Jabardasth : జబర్ధస్త్ షో ఇక ముగింపు దశకు వచ్చినట్టేనా..!
Jabardasth : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించిన కామెడీ షో జబర్ధస్త్. ఈ కార్యక్రమం వలన చాలా మంది సెలబ్రిటీలుగా మారారు. మరో వైపు ఈ షో స్పూర్తితో ఇలాంటి కామెడీ షోలు చాలా పుట్టుకొచ్చాయి. కాని జబర్ధస్త్ హిట్ అయినంతగా మిగతావి హిట్ కాలేదు. సుదీర్ఘకాలంగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లకు ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో రేటింగ్ రావడం లేదు. ఎప్పుడో వచ్చినా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ నే ఇంకా నెట్టుకొస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో కొత్త టీమ్స్ వచ్చినా అవి ఇప్పటివరకు క్లిక్కయ్యి ప్రతిభ కనబరచడంలో సఫలము కాలేకపోతున్నాయి.
కొత్తగా టీమ్స్ ని క్రియేట్ చేసే టైమ్ లో వ్యక్తిగతంగా పేరు పెట్టకుండా స్పెషల్ టీమ్ అంటూ పేరు పెడుతున్నారు. స్పెషల్ టీమ్ ఏదీ కూడా ఆకట్టుకోలేక పోతుంది. అమ్మాయిలతో ఒక స్పెషల్ టీం చేయడం జరిగింది.ఆ స్పెషల్ టీం కామెడీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో చేతులెత్తేసారు. ఇప్పుడు జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా స్పెషల్ టీమ్స్ తీసుకొచ్చారు. ఆ స్పెషల్ టీం లు పెద్దగా ప్రభావం చూపిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ఆ స్పెషల్ టీమ్ లను కూడా ఎత్తేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. హైపర్ ఆది మరియు సుడిగాలి సుధీర్ వంటి కమెడియన్స్ ఎందుకు రావడం లేదు అని మల్లెమాల వారు జుట్టు పీక్కుంటున్నారు.

jabardasth show comes to end
Jabardasth : జబర్ధస్త్ అభిమానులకి పెద్ద షాక్..!
కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నా కూడా వారు ఉపయోగించుకోలేక పోతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ విషయంలో నిర్వాహకులు ఇంకా ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలని ప్రేక్షకులు, అభిమానులు కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.మరోవైపు జబర్ధస్త్,ఎక్స్ ట్రా జబర్ధస్త్ లాంటి షోలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అలాంటి షోలని అంత ఈజీగా ఆపేయరు. మల్లెమాల ఏదో ఒక ప్లాన్ చేసి మరి ఈ షోని లేపుతుందనే వాదన వినిపిస్తుంది. మా టీవీలో ఇప్పటికే ఇలాంటి కామెడీ షోలు ఎన్నో ప్లాన్ చేసిన సరైన గుర్తింపు రాలేదు. దీంతో నాగబాబు ని పట్టుకొచ్చారు.మరి నాగబాబు వచ్చాక కూడా పెద్దగా టీఆర్పీలలో తేడా ఏం కనిపించడం లేదు.