్రయత్నాల్లో ఇంద్రజ ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.