Jabardasth Avinash : అనారోగ్యం పాలైన అవినాష్.. కమెడియన్ ప్రస్తుత పరిస్థితి ఇదే
Jabardasth Avinash జబర్దస్త్ అవినాష్ కాస్తా Jabardasth Avinash ఇప్పుడిప్పుడు కామెడీ స్టార్స్ అవినాష్‌గా మారిపోతోన్నాడు. బిగ్ బాస్ అవినాష్ అని చాలా తక్కువ మంది సంబోధిస్తుంటారు. చాలా మంది ముక్కు అవినాష్ అనే అంటారు. అలా మొత్తానికి అవినాష్‌కు మాత్రం మంచి పేరే ఉంది. సోషల్ మీడియాలోనూ ఇక అవినాష్ చేసే అల్లరి మామూలుగా ఉండదు. తన గ్యాంగుతో కలిసి దుమ్ములేపుతుంటాడు. శ్రీముఖి, ఆర్జే చైతూ, శ్రీముఖి సోదరుడు శుశ్రుత్, తమన్నా, విష్ణుప్రియలతో కలిసి రచ్చ చేస్తుంటాడు.
ఈ మధ్య శ్రీముఖి వరుసగా కొన్ని వీడియోలను షేర్ చేసింది. బోనాల జాతర అంటూ వరుసబెట్టి వీడియోలను వదిలింది. ఇందులో ఆర్జే చైతు, అవినాష్, శ్రీముఖి, తమన్నా సింహాద్రి, శుశ్రుత్ కలిసి రచ్చ చేశారు. అంతకు ముందు అవినాష్ Jabardasth Avinash బర్త్ డే పార్టీ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఇక అందులోనే తనకు కాబోయే శ్రీమతి అనూజతో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కూడా కానిచ్చేశాడు. ఇలా అంతా బాగానే ఉంది. కానీ తాజాగా అవినాష్ ఆనారోగ్యానికి గురయ్యాడు.
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న అవినాష్ Jabardasth Avinash
అసలే ఇప్పుడు సీజన్ ఏమీ బాగా లేదు. అందరూ కూడా వైరల్ ఫీవర్లు, డెంగ్యూలతో బాధపడుతున్నారు. అవినాష్‌కు కూడా వైరల్ ఫీవర్ అటాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అవినాష్ తన ఆరోగ్య పరిస్థితి మీద అప్డేట్ ఇచ్చాడు. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని తెలిపాడు. మెల్లిగా కోలుకుంటున్నాను అని వైరల్ ఫీవర్ తగ్గుతోందని చెప్పుకొచ్చాడు. బయట వాతావరణం ఏమీ బాగాలేదని, ఊహించలేకపోతోన్నాం.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని కోరాడు.