Jabardasth Rakesh – Sujatha : జబర్దస్త్ రాకేష్ పెళ్లి దగ్గరుండి చేసిన మంత్రి రోజా వీడియో వైరల్..!!

Advertisement

Jabardasth Rakesh – Sujatha : తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షో హైలైట్ అని అందరికీ తెలుసు. ఈ షోలో కనబడే చాలామంది కామిడీయన్ లు సెలబ్రిటీ స్టేటస్ సంపాదించేసుకున్నారు. ఈ రీతిగానే ఈ షోలో రాకింగ్ రాకేష్… అద్భుతమైన స్కిట్స్ తో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. జబర్దస్త్ షోలో తనతో పాటు తోటి కంటెస్టెంట్ సుజాతతో స్కిట్లు చేస్తూ.. ఆమెతోనే ప్రేమలో పడటం జరిగింది. ఈ విషయాన్ని పెళ్లికి ముందు ఓపెన్ గానే రాకేష్ ప్రకటించాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల పెళ్లి చేసుకోవడం జరిగింది. తిరుపతిలో కుటుంబ సభ్యులు..

Advertisement
Jabardasth Rakesh and Sujatha Got Married
Jabardasth Rakesh and Sujatha Got Married

బంధుమిత్రుల సమక్షంలో సుజాత తో రాకింగ్ రాకేష్ ఏడడుగులు వేశాడు. ఈ పెళ్లికి సంబంధించి ఫోటోలు మరియు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రాకింగ్ రాకేష్ సుజాత పెళ్లికి.. చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. యాంకర్ రవి, మిమిక్రీ ఆర్టిస్ట్ శివబాలాజీ..గేట్ అప్ శ్రీను… ఇంకా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. కాగా తిరుపతిలో జరిగిన ఈ పెళ్లిలో ఏపీ మంత్రి ఒకప్పుడు జబర్దస్త్ జడ్జి రోజా దగ్గరుండీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందట.

Advertisement
Jabardasth Rakesh and Sujatha Got Married
Jabardasth Rakesh and Sujatha Got Married

రోజా మాత్రమే కాదు ఆమె భర్త ఆర్.కే. సెల్వమన్ వధూవరులకు అన్ని సదుపాయాలు కల్పించి వారి వెన్నంటే ఉన్నారు. జబర్దస్త్ షోకి రోజా జడ్జిగా ఉన్న సమయంలో రాకింగ్ రాకేష్ కామెడీ ఆమె ఎంతగానో ఆస్వాదించేది. ఇంక రాజకీయంగా రోజా బిజీ అయిన సమయంలో.. రాకేష్ మరియు సుజాత అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఆమె సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరిగింది. తిరుపతిలో జరిగిన ఈ పెళ్లికి తెలుగు బుల్లితెర ప్రముఖ యాంకర్లు… జబర్దస్త్ షో కి సంబంధించిన వాళ్ళు హాజరయ్యారు.

Advertisement
Advertisement