Jabardasth Varsha – Sujatha : రాకేష్ కోసం జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్న వర్ష, సుజాత
Jabardasth Varsha – Sujatha ; బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ ఇటీవల టిఆర్పి రేటింగ్స్ కోసం చెత్త చెత్త స్కిట్స్ వేస్తూ జనాలకు కోపం తెప్పిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ ఎపిసోడ్ లో రాకింగ్ రాకేష్ ఆయన భార్య సుజాత రెచ్చిపోయి పర్ఫామెన్స్ చేశారు. ఆ ఎపిసోడ్ లో ఎదురెదురుగా హోటల్ పెట్టుకొని నిద్ర లేచిన మొదలు గొడవ పడుతూనే ఉంటారు. అయితే స్కిట్లో భాగంగా రాకింగ్ రాకేష్ పచ్చి బూతులతో స్టార్ట్ చేశారు. పొద్దు పొద్దున్నే దరిద్రపు దాని చూడాల్సి వచ్చింది అంటూ లేడీ గెటప్ లో ఉన్న రాకేష్ తిట్లు స్టార్ట్ చేస్తే, దానికి బదులుగా సుజాత ఈ దరిద్రపు మొహం దాన్ని చూసిన నేను దరిద్రపు గొడ్డుదాన్ని అంటూ రెచ్చిపోయింది. దీంతో కాసేపు అక్కడ జనాలు నవ్వుకున్నారు.
అంతటితో ఆగకుండా సుజాత రెండు కాళ్లు పైకి లేపి కొడతా ఏమనుకుంటున్నావు అంటూ ఘాటు పదాలతో స్కిట్ ని పీక్స్ కి తీసుకెళ్ళింది. దీంతో రాకేష్ సింపతి క్రియేట్ చేయడానికి పక్కనే ఉన్న వర్ష దగ్గరికి వెళ్లి ఒడిలో కూర్చుంటాడు. దీంతో ఒక్కసారిగా వర్ష షాక్ అయిపోతుంది ఆమెతోపాటు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. ఇక మనకు తెలిసిందే రాకింగ్ రాకేష్ కి పెళ్లయింది. అలాంటప్పుడు ఒక అమ్మాయి ఒడిలో కూర్చోవడం ఏంటి అని జనాలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇది చూసిన సుజాత కోపంతో స్టేజి దిగివచ్చి వర్షాన్ని జుట్టు పట్టుకొని కొట్టింది. అయితే స్కిట్లో భాగంగా ఆమె అలా చేసినట్లు లేదు.
సుజాత ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నిజంగానే కోపంతో కొట్టేసినట్లు అనిపిస్తుంది. నా మొగుడిని నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావేంటి అని ఫైట్ చేసేసింది. అయితే రాకింగ్ రాకేష్ ఇలా వర్ష ఒళ్లో కూర్చోవడం జనాలకి అంతగా నచ్చలేదు. ఈ మధ్యనే పెళ్లి అయిన మీరు ఇలాంటి చెత్త స్కిట్స్ చేస్తారా, కామెడీ కోసం ఇలాంటి స్కిట్స్ వేస్తారా అని జనాలు ఫైర్ అవుతున్నారు. అంతేకాదు సుజాత వెనక్కి తగ్గితే నీ మొగుడు నెత్తికెక్కి కూర్చుంటాడు అని సజెషన్స్ ఇస్తున్నారు. రాకేష్ ని కంట్రోల్ లో పెట్టుకోకపోతే, ఈ బ్రతుకు గోవిందా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు.