Jabardasth Naresh : షబినాతో రొమాంటిక్ సాంగ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ నరేష్..!
Jabardasth Naresh: బుల్లితెర కార్యక్రమం జబర్ధస్త్ ప్రేక్షకులకి ఎంత వినోదం పంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి వారం జబర్ధస్త్‌తో పాటు ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ఫుల్ ఫన్ పంచుతుంది. ఇందులో కొన్ని సన్నివేశాలు శృతిమించేలా ఉంటాయి. డుబుల్ మీనింగ్ డైలాగులతో వారు చేస్తున్న రచ్చకి కొదవే ఉండదు. తాజాగా జబర్ధస్త్ స్టేజ్ మీద పలు జంటలు ప్రేమలో పడ్డట్టుగా చూపించారు. రాకేష్ – జోర్ధార్ సుజాత్ ఇద్దరు ఓ జంటగా వచ్చి రచ్చ చేశారు. ప్రవీణ్- ఫహిమాలు కూడా లవ్ ప్రపోజ్ చేసుకుంటున్నట్టు కనిపించారు. ప్రతి విషయంలో తోడు ఉంటుందని చెప్పాడు.
అందాల ముద్దుగుమ్మ షబీనా- పొట్టి నరేష్ ఓ జంటగా కనిపించి సందడి చేశారు. నరేష్ తన చైన్‌ని గిఫ్ట్‌గా ఇచ్చినట్టు చూపించారు. సొట్ట బుగ్గల మీద కూడా సెటైర్స్ వేశారు. చెట్టు వెనకకి వెళ్లి వారు ఏదో చేస్తున్నట్టు నటించడం నవ్వులు పూయించింది. అంతేకాదు నరేష్‌పై రోజా పలు పంచ్‌లు కూడా వేసింది. కరెంట్ బిల్లు కట్టమని వెయ్యు రూపాయలు ఇచ్చానని సుధీర్ .. రామ్ ప్రసాద్‌తో అనగా అందుకు రామ్ ప్రసాద్ పేకాడితే డబ్బులు పోతాయంటే నా ఫ్రెండ్ నమ్మలేదు.

Jabardasth Naresh romance Song with shabeena
Jabardasth Naresh : షబీనా- నరేష్ రొమాన్స్ వేరే రేంజ్‌లో ఉందిగా..
నేను పేకాడి డబ్బులు పోగొట్టుకుంటే నమ్మాడు అని పంచ్ వేశాడు.ఇక సుధీర్ కి ఐదు వేలు ఇచ్చాను అని శీను అనగా, అవి ఏమయ్యాయి అంటే అప్పుడు సుధీర్.. ఓ అమ్మాయి ఆఫీస్ నుండి వస్తుంటే లిఫ్ట్ అడిగింది. వర్షం లో ఇద్దరు తడిచాం. బట్టలు ఆరబెట్టుకునేందుకు హోటల్ తీసుకొని అక్కడ ఆరబెట్టుకున్నాం అని జోక్ వేశాడు సుధీర్. ఇది నవ్వులు పంచింది. ఇక బాహుబలి స్పూఫ్ కూడా ప్రయత్నించారు. అయితే కట్టప్పకే వెన్ను పోటు పొడవడం నవ్వులు తెప్పించాయి. మొత్తానికి ఈ వారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగనుందని తెలుస్తుంది. అదిరిపోయే పంచ్‌లతో షో ఆసక్తిగా ఉండనుంది.
